Webdunia - Bharat's app for daily news and videos

Install App

28-08-2023 సోమవారం రాశిఫలాలు - రాజరాజేశ్వరి అమ్మవారిని పూజించినా మీ సంకల్పం..

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2023 (04:00 IST)
మేషం :- వ్యాపారాభివృద్ధికి ప్రత్యర్థుల నుండి గట్టిపోటీ ఎదుర్కుంటారు. రిజిస్ట్రేషన్ వ్యవహారాలు, లీజు, ఏజెన్సీలకు సంబంధించిన విషయాలలో మెళకువ వహించండి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో ఉత్సాహం, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఇతరుల గురించి మీరు చేసిన వ్యాఖ్యలు పలు సమస్యలకు దారితీయవచ్చు.
 
వృషభం :- వీలైనంత వరకు బయటి ఆహారాన్ని భుజించకండి. నరాలు, పొట్ట, కాళ్లకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. తలపెట్టినపనిలో కొంతముందు వెనుకలుగానైనను సంతృప్తి కానరాగలదు.
 
మిథునం :- ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. స్త్రీలకు షాపింగులోను, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ప్రధానం. సోదరీ, సోదరులతో ఏకీభవిచలేకపోతారు. వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు మెళకువ అవసరం. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు ఆదాయం బాగుంటుంది. 
 
కర్కాటకం :- ఉద్యోగస్తుల శ్రమకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. సన్నిహితుల సూచనలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. పారిశ్రామిక రంగంలో వారికి కార్మికులతో చికాకులు తప్పవు. స్త్రీలకు అలంకరణ, విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
సింహం :- ఆర్థిక వ్యవహారాలలో భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఏ చిన్న అవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవటం మంచిది. రాజకీయ నాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. మీ యత్నాలకు సన్నిహితుల సహకారం లభిస్తుంది.
 
కన్య :- అనవసర ప్రసంగం వలన అధికారులతో అవగాహన కుదరకపోవచ్చు. ప్రయాణాలలో మెళకువ అవసరం. ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి కనబర్చటం వల్ల మందలింపులు వంటివి ఎదుర్కొనవలసి వస్తుంది. రాజకీయాలలోని వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ కుటుంబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు.
 
తుల :- ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. మిమ్మల్ని అభిమానించే వారి మనసును కష్టపెట్టకండి. తలకు మించిన బాధ్యతలతో ఆరోగ్యం దెబ్బతింటుంది. జాగ్రత్త వహించండి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. దూరపు బంధువుల నుంచి అందిన ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి.
 
వృశ్చికం :- రాజకీయ నాయకులకు విదేశీపర్యటనలు వాయిదాపడతాయి. దంపతుల మధ్య ఏకీభావం సాధ్యం కాదు. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి గడిస్తారు. మీ పథకాలు, షాపుల అలంకరణ మంచి ఫలితాలిస్తాయి. మీ సహాయం పొంది మిమ్మల్ని తక్కువ అంచనా వేయటంవల్ల ఆందోళనకు గురవుతారు.
 
ధనస్సు :- శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన అవసరం. ఉద్యోగ యత్నంలో నిరుత్సాహం వీడండి. వాదోపవాదాలకు దిగకుండా లౌక్యంగా మీ వ్యవహరాలు చక్కబెట్టుకోవలసి ఉంటుంది. మీ మిత్రుల కోసం, బంధువుల కోసం బరువు బాధ్యతలు స్వీకరిస్తారు.
 
మకరం :- రుణాలు తీరుస్తారు. ఊహగానాలతో కాలం వ్యర్ధం చేసుకుండా సద్వినియోగం చేసుకోండి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మిత్రులకు మీ సమస్యలు తెలియచేయటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగస్తులకు విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి.
 
కుంభం :- సామూహిక దైవ కార్యక్రమాల పట్ల ఆశక్తి పెరుగుతుంది. మీ మనోభావాలు బయటకి వ్యక్తం చేసి సమస్యలు తీర్చుకోగలుగుతారు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ఆకాల భోజనం వల్ల మీ ఆరోగ్యములో ఇబ్బందులు తప్పవు.దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు.
 
మీనం :- ఏ పని చేపట్టినా ఏదో ఒక అవాంతరం ఎదురవుతుంది. కుటుంబ విషయంలో కూడ మీకు సానుకూల వాతావరణం నెలకొని ఉంటుంది. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. రుణ విముక్తులు కావడంతో మానసిక ప్రశాంతత పొందుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

Netumbo: నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా నంది-న్దైత్వా ప్రమాణం

UP Horror: 52 ఏళ్ల వ్యక్తిని చంపేసిన బావమరిది, అత్త హత్య చేశారు..

Jagan Letter: డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. మోదీకి జగన్ లేఖ

అన్నీ చూడండి

లేటెస్ట్

20-03-2025 గురువారం మీ రాశిఫలాలు : మీ సహనానికి పరీక్షా సమయం...

Ekakshi coconut: ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవట్లేదా..? అప్పుకు ఏకాక్షి నారికేళంతో చెక్?

Rang Panchami 2025: రంగులు సమర్పిస్తే.. దైవానుగ్రహం..

19-03-2025 బుధవారం దినఫలితాలు : రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు

భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : తితిదే

తర్వాతి కథనం
Show comments