Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

09-08-2023 బుధవారం రాశిఫలాలు - మీ నైపుణ్యతకు, సామార్థ్యానికి తగినటువంటి గుర్తింపు...

mesham
, బుధవారం, 9 ఆగస్టు 2023 (04:00 IST)
మేషం :- మీ నైపుణ్యతకు, సామార్థ్యానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి చేసినా విమర్శలు తప్పవు. ఇరుగు పొరుగు వారి వైఖరివల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు.
 
వృషభం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఏ విషయంలోను ఒంటెత్తు పోకడ మంచిది కాదు. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. గృహోపకరణాలు, వాహనం, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు.
 
మిథునం :- ఉపాధ్యాయులకు ఒత్తిడి, ఆందోళనలు అధికం. రాజకీయాలో వారు ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. పిల్లల భవిష్యత్తును గురించి పథకాలు వేసి జయం పొందుతారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
 
కర్కాటకం :- గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత ఎంతో అవసరం. స్త్రీలు ద్విచక్ర వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ముఖ్యమై వ్యవహారాలలో ఆటంకాలు తొలగిపోతాయి. రావలసిన ధనం చేతికందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి.
 
సింహం :- కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వ్యవసాయ, తోటల రంగాల వారు శాస్త్రవేత్తల సలహాలు పాటించటం శ్రేయస్కరం. రుణాలు, చేబదుళ్ళు స్వీకరించవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లతీరు ఆందోళన కలిగిస్తుంది. రవాణా రంగాలలో వారికి మిశ్రమ ఫలితం కానవస్తుంది.
 
కన్య :- కుటుంబీకులతో స్వల్ప విభేదాలు తలెత్తినా నెమ్మదిగా సమసి పోతాయి. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.
 
తుల :- ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు. మీ సంతానం కోసంఫీజులు, బిల్లులు చెల్లిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం.
 
వృశ్చికం :- స్త్రీలకు స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విదేశాలు వెళ్లటానికి చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. అందరికి సహాయం చేసి మాటపడవలసి వస్తుంది. మొండిబాకీలు వసూలు చేస్తారు. పొదుపు చేద్దామనుకున్న మీ ఆలోచన ఫలించదు. మీ బంధవులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం.
 
ధనస్సు :- ఉద్యోగస్తులు యూనియన్ వ్యవహారాల్లో హడావుడిగా ఉంటారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు మెళకువ, ఏకాగ్రత అవసరం. అకాలభోజనం, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థులు నూతనవాతావరణం, పరిచయాలకు క్రమంగా అలవాటు పడతారు.
 
మకరం :- ఉమ్మడి వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. మీ ఆంతరంగిక సమస్యలకు నెమ్మదిగా పరిష్కార మార్గం దొరుకుతుంది. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఏర్పడే ఆస్కారం ఉంది, మెళకువ వహించండి. ఆథ్యాత్మిక విషయాలలో ఏకాగ్రత వహించలేరు. ప్రభుత్వోద్యోగులకు కోరుకున్న చోటికి బదిలీలు రావచ్చు.
 
కుంభం :- స్త్రీల ఏమరుపాటుతనం, నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం కలదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత, మెళకువ అవసరం. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. సహోద్యోగులతో సమావేశాలు ఫలించకపోవచ్చు.
 
మీనం :- ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటం వల్ల సమస్యలను ఎదుర్కుంటారు. నియమాలకు కట్టుబడి ఉండుటవలన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. మీ వాక్చాతుర్యానికి, తెలివితేటలకుమంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారు లతో ఏకీభావం కుదరదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరుంగాలి హారాన్ని ధరిస్తే..?