Webdunia - Bharat's app for daily news and videos

Install App

17-04-2024 బుధవారం దినఫలాలు - ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా...

రామన్
బుధవారం, 17 ఏప్రియల్ 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| చైత్ర శు|| నవమి సా.5.26 పుష్యమి ఉ.7.40 రా.వ.9.31 ల 11.15. ప. దు. 11.30 ల 12.21.
 
మేషం :- వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో సఫలీకృతులవుతారు. స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. మీ పథకాలు కార్యరూపం దాల్చుతాయి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వాయిదా పడిన పనులను పునఃప్రారంభిస్తారు.
 
వృషభం :- దైవ కార్యక్రమాల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. మీ శ్రీమతి ప్రోద్బలంతో ఒక శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. వ్యవహారాల్లో జయం, గృహంలో శుభకార్యాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో స్వీయ పర్యవేక్షణ అవసరం. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది.
 
మిథునం :- శ్రమాధిక్యత, పలు ఆలోచనల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థులు భవిష్యత్ గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. స్త్రీలు అపరిచితులతో మితంగా సంభాషించటం క్షేమదాయకం. రావలసిన ధనం కొంత ముందు వెనుకలగానైనా అందుతుంది.
 
కర్కాటకం :- ఉమ్మడి వ్యాపారాలు సంతృప్తిని ఇస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. తరుచు దైవకార్యాల్లో పాల్గొంటారు. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికం. కుటుంబీకులతో ముభావంగా ఉంటారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి పనిభారం అధికమవుతుంది.
 
సింహం :- శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. ప్రముఖుల సహకారంతో మీ సమస్యలు ఒక కొలిక్కి రాగలవు. ఆదాయానికి మించిన ఖర్చులెదురైనా ఇబ్బందులుండవు. రాజకీయ నాయకులకు కార్యకర్తల వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు నిశ్చింత కలిగిస్తాయి.
 
కన్య :- బ్యాంకింగ్ వ్యవహరంలో జాగ్రత్త అవసరం. స్త్రీలకు ఇరుగు, పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు అంతంత మాత్రంగాసాగుతాయి. ఉద్యోగస్తులు కొత్త బాధతలను సమర్థంగా నిర్వహిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది.
 
తుల :- వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు అందుతాయి. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి విద్యా కోర్సులో రాణిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు. అనుకోని విధంగా మీరు ప్రయాణం చేయవలసి వస్తుంది. రిజర్వేషన్ రంగాల వారు సంతృప్తిని పొందుతారు. ప్రత్యర్థులు స్నేహ హస్తం అందిస్తారు.
 
వృశ్చికం :- కొన్ని బంధాలను నిలుపుకోవటానికి కష్టపడాల్సి వస్తుంది. చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. అధికారులతో సంభాషించేటప్పుడు మెళకువ వహించండి. విపరీతమైన ఖర్చులు, చెల్లింపులు వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. సోదరీ, సోదరుల మధ్య కలహాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి.
 
ధనస్సు :- బంధువుల తోడ్పాటుతో ఒక అడుగు ముందుకు సాగుతారు. ప్రతి పనిని మీ సొంత తెలివితేటలతో ఆలోచించడం వలన అనుకూలంగానే పూర్తవుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. విదేశాల నుంచి విలువైన వస్తువులను సేకరిస్తారు. ముఖ్యమైన పనులలో విజయం చేకూరుతుంది.
 
మకరం :- శ్రీవారు, శ్రీమతి విషయంలో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. శెనగలు, కంది, చింతపండు, బెల్లం, వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. మీడియా రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికం. మీరు చేసే వృత్తి, ఉద్యోగాలలో మార్పు ఏర్పడవచ్చు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి.
 
కుంభం :- ప్రయాణాలలో కొంత ఇబ్బందులను ఎదుర్కుంటారు. పనులు కొంత మందకొడిగా సాగుతాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు. మార్కెటింగ్ రంగలోని వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. మీ సంతాన విషయంలో సంతృప్తి కానవస్తుంది.
 
మీనం :- చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. తలచిన పనులలో కొంత అడ్డంకి ఎదురైనా పట్టుదలలో పూర్తి చేస్తారు. లెక్కకు మించిన బాధ్యతలతో సతమతమవుతారు. రాజకీయ రంగాల వారికి పర్యటనలు అధికమవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పత్రికా రంగంలోని వారికి గుర్తింపు రాణింపు లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

విమానం బ్రేక్ ఫెయిల్ : డిప్యూటీ సీఎంకు తప్పిన పెను ప్రమాదం!!

అన్నీ చూడండి

లేటెస్ట్

22-03-2025 శనివారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Mobile Wallpaper Vastu: మొబైల్ వాల్‌పేపర్‌ను ఇలా సెట్ చేస్తే దురదృష్టం పట్టుకుంటుందా?

Sheetala Saptami 2025: శీతల సప్తమి నాడు శీతల దేవిని ఎందుకు పూజిస్తారంటే?

21-03-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

దేవుడు, ధర్మము ఎక్కడున్నాయయ్యా?

తర్వాతి కథనం
Show comments