Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

19-08-2023 శనివారం రాశిఫలాలు - అభయ ఆంజనేయస్వామిని పూజించిన సర్వదా శుభం..

Advertiesment
Aquarius
, శనివారం, 19 ఆగస్టు 2023 (04:00 IST)
మేషం :- బ్యాంకింగ్ వ్యవహారాలు, మధ్యవర్తిత్వాలకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత ముఖ్యం. రాజకీయ నాయకులు సభా, సమావేశాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక విషయాలలో ఏకాగ్రత వహించలేరు. స్త్రీలకు పొట్ట, బి.పి., నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు. ఊహించని సంఘటనలు వల్ల మనస్థాపం తప్పవు. 
 
వృషభం :- ఆర్థికంగా నిలదొక్కుకోవటంతో పాటు రుణంలో కొంత మొత్తం తీర్చగల్గుతారు. ఉద్యోగ విషయాల దృష్ట్యా తరచూ ప్రయాణాలు చేయవలసివస్తుంది. నూతన వ్యక్తులు సన్నిహితులవుతాయి. విద్యార్థులు బహుమతులు, ప్రసంసలు అందుకుంటారు. ఉపాధ్యాయుల శ్రమకు తగిన గుర్తింపు, ప్రసంశలు లభిస్తాయి. 
 
మిథునం :- సైన్సు, గణిత రంగాలలోని వారికి గణనీయమైన పురోభివృద్ధి. కోర్టు వ్యవహరాలు ప్రగతి పథంలో నడుస్తాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. మీ మిత్రుల కోసం, బంధువుల కోసం బరువు భాద్యతలు స్వీకరిస్తారు. మీ లక్ష్యసాధనకు నిరంతర కృషి, పట్టుదల చాలా అవసరం. 
 
కర్కాటకం :- బంగారు, వెండి, వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితం. అప్రయత్నంగా కొన్ని వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. బంధువుల రాకపోకలు పెరుగుతాయి. సన్నిహితులతో మీ ఆర్థిక విషయాలను గురించి చర్చించవద్దు. రిప్రజెంటిటివ్‌లకు పురోభివృద్ధి.
 
సింహం :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగస్తులు పై అధికారుల మెప్పును పొందుతారు. విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలు విలువైన వస్తువులు కొనుగోలుకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రలోభాలకు లొంగవద్దు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. రుణాల కోసం అన్వేషిస్తారు.
 
కన్య :- స్త్రీలు విదేశీయ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు. పత్రిక, ప్రైవేటు, విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం పెరుగుతుంది. ప్లీడరు, ప్లీడరు గుమస్తాలకు పురోభివృద్ధి కానవస్తుంది. విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్లలో విజయం సాధిస్తారు. ప్రాప్తించబోయే ధనానికి ముందుగానే ఖర్చులు ఎదురవుతాయి.
 
తుల :- ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగానే ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు, కళ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. అందరితో వీలైనంత క్లుప్తంగా మాట్లాడండి. వాహనం నిదానంగా నడపండి. స్త్రీలు వైద్య పరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా సమయానికి పూర్తి కాగలవు.
 
వృశ్చికం :- స్త్రీలకు తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఖర్చులు, చెల్లింపులలో ఏకాగ్రత వహించండి. వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు మెళుకువ, ఏకాగ్రత అవసరం. ఆర్థిక లావాదేవీలు సమర్ధంగా నిర్వహిస్తారు. స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం.
 
ధనస్సు :- మిత్రుల కారణంగా మీ పనులు వాయిదా వేసుకుంటారు. స్త్రీల ఏమరుపాటుతనం, నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం కలదు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ ధ్యేయం నెరవేరుతుంది.
 
మకరం :- రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. స్త్రీలకు టీ.వీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం, పారితోషికం, బహుమతులు అందుతాయి. ఉద్యోగస్తుల సమర్థత, అంకితభావం అధికారులను ఆకట్టుకుంటాయి. వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు.
 
కుంభం :- స్త్రీలకు నరాలు, కళ్ళు, తలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. ప్రముఖులను కలుసుకుంటారు. రావలసిన సకాలంలో ధనం అందుతుంది. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారులు ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తుతాయి. చేపట్టిన పనులు అతికష్టంమ్మీద సమయానికి పూర్తి చేయగల్గుతారు.
 
మీనం :- ఆలయాలను సందర్శిస్తారు. సన్నిహితుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. ఎప్పటి నుండో వాయిదా పడుతూవస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారు నిగ్రహంతో వ్యవహరించాలి. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు విజయం సాధిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

18-08-2023 శుక్రవారం రాశిఫలాలు - సరస్వతిదేవిని ఆరాధించిన శుభం...