Webdunia - Bharat's app for daily news and videos

Install App

14-08-2023 సోమవారం రాశిఫలాలు - శంకరుడిని పూజించినా మీ సంకల్పం...

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (04:00 IST)
మేషం :- రాజకీయాల్లో వారికి తెలివితేటలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సోదరులతో సత్‌సంబంధాలు నెలకొంటాయి. ఆహార వ్యవహారాల్లో మెళుకువ వహించండి. ఏదైనా అమ్మే ఆలోచన వాయిదా వేయటం మంచిది. కాంట్రాక్టర్లకు అధికారులతో అవగాహన కుదరదు.
 
వృషభం :- మిత్ర సహాయంతో మీ పనుల్లో పురోభివృద్ధి పొందుతారు. సినీరంగ పరిశ్రమల్లో వారికి చికాకులు, ఒత్తిడి అధికమవుతుంది. దైవ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.
 
మిథునం :- వాతావరణంలోని మార్పు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో జాయింట్ సమస్యలు రావచ్చును. మిత్ర సహాయములతో మీ పనుల్లో పురోభివృద్ధి పొందుతారు. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. కంప్యూటర్ రంగాల వారికి అవకాశాలు లభిస్తాయి.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా చికాకులు తప్పవు. రావలసిన బాకీలు కొంతమేర వసూలు కాగలవు. దైవ, పుణ్య కార్యాల పట్ల శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. నూనె, శనగ, మినుము వ్యాపారులకు, స్టాకిస్టులకు ఆశాజనకం. విద్యార్థులు ఉన్నతవిద్యల కోసం చేసే విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు తొలగిపోగలవు.
 
సింహం :- చిరు వ్యాపారులకు, వృత్తుల వారికి కలిసిరాగలదు. కుటుంబీకులతో ఓర్పు, సంయమనంతో వ్యవహరించవలసి ఉంటుంది. మీ యత్నాలను కొంతమంది నీరుగార్చేందుకు యత్నిస్తారు. స్త్రీలకు నడుము, మోకాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు తప్పవు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
 
కన్య :- ఊహించని ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. ఆత్మీయులకిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఎరువులు, రేషన్, గ్యాస్ డీలర్లకు అధికారులతో సమస్యలు తప్పవు. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలిస్తాయి.
 
తుల :- విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. కొత్త వ్యాపారాలు చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. స్త్రీలకు పనివారలతో సమస్యలు తప్పవు. కోర్టు వ్యవహరాలు వాయిదా పడటం మంచిది.
 
వృశ్చికం :- వాతావరణంలోని మార్పు రైతులకు కొత్త ఉత్సాహం కలిగిస్తుంది. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. మీరంటే గిట్టని వారు మీకు దగ్గరయ్యేందుకు యత్నిస్తారు. స్త్రీలతో అతిగా సంభాషించటం వల్ల అపార్థాలకు గురికావలసివస్తుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి.
 
ధనస్సు :- సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలనివ్వగలవు. బ్యాంకింగ్ వ్యవహారాలు, సంప్రదింపులకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత అవసరం. ఉపాధ్యాయులకు ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. షేర్లు సామాన్య లాభానికే విక్రయించు కోవలసివస్తుంది.
 
మకరం :- ఉద్యోగస్తుల సమర్థతకు పై అధికారుల నుండి గుర్తింపు, మన్ననలు లభిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. చిరకాలంగా వేధిస్తున్న సమస్యలు నెమ్మదిగా తీరుతాయి. ఆథ్యాత్మిక చింతన పెరుగుతుంది.
 
కుంభం :- ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా సంతృప్తి కానరాదు. స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు సంతృప్తినిస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఖర్చులు, కుటుంబ అవసరాలు పెరగటంతో ఒడిదుడుకులు తప్పవు.
 
మీనం :- వాహనచోదకులకు చికాకులు తప్పవు. ప్రయాణాలు ఉల్లాసంగా సాగుతాయి. ఆరోగ్యభంగం, ఊహించని ఖర్చులు చికాకు పరుస్తాయి. దంపతుల మధ్య అపర్ధాలు తొలగిపోతాయి. ఇరుగు పొరుగు వారి వైఖరి వల్ల ఒకింత ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరంటే బంధువులకు ప్రత్యేకాభిమానం ఏర్పడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన టెన్త్ విద్యార్థి.. నడుస్తూ వెళ్తుండగా..?

టీటీడీలో కొనసాగుతున్న ప్రక్షాళన ... 208 మంది దళారుల అరెస్టు!!

30 ఏళ్ల టెక్కీ 130 నిద్రమాత్రలు మింగింది.. ఎందుకో తెలుసా?

ప్లీజ్ ఒక్కసారి అనుమతించండి.. సీఎంకు సారీ చెప్పాలి : ఐపీఎస్ సీతారామాంజనేయులు

ఢిల్లీ కోర్టులో కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ : డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ అంటే ఏమిటి?

అన్నీ చూడండి

లేటెస్ట్

04-07-2024 గురువారం రాశిఫలాలు - భావాలను సున్నితంగా వ్యక్తం చేయండి...

03-07-2024 బుధవారం రాశిఫలాలు - ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు...

02-07-202 మంగళవారం రాశిఫలాలు - ఖర్చులు అధికంగా ఉన్నా డబ్బుకు కొదవ ఉండదు...

యోగిని ఏకాదశి.. ఉపవాసం వుంటే పారణ తప్పనిసరి..

జూలై 2న యోగిని ఏకాదశి.. ఉపవాసం వుంటే మోక్షమే..

తర్వాతి కథనం
Show comments