Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరుంగాలి హారాన్ని ధరిస్తే..?

Advertiesment
Karungali
, మంగళవారం, 8 ఆగస్టు 2023 (10:54 IST)
Karungali
కరుంగాలి చెట్టు చెక్కతో చేసిన హారాన్ని మనం ధరిస్తే ఎన్నో సానుకూల ఫలితాలు పొందవచ్చు.  ఆ చెట్టులోని సానుకూల శక్తి మనలో వ్యాపిస్తుంది. ఇటీవలి కాలంలో చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు ఈ హారాన్ని ధరించడం అలవాటు చేసుకున్నారు. 
 
చాలా కోపంగా, మరియు ప్రతికూల ఆలోచనలతో బాధపడేవారు ఈ హారాన్ని ధరించాలి. ఈ చెట్టు చెక్కతో చేసిన హారాన్ని మనం ధరిస్తే, ఆ హారమే మన శరీరంగా మారుతుంది. ఎందుకంటే ఈ హారాన్ని ధరించడం వల్ల మీ కోపాన్ని అదుపులో ఉంచుకుని మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. కరుంగాలి హారాన్ని ధరించే వారిలో ఆవేశం వుండదు. 
 
ఈ హారాన్ని ధరించే వారికి పుణ్యం లభిస్తుంది. ఇంకా ధరించిన వారికే కాకుండా వారి చుట్టూ వున్న వ్యక్తులకు కూడా సానుకూల శక్తిని ఇస్తుంది. ఇంకా మంత్రవిద్య, తంత్ర శక్తులు వంటి ప్రతికూల విషయాలను కూడా అధిగమించే శక్తి ఈ హారానికి ఉంది. 
 
అదేవిధంగా, కుల, మతాలకు అతీతంగా ఎవరైనా దీనిని ధరించవచ్చు. కానీ ఒకే ఒక షరతు ఉంది, రాత్రి నిద్రపోయేటప్పుడు కరింగాలి హారాన్ని తీసివేయాలి. ఈ మాలను ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్లీ ఉపయోగించవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
కరుంగాలి చెట్టుకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇది రేడియేషన్‌ను గ్రహించి నిల్వచేసే గుణం కలిగి ఉంటుంది. కరుంగాలి చెట్టుకు వేరు, బెరడును ఔషధంగా ఉపయోగిస్తారు. మధుమేహం, పెద్దప్రేగు రుగ్మతలు, రక్తహీనత వల్ల వచ్చే వ్యాధులు కూడా నయమవుతాయి.
 
కరుంగాలి చెట్టు వేరును తీసుకుని నీళ్లతో బాగా శుభ్రం చేసి మంచి నీళ్లలో నానబెట్టి ఆ నీటిని కషాయంగా చేసి తాగితే కడుపులో పుండ్లు తొలగి పోతాయి. ఇది పొట్టలో ఉన్న అనవసర కొవ్వును కరిగిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ చక్కెర స్థాయిలను తగ్గించుకోవడానికి ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు తీసుకోవచ్చు.
 
కరుంగాలి రక్తంలో ఐరన్‌ కంటెంట్‌ని పెంచుతుంది. పిత్తాన్ని తగ్గిస్తుంది. స్త్రీల గర్భాశయాన్ని బలపరుస్తుంది. అధిక రక్త ప్రసరణ ఉన్న మహిళలకు మంచిది. మహిళల్లో వైట్ డిశ్చార్జ్ సమస్యను సరిచేస్తుంది. కరుంగాలి మాలను ధరిస్తే శరీరంలోని నరాల సమస్యను సరిచేస్తుంది.
 
 కరుంగాలి దండను చక్కగా వజ్రాలు పొదిగిన చెక్కతో పూసలుగా చెక్కి 108 పూసల మాలగా తయారు చేసి ధరిస్తే సర్వశుభాలు చేకూరుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దారిద్ర్యం తొలగిపోవాలంటే.. శ్రావణ మంగళవారం.. ఇలా పూజ చేస్తే..?