Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

24-08-2023 మీ రాశి ఫలాలు-రాఘవేంద్రస్వామిని పూజించినా

24-08-2023 మీ రాశి ఫలాలు-రాఘవేంద్రస్వామిని పూజించినా
, గురువారం, 24 ఆగస్టు 2023 (11:19 IST)
రాఘవేంద్రస్వామిని పూజించినా సర్వదా శుభం, జయం, పురోభివృద్ధి కానవస్తుంది. 
 
మేషం:– ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో పోటీ పెరగడం వల్ల అధికంగా శ్రమించవలసి ఉంటుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. సోదరీ, సోదరుల మధ్య అవగాహన కుదరదు.
 
 
వృషభం :- ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. ఒక శుభకార్యానికి యత్నాలుసాగిస్తారు. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగస్తుల శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. 
 
మిధునం:- ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. వృత్తులవారు ఎంత శ్రమించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాన్ని చేజిక్కించు కోవటం శ్రేయస్కరం. ఆత్మీయుల రాకతో మానసికంగా కుదుటపడతారు. 
 
కర్కాటకం:– బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు పోటి పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ముఖ్యల కోసం మీ పనులు వాయిదా వేసుకోవలసివస్తుంది. తలపెట్టిన పనులు ఏ మాత్రం ముందుకు సాగవు. స్త్రీలకు అలంకారాలు, గృహోపకరణాల పట్ట మక్కువ పెరుగుతుంది.
 
 
సింహం:- స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, నేర్పు అవసరం. ప్రేమికులు అతిగా వ్యవహరించటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. రాబడికి మించిన ఖర్చులు, పెరిగిన ధరలు నిరుత్సాహపరుస్తాయి. రవాణా, ఆటోమోబైల్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానరాగలదు.
 
 
కన్య:- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కొత్తగా ప్రారంభించిన వ్యాపారాలు ప్రగతిపథంలో సాగుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో నిరుత్సాహానికి గురవుతారు. విద్యార్ధినులకు తోటివారి వల్ల ఇబ్బందులెదుర్కోవలసివస్తుంది. ధనం అధికంగా వ్యయం చేస్తారు.
 
తుల:- ఉన్నత వ్యక్తులతో పరిచయం వల్ల వ్యాపకాలు అధికమవుతాయి. ప్రింటింగ్ రంగాల వారికిబకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రముఖులకు బహుమతులు అందజేస్తారు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. మీ నిర్లక్ష్యంవల్లవిలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారంఉంది.
 
 
వృశ్చికం:- సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక సమస్యను అధికమిస్తారు. ఏజెంట్లు, బ్రోకర్లకు ఒత్తిడి, శ్రమాధిక్యత మినహా ఫలితం ఏ మాత్రం ఉండదు. దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో నష్టాలను కొంత మేరకు అధికమిస్తారు. స్త్రీలకు పనివారాలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.
 
 
ధనస్సు:- దీర్ఘకాలిక సమస్యల శాశ్వత పరిష్కారానికి బాగా శ్రమిస్తారు. కొబ్బరి, పండు, పూలు, పానియ, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ నాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. హోటల్, క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభిస్తాయి.
 
 
మకరం: ఆర్ధిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. స్త్రీలకు అయినవారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్లో జాప్యం తప్పదు. రుణాల కోసం అన్వేషిస్తారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
 
కుంభం:- రాజకీయాలలో వారు కొన్ని అంశాలపై చర్య జరుపుటవలన జయం చేకూరుతుంది. ఉపాధ్యాయులకు పనిభారం అధికం. ఉద్యోగస్తులకు పై అధికారులతో సదవగాహన, తోటివారి సహకారం లభించదు. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగులు చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం మంచిది.
 
 
మీనం:- మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. విద్యార్థులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు యధావిధిగా సాగుతాయి. రాజకీయాల వారికి పార్టీ పరంగా గుర్తింపు లభిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

23-08-2023 బుధవారం రాశిఫలాలు - వరసిద్ధి వినాయకుడిని గరికెతో ఆరాధించిన శుభం