మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. సమర్ధతను చాటుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం ఉంది. పనులు పురమాయించవద్దు. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. విజ్ఞతతో వ్యవహరిస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. కీలక బాధ్యతలు స్వీకరిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. నిలిపివేసిన పనులు పూర్తవుతాయి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆచితూచి వ్యవహరించాలి. అందరితోను మితంగా సంభాషించండి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. భేషజాలకు పోవద్దు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు ఫలిస్తాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. కొంతమొత్తం పొదుపు చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. పనులతో సతమతమవుతారు. అకాల భోజనం, విశ్రాంతి లోపం. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మనోధైర్యంతో అడుగులేయండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. రావలసిన ధనాన్ని సామరస్యంగా వసూలు చేసుకోవాలి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ప్రయాణం విరమించుకుంటారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహాన్నిస్తాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగముండా మెలగండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. అకాల భోజనం, విశ్రాంతిలోపం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఖర్చులు విపరీతం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పిల్లల దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లక్ష్యాన్ని సాధిస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. విలాసాలకు వ్యయం చేస్తారు. బంధుమిత్రులతో సంభాషిస్తారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. తలపెట్టిన పనులు నిలిపివేస్తారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యం. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుంది.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహారాల్లో సన్నిహితుల సలహా పాటించండి. అనాలోచిత నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. అందరితోను సౌమ్యంగా మెలగండి. ఊహించని ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి. చేపట్టిన పనులు సాగవు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఖర్చులు విపరీతం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ప్రముఖులను కలిసినా ఫలితం ఉండదు. ఆత్మీయులతో సంభాషిస్తారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ వాక్కు ఫలిస్తుంది. స్నేహసంబంధాలు బలపడతాయి, మాట నిలబెట్టుకుంటారు. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి...