Webdunia - Bharat's app for daily news and videos

Install App

26-01-2025 ఆదివారం దినఫలితాలు : ఆప్తుల కలయిక వీలుపడదు...

రామన్
ఆదివారం, 26 జనవరి 2025 (04:04 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్ధికలావాదేవీలు ముగుస్తాయి. రావలసిన ధనం అందుంది. ఖర్చులు సామాన్యం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తుల కలయిక వీలుపడదు. పిల్లల దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. పనులు వాయిదా వేసుకుంటారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఆప్తుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. దుబారా ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శ్రమించినా ఫలితం ఉండదు. మీ కష్టం వేరొకరికి లాభిస్తుంది. చీటికిమాటికి చికాకుపడతారు. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. బెట్టింగ్లకు పాల్పడవద్దు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. యత్నాలను ఆప్తులు ప్రోత్సహిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. ఊహించని సంఘటనలెదురవుతాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మొండిబాకీలు వసూలవుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులతో తీరిక ఉండదు. ఒత్తిడి, పనిభారం. బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఖర్చులు విపరీతం. మీ సలహా కొందరికి ఉపకరిస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమస్కంగా గడుపుతారు. ఊహించని ఖర్చులెదురవుతాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. పనులు మందకొడిగా సాగుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యాన్ని సాధిస్తారు. ధనలాభం ఉంది. ఉల్లాసంగా గడుపుతారు. మీ సాయంతో ఒకరికి లబ్ధిచేకూరుతుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. పనులు ఒక పట్టాన సాగవు. ప్రముఖుల జోక్యం అనివార్యం. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి, ధనం మితంగా వ్యయం చేయండి. సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. ఖర్చులు విపరీతం. మొండిగా పనులు పూర్తిచేస్తారు. ఆప్తులతో సంభాషిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్ధిక సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు తగ్గించుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పనులు మందకొడీగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం. చీటికిమాటికి చికాకుపడతారు. సన్మాన, సంస్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్‌ను డిప్యూటీ సీఎం నుంచి తొలగిస్తే ఎట్లుంటుంది? (Video)

Republic Day: గణతంత్ర దినోత్సవం.. ఆగస్టు 15.. జెండా ఆవిష్కరణలో తేడా ఏంటంటే? (video)

Mumbai crime: 75ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. ఇంట్లోకి చొరబడి?

YS Sharmila: జగన్ బీజేపీ దత్తపుత్రుడు.. ఇకనైనా విజయసాయి నిజాలు చెప్పాలి.. షర్మిల

DJ Tillu Song: DJ టిల్లు పాటకు స్టెప్పులేసిన మంత్రి సీతక్క.. వీడియో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

22-01-2025 బుధవారం దినఫలితాలు : కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి...

జనవరి 22: కృష్ణపక్ష కాలాష్టమి.. మిరియాలు, గుమ్మడి, కొబ్బరి దీపం వెలిగిస్తే..?

తిరుమల అద్భుతాలు.. కలియుగాంతంలో వెంకన్న అప్పు తీరుతుందట! నిజమేనా?

Mahakumbh 2025: కుంభమేళా పండుగకు వెళ్తున్నారా? ఐతే ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి.. (video)

భాను సప్తమి 2025... సూర్య నమస్కారం తప్పనిసరి... మరిచిపోవద్దు

తర్వాతి కథనం
Show comments