Webdunia - Bharat's app for daily news and videos

Install App

27-08-2023 ఆదివారం రాశిఫలాలు - సూర్యుని ఆరాధించిన సర్వదా శుభం...

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2023 (04:04 IST)
మేషం :- గృహంలో సందడి కానవస్తుంది. సహోద్యోగులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. గత అనుభవాలు జ్ఞప్తికి రాగలవు. హోటల్ తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. రావలసిన ధనం చేతికందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. విద్యార్థులు క్రీడలపట్ల ఆసక్తి చూపుతారు.
 
వృషభం :- దైవ దర్శనాలు చేసుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. ఖర్చులకు సరిపడు ఆదాయం సమకూర్చుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ప్రకటనలు, ప్రచురణలకు ఏర్పాట్లు చేస్తారు. ఆకస్మికంగా దూరప్రయాణాలు చేయవలసివస్తుంది.
 
మిథునం :- మీ యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం, సహకారం అందిస్తారు. విద్యార్థులు వాహనం నడుపునపడు మెళుకువ అవసరం. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. కోళ్ళ, గొట్టె, పాడి పరిశ్రమ రంగాలలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ప్రేమికుల మధ్య అపార్థాలు చోటుచేసుకుంటాయి. 
 
కర్కాటకం :- ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రియతముల రాక సమాచారం మీకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి పనివారలతో చికాకలు తప్పవు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి.
 
సింహం :- మీ సంతానం భవిష్యత్తు గురించి కొత్త పథకాలు వేస్తారు. కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవలసివస్తుంది. మీరు, మీ స్నేహితునితో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకోవటానికి కృషి చేస్తారు. ఒక కార్యం నిమిత్తం ప్రయాణం చేయవలసి వస్తుంది.
 
కన్య :- పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత అవసరం. గత కొంతకాలంగా అనుభవిస్తున్న చికాకులు తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. బంధువుల ఆకస్మిక రాక మీకుఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొత్త రుణాల కోసం యత్నిస్తారు. నూతన వ్యాపారాల పట్ల ఏకాగ్రత అవసరం.
 
తుల :- విద్యార్ధులు క్రీడలు, ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి కనబర్చటం వల్ల ఒత్తిడి, మందలింపులు ఎదుర్కోక తప్పదు. బృంద కార్యక్రమాల్లో ఉల్లాసంగా చురుకుగా పాల్గొంటారు. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. దైవ దర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. నిరుద్యోగులు నిరాశ, నిస్పృహలకు లోనవుతారు.
 
వృశ్చికం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరిస్తారు. కంపెనీ సమావేశాల్లో ఆశించిన ఫలితాలు సాధించడం కష్టసాధ్యం. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. స్థిరాస్తుల విషయంలో ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. మీరు అమితంగా అభిమానించే వ్యక్తులే మిమ్ములను మోసగిస్తారు.
 
ధనస్సు :- నిరుద్యోగులకు సదావకాశాలు లభించినప్పటికిని వాటిని సద్వినియోగం చేసుకొలేకపోతారు. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. హామీలు ఉండటం మంచిదికాదు. స్త్రీలకు కొత్త పరిచయాల వల్ల వ్యాపకాలు, కార్యక్రమాలు విస్తృతమవుతాయి. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు.
 
మకరం :- ఆర్థికంగా బలం చేకూరుతుంది. బంధువులతో చిన్న చిన్న కలహాలు జరిగే ఆస్కారంఉంది. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. ఇరుగు పొరుగు వారి వైఖరి వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు.
 
కుంభం :- ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. గృహానికి కావలసిన వస్తువులను అమర్చుకుంటారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. అందరితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసంధనం బాగా వెచ్చిస్తారు. స్త్రీలు ద్విచక్ర వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
 
మీనం :- ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉంటాయి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. ఏదన్న అమ్మకానికి చేయుప్రయత్నాలలో సఫలీకృతులు కాగలరు. ప్రముఖులతో కలిసి సభా సమావేశాలలో పాల్గొంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం : సీఎం చంద్రబాబు

కమ్యూనిస్టు కురువృద్ధుడు వీఎస్ అచ్యుతానందన్ ఇక లేరు

Maharashtra dog walker: నెలకు 4.5 లక్షలు సంపాదిస్తున్న మహారాష్ట్ర డాగ్ వాకర్.. చూసి నేర్చుకోండి..

Sonam: జైలులో సోనమ్ రఘువంశీ.. వందల సార్లు ఫోన్.. 1000 కిలోమీటర్లు ఒంటరిగా..?

రెండు కాళ్లు ఎత్తి ఒకే ఒక్క దెబ్బ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Weekly Horoscope: 21-07-2025 నుంచి 27-07-2025 వరకు వార ఫలితాలు

Pothuraju: హైదరాబాద్‌లో బోనాలు - పోతురాజు అలంకరణ ఎలా జరుగుతుంది.. నిష్ట నియమాలేంటి? (video)

19-07-2025 శనివారం దినఫలితాలు - ఏకాగ్రతతో యత్నం సాగిస్తారు...

Sravana Masam 2025: శ్రావణ మాసం: తులసి, బిల్వ మొక్కలను నాటితే ఏంటి ఫలితం?

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జననం

తర్వాతి కథనం
Show comments