Webdunia - Bharat's app for daily news and videos

Install App

15-02-2025 శనివారం రాశిఫలాలు - ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...

రామన్
శనివారం, 15 ఫిబ్రవరి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. లావాదేవీలతో తీరిక ఉండదు. ఖర్చులు సామాన్యం. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. అపరిచితులతో మితంగా సంభాషించండి. పత్రాలు అందుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణవిముక్తులవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు అధికం. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. విందులు, వేడుకలో పాల్గొంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. నిలిపివేసిన పనులు పునఃప్రారంభమవుతాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. పాత పరిచయస్తులు తారసపడతారు. ఖర్చులు సామాన్యం. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యవహారాల్లో జాగ్రత్త. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆలయాలకు విరాళాలు అందిస్తారు.. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శ్రమాధిక్యత మినహా ఫలితం అంతంతమాత్రమే. అందరితోను మితంగా సంభాషించండి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పనులు మందకొడిగా సాగుతాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. శుభకార్యానికి హాజరవుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. అన్యమస్కంగా గడుపుతారు. సన్నిహితుల వ్యాఖ్యలు ఉపశమనం కలిగిస్తాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. దంపతల మధ్య అకారణ కలహం. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారపరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. రావలసిన ధనం అందుతుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆప్తులకు సాయం అందిస్తారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ముఖ్యమైన పనులతో తీరిక ఉండదు. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పెట్టుబడుల విషయం పునరాలోచించండి. తొందరపాటు నిర్ణయాలు తగదు. గృహమరమ్మతులు చేపడతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యవహారదక్షతతో నెట్టుకొస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పనులు చురుకుగా సాగుతాయి. ఆత్మీయుల ఆహ్వానం సందిగ్గానికి గురిచేస్తుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కష్టించినా ఫలితం ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఓర్పుతో యత్నాలు కొనసాగించండి. దుబారా ఖర్చులు విపరీతం. కీలక వ్యవహారాలతో తలమునకలవుతారు. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆందోళన కలిగించిన సద్దుమణుగుతుంది. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. సాయం ఆశించవద్దు. ఖర్చులు సామాన్యం. సన్నిహితులను కలుసుకుంటారు. నోటీసులు అందుకుంటారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. అనవసర్ల జోక్యం తగదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు వేగవంతమవుతాయి. ఆప్తులతో సంభాషిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆడుదాం ఆంధ్రా స్కామ్‌పై విచారణ పూర్తి : తొలి అరెస్టు మాజీ మంత్రి రోజానేనా?

పిఠాపురంలో వితంతువులకు చీరలు పంచిన పవన్ కళ్యాణ్

13న బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలో వర్షాలు

నేటి నుంచి తెలంగాణాలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

వృద్ధుడికి ఆశ చూపిన మహిళ.. రూ. 8.7 కోట్లు కొట్టేశారు.. చివరికి ఏం జరిగిందంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

Shravana masam, శ్రావణ మాసంలో ఇలా చేస్తే సకల శుభాలు

08-08-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు...

Raksha Bandhan 2025: రాఖీ పండుగ రోజున అరుదైన మహా సంయోగం.. ఏ టైమ్‌లో రాఖీ కట్టాలి?

శ్రావణ వరలక్ష్మి వ్రతం, పూజ విధానం

Varalakshmi Vratam 2025: బ్రహ్మ ముహూర్తంలో వరలక్ష్మీ వ్రతం చేస్తే సర్వం శుభం

తర్వాతి కథనం
Show comments