Webdunia - Bharat's app for daily news and videos

Install App

22-06-202 శనివారం దినఫలాలు - ఉద్యోగస్తులకు తోటివారు అన్ని విధాలా సహకరిస్తారు...

రామన్
శనివారం, 22 జూన్ 2024 (05:05 IST)
శ్రీ క్రోధినామ సం|| జ్యేష్ట శు॥ పూర్ణిమ ఉ. 6.33 మూల రా. 6.36 సా.వ.4.59 ల 6.36, తె..4.07ల, ఉ.దు.5.28 ల 7.11.
 
మేషం :- వ్యాపారస్తులు అధిక శ్రమాంతరం లాభాలను పొందుతారు. స్త్రీలకు శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. యాదృచ్ఛికంగా ఆలయ సందర్శనాలలో బంధువులను కలుసుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాల్లో కుటుంబీకుల తీరు ఆందోళన కలిగిస్తుంది. విదేశీయత్నాల్లో ఎదురైన ఆటంకాలు అధికమిస్తారు. 
 
వృషభం :- ఉద్యోగస్తులకు తోటివారు అన్ని విధాలా సహకరిస్తారు. నిత్యావసర వస్తు వ్యాపారులకు ఆటంకాలు తప్పవు. బ్యాంకు పనులు చికాకు కలిగిస్తాయి. ప్రేమికులు ఉన్న అపార్ధాలు తొలగిపోవడంతో ప్రశాంతత చేకూరి ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖుల ప్రమేయంతో మీ సమస్య సానుకూలమవుతుంది.
 
మిథునం :- వైద్యులకు శస్త్ర చికిత్సలు నిర్వహించునపుడు మెళుకువ, ఏకాగ్రత అవసరం. వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్ల గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు.
 
సింహం :- రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. ఖర్చుల విషయంలో ఆచి, తూచి వ్యవహరించవలసి వస్తుంది. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు కలిసిరాగలదు. నిర్మాణ పనులు, గృహ మరమ్మతులలో ఏకాగ్రత వహించండి. కోర్టు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులవల్ల ఆందోళన చెందుతారు.
 
కన్య :- ఉమ్మడి ఆర్థిక లావాదేవీల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణాలు తీర్చటానికై చేయు యత్నాలు ఒక కొలిక్కిరాగలవు. ప్రైవేటు సంస్థలలోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. మీ స్తోమతకు మించి వాగ్దానాలు చేయడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
తుల :- వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి శుభదాయకం. విందు, వినోదాలలో ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధువుల రాకతో ఖర్చులు అధికం అవుతాయి. పెద్దల ఆరోగ్యం పట్ల మెళుకువ అవసరం.
 
వృశ్చికం :- ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఖర్చులు తగ్గించుకోవాలనే మీ యత్నం అనుకూలించదు. స్త్రీలతో మితంగా సంభాషించండి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళుకువ అవసరం. వస్త్రాలు, గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. కాంట్రాక్టర్లకు పనివారితో చికాకులు తప్పవు.
 
ధనస్సు :- ఒక వ్యవహారం నిమిత్తం దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. కీలకమైన విషయాల్లో కుటుంబీకుల సలహా పాటించటం మంచిది. ఉద్యోగస్తులకు స్థానమార్పిడి, ప్రమోషన్, తీర్థయాత్రలలో పరిణామాలుంటాయి. వృత్తులవారికి సదవకాశాలు లభిస్తాయి.
 
మకరం :- ఉపాధ్యాయులకు పని భారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. ఖర్చులు అధికమవుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, చికాకులు ఎదుర్కుంటారు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహరాల్లో భంగపాటు తప్పదు. ఆపత్సమయంలో మిత్రులకు అండగా నిలుస్తారు.
 
కుంభం :- విదేశాల్లోని అభిమానుల క్షేమ సమాచారం ఆందోళన కలిగిస్తుంది. రుణాలు తీరుస్తారు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఆంక్షలు తప్పవు. నిరుద్యోగులు పోటి పరీక్షలలో సఫలీకృతుతలౌతారు. స్త్రీలకు నరాలకు, కళ్లు, తల, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు.
 
మీనం :- స్థిరాస్తి అమ్మకానికై చేయుయత్నాలు కలిసిరావు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. వృత్తి, ఉద్యోగాలపట్ల ఆసక్తి చూపుతారు. కార్మికులకు ఆందోళన అధికమవుతుంది. దంపతులమధ్య సఖ్యత లోపిస్తుంది. పెద్దల ఆరోగ్యం పట్ల మెళుకువ అవసరం. విద్య, వైజ్ఞానిక రంగాలలోని వారికి జయం చేకూరుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు.. ఏఐ సాయంతో డ్రోన్స్.. ఏర్పాట్లు ముమ్మరం

కారును గోడౌన్‌లో ఉంచినందుకు రోజుకు రూ.2400 అపరాధం చెల్లించిన బిల్ గేట్స్

డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేసిన ప్రియురాలు

ఏపీ మద్యం కేసు : అట్టపెట్టెల్లో దాచిన కరెన్సీ కట్టలు స్వాధీనం

రష్యా తీరంలో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు

అన్నీ చూడండి

లేటెస్ట్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

Sravana Mangalavaram: శ్రావణ మాసం.. మంగళగౌరీ వ్రతం చేస్తే ఏంటి ఫలితం?

Garuda Panchami 2025: గరుడ పంచమి రోజున గరుత్మండుని పూజిస్తే.. సర్పదోషాలు మటాష్

Nag Panchami 2025: నాగపంచమి రోజున నాగుల పూజ ఎందుకు.. కుండలినీ శక్తిని?

తర్వాతి కథనం
Show comments