Webdunia - Bharat's app for daily news and videos

Install App

28-07-2024 ఆదివారం దినఫలాలు - గొప్పగొప్ప అవకాశాలు మీ దరిచేరతాయి...

రామన్
ఆదివారం, 28 జులై 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| ఆషాఢ ఐ|| అష్టమి రా.10.47 అశ్వని ప.3.54 ప.వ.12.09 ల 1.39. రా.వ.12.57 ల 2.27. సా.దు. 4. 50 ల 5.42. 
 
మేషం:- విదేశీయాన ప్రయాణాలు వాయిదా పడతాయి. పెద్దల ఆరోగ్యంలో మెళుకువ అవసరం. గొప్ప గొప్ప అవకాశాలు మీ దరిచేరతాయి. కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు మందకొడిగా సాగుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.
 
వృషభం :- నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. కాంట్రాక్టర్లకు పనివారితో చికాకులు తప్పవు. సినిమా, విద్యా, సాంస్కృతిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. 
 
మిథునం :- మీ రాక బంధువులకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. కోళ్ళ, మత్స్య, పాడి పరిశ్రమ, గొజ్జెల రంగాలలో వారికి అనుకున్నంత సంతృప్తిగా ఉంటుంది. విదేశీయాన ప్రయాణాలు వాయిదాపడతాయి. ఏదైనా అమ్మకానికై చేయుయత్నాలు వాయిదా పడగలవు.
 
కర్కాటకం :- ఇతరులకు వాహనం ఇచ్చేవిషయంలో లౌక్యంగా వ్యవహరించడం మంచిదని గమనించండి. స్త్రీల అవసరాలు, కోరికలు వాయిదా వేసుకోవలసివస్తుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. దైవారాధన పట్ల ఆశక్తి పెరుగుతుంది. మీరు ప్రేమించే వారి వల్ల కొంత నష్టపోయే ఆస్కారం ఉంది.
 
సింహం :- నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిదికాదు. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకోవటంతో పాటు ఖాతాదారులను ఆకట్టుకుంటారు. అందరితో సఖ్యతగా మెలుగుతూ మీ పనులు చక్కబెట్టుకుంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
కన్య :- ఆర్థిక వ్యవహారాలు గోప్యంగా ఉంచటం క్షేమదాయకం. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు కలిసివస్తుంది.హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మిమ్ములను చిన్నచూపు చూసిన వారే మీకు దగ్గరయ్యేందుకు యత్నిస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో చికాకులను ఎదుర్కుంటారు.
 
తుల :- వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. మీ లక్ష్యసాధనకు కృషి, పట్టుదల ముఖ్యమని గమనించండి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనివారలతో చికాకులు అధికమవుతాయి. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ప్రముఖుల కోసం షాపింగులు చేస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
వృశ్చికం :- ఖర్చులు పెరగటంతో కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. మిమ్మల్ని పొగిడే వారే కానీసహకరించే వారుండరు. స్త్రీల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. బంధువుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కాదు. మీ సంతానం కోసం ధనం బాగా వ్యయం చేస్తారు.
 
ధనస్సు :- మనస్సుకు నచ్చని సంఘటనలు ఎదుర్కుంటారు. మీ చుట్టు ప్రక్కల వారితో సంభాషించేటప్పుడు జాగ్రత్త అవసరం. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. దూర దేశాలు వెళ్ళడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. అర్థాంతంగా ముగించిన పనులు పునఃప్రారంభిస్తారు.
 
మకరం :- మీ వాహనం మరమ్మతులకు గురయ్యే ఆస్కారం ఉంది. స్త్రీల ప్రతి భాపాటవాలకు మంచిగుర్తింపు లభిస్తుంది. స్నేహితులతో కలసి ఉల్లాసంగా గడుపుతారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. ప్రేమికుల తొందరపాటు అనర్థాలకు దారితీస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో ఆటంకాలను అధికమిస్తారు.
 
కుంభం :- కంప్యూటర్, టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి గుర్తింపు లభిస్తుంది. మీ కుటుంబీకుల కోసం మంచి మంచి ప్రణాళికలు వేస్తారు. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
మీనం :- మీ అశ్రద్ధ ఆలస్యాల వల్ల కొన్ని చికాకులు ఎదుర్కొనక తప్పదు. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకొండి. మందులు, ఆల్కహాల్, నిత్యావసర వస్తు వ్యాపారులకు పురోభివృద్ధి. ఒకే అభిరుచికలిగిన వ్యక్తుల కలయిక జరుగును. ఊహగానాలతో కాలం వ్యర్ధం చేయక సత్కాలంను సద్వినియోగం చేసుకోండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

అన్నీ చూడండి

లేటెస్ట్

Nag Panchami 2025: నాగపంచమి రోజున నాగుల పూజ ఎందుకు.. కుండలినీ శక్తిని?

Chanakya niti: భార్యాభర్తల సంబంధం బలపడాలంటే.. చాణక్య నీతి?

Nag Panchami 2025: నాగపంచమి విశిష్టత.. ఇవి వాడకుండా వుంటే?

శ్రావణ సోమవారం... జూలై 28న తెల్లనిపువ్వులు.. బిల్వ వృక్షం కింద నేతి దీపం వెలిగిస్తే..?

28-07-2025 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో మెలగండి....

తర్వాతి కథనం
Show comments