Webdunia - Bharat's app for daily news and videos

Install App

18-08-2024 ఆదివారం దినఫలాలు-ఆర్థిక అవసరాలు ఖర్చులు పెరగటంతో...

రామన్
ఆదివారం, 18 ఆగస్టు 2024 (04:09 IST)
మేషం:- బంధు మిత్రులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. సమయానికి సహకరించని వ్యక్తులవల్ల ఇబ్బందులెదుర్కుంటారు. కాంట్రాక్టర్లకు అధికమైన ఒత్తిడి తప్పదు. ఎదుటివారు మీకు సమ ఉజ్జీలేనని గ్రహించండి. మీ కళత్ర మొండి వైఖరి, కుటుంబీకుల పట్టుదల మనశ్శాంతిని దూరం చేస్తాయి.
 
వృషభం:- మీ సంతానంతో ఉల్లాసంగాను, ఉత్సాహంగాను గడుపుతారు. ఖర్చులు అధికమైనా ధనానికి లోటుండదు. రాజకీయనాయకులు సాంఘిక కార్యక్రమాలలోనూ, వేడుకలలోనూ పాల్గొంటారు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి.
 
మిధునం:- దేనియందు ఏకాగ్రత అంతగా ఉండదు. అదనపు రాబడి కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. బంధు మిత్రులతో కలసి వేడుకలలో పాల్గొంటారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల ముఖ్యం.
 
కర్కాటకం: కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఆత్మీయుల ఆకస్మిక రాక ఆనందాశ్చర్యాలు కలిగిస్తాయి. వీలైనంత వరకూమీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. శ్రమాధిక్యత, విశ్రాంతిలోపం, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. 
 
సింహం:– దైవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. రాజకీయనాయకులు సభసమావేశాలలో పాల్గొంటారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. మీ అభిప్రాయాలకు మంచిస్పందన లభిస్తుంది. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది.
 
కన్య:- ఆర్థిక అవసరాలు ఖర్చులు పెరగటంతో అదనపు ఆదాయానికై శ్రమిస్తారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, హడావుడి ఎదుర్కుంటారు. క్రీడా రంగాల ఆసక్తి పెరుగుతుంది. ఆహార వ్యవహరాల్లో మెలకువ వహించండి.
 
తుల:- ప్రేమికులకు పెద్దలనుంచి వ్యతిరేకత, ఆంక్షలు తప్పవు. వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహాఆర్ధిక సంతృప్తి ఆశించినంతగా ఉండదు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయం లోను అప్రమత్తత అవసరం.
 
వృశ్చికం:- బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. ప్రేమ వ్యవహారాలపట్ల ఆసక్తి కనబర్చటంవల్ల ఒత్తిడి, మందలింపులు ఎదుర్కొనవలసివస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సివస్తుంది.
 
ధనస్సు:- మీ సంతానం భవిష్యత్తును గురించి పథకాలు వేసి జయం పొందుతారు. స్త్రీలు ద్విచక్రవాహనం నడుపునపుడు జాగ్రత్తఅవసరం. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. వృత్తుల వారికి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. పాతమిత్రుల కలయికతో గత అనుభవాలు పంచుకుంటారు.
 
 
మకరం:- మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. విద్యార్థులు నూతన వాతావరణం, పరిచయాలకు క్రమంగా అలవాటు పడతారు. రిప్రజెంటేటివ్లకు పురోభివృద్ధి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
 
 
కుంభం:- వాక్చాతుర్యంతో అందరినీ సంతృప్తిపరుస్తారు. ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం కూడదు. విద్యార్థులు అల్లర్లు, ఆందోళనలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. బంధు మిత్రుల రాకతో ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి, ఏకాగ్రత పెంచుకుంటారు. ముఖ్యమై వ్యవహారాలలో ఆటంకాలు తొలగిపోతాయి.
 
 
మీనం:- వ్యాపారరీత్యా దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. రాజకీయ నాయకులు తరచు సభ, సమావేశాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరుకావటం మంచిది. బంధువుల రాకపోకలు పెరుగుతాయి. రుణ వ్యవహారాలలో వచ్చే ఒత్తిడిని తెలివిగాసరిచేయ గలుగుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీకమాసం: మాస శివరాత్రి.. సాయంత్రం కొబ్బరినూనెతో దీపం.. ఎందుకు?

కార్తీక శివరాత్రి.. రాళ్ల ఉప్పు శివలింగంపై వుంచితే?

29-11-2024 శుక్రవారం ఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

అదృష్టం ఈ రాశుల వారికే.. 2025 శుక్ర గ్రహ అనుకూలంతో..?

మేష రాశిఫలం 2025 - ప్రేమ జీవితం ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments