Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

05-08-2023 శనివారం రాశిఫలాలు - శ్రీ వేంకటేశ్వరుని ఆరాధిస్తే..

Advertiesment
Astrology
, శనివారం, 5 ఆగస్టు 2023 (05:00 IST)
శ్రీ వేంకటేశ్వరుని ఆరాధించిన సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం:- బంధు మిత్రుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. కంది, మినుము, మిర్చి వ్యాపారస్తులకు పురోభివృద్ధి. రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.
 
వృషభం :- ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాలవారికి ఆశాజనకం. ప్రైవేటు సంస్థలలోని వారు నిగ్రహంతో వ్యవహరించాలి. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. మీ అభిప్రాయాలు, ఆలోచనలకు మిశ్రమ స్పందన పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో ఒత్తిడికి గురవుతారు.
 
మిథునం:- ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాల్లో గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. అప్రయత్నంగా కొన్ని వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. విద్యార్ధులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
కర్కాటకం:- స్త్రీలకు టీ.వీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం, పారితోషికం, బహుమతులు అందుతాయి. ఖర్చులకు సరిపడా ఆదాయం సమకూర్చుకుంటారు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు విజయం సాధిస్తారు.
 
సింహం:- మీ యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం, సహకారం అందిస్తారు. రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, గౌరవలు పెరుగుతాయి. వ్యవసాయ రంగాల వారికి ఎరువులు, క్రిమి సంహారక మందుల కొనుగోళ్లలో చికాకులు, ఇబ్బందులు తప్పవు. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.
 
కన్య:- రాజకీయాల్లో వారికి తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. బంధు మిత్రులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి.
 
తుల:- ఆర్ధిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరిస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, చికాకులు ఎదుర్కుంటారు. టెండర్లు చేజిక్కించుకుంటారు. కొత్త పరిచయాల వల్ల కార్యక్రమాలు విస్తృతమవుతాయి. స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి.
 
వృశ్చికం:– ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. పెద్దల సలహాను పాటించిమీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మధ్య మధ్య ఔషధ సేవ తప్పదు. క్రీడా, కళ రంగాల్లో వారికి సంతృప్తి కానరాదు. హోటల్, తినుబండా వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు.
 
ధనస్సు:- స్త్రీలు దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బంధు మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ, ఆల్కహాల్ వ్యాపారస్తులకు ఆశాజనకం. కష్టపడి పనిచేస్తేడబ్బు దానంతటదే వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది.
 
మకరం:- రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. విదేశాలకు వెళ్ళటానికి చేయు యత్నాలు వాయిదాపడతాయి. మీరు ఓ స్నేహితునితో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకోవటానికి కృషి చేస్తారు.
 
కుంభం:- గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆశక్తి పెరుగుతుంది. నిరుద్యోగులు బోగస్ ప్రకటనలు పట్ల అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. కుటుంబీకుల కోసం నూతన పధకాలు వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా వుంచండి.
 
మీనం:- స్త్రీలు కుటుంబ సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. తలపెట్టిన పనుల్లో ప్రోత్సాహం, పురోభివృద్ధి కానవస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఖర్చులు అంతగా లేకున్నా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. ఆరోగ్య, ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రత్యంగిరా దేవిని ఎలా పూజించాలి.. మిరపకాయలతో హోమం?