Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

02-08-2023 బుధవారం మీ రాశిఫలాలు - మహావిష్ణువును ఆరాధిస్తే..?

02-08-2023 బుధవారం మీ రాశిఫలాలు - మహావిష్ణువును ఆరాధిస్తే..?
, బుధవారం, 2 ఆగస్టు 2023 (05:00 IST)
మహా విష్ణువును ఆరాధించిన పురోభివృద్ధి పొందుతారు.
 
మేషం:- ఉద్యోగరీత్యా దూరప్రయాణాలలో మెళుకువ అవసరం. రాజకీయాలలోవారు కొన్ని అంశాలపై చర్య జరుపుటవలన జయం చేకూరుతుంది. దైవ సేవా కార్యక్రమాలో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ధనం ఏ కొంతైనా నిల్వ చేయటం వల్లసంతృప్తి కానవస్తుంది.
 
వృషభం :- ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. స్త్రీలకు అకాలభోజనం వల్ల ఆరోగ్యములో ఇబ్బందులు తప్పవు. గతంలో నిలిపివేసిన పనులు పునః ప్రారంభిస్తారు. సినిమా, విద్యా, సాంస్కృతిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మిథునం:- ఉద్యోగయత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కీడు తలపెట్టె స్నేహానికి దూరంగా ఉండండి. మీ శ్రీమతి మొండి వైఖరి చికాకు, ఆందోళనకు గురవుతారు. మీ యత్నాలకు సన్నిహితులు, కుటుంబీకుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులకు చేతిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. 
 
కర్కాటకం:- వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ ప్రియతముల కోసం పిల్లల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
సింహం:- మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు మంచి మంచి అవకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేరు. మీ ప్రయత్నాలకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. ఎదుటివారికి వాహనం ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. సోదరీ సోదరులు మీ యత్నాలకు చేయూతనిస్తారు. 
 
కన్య:- రవాణా రంగాల వారికి మెళుకువ అవసరం. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి గురవుతారు. ఆటోమొబైల్, ట్రాన్సుపోర్టు, మెకానికల్ రంగాలలో వారికి చికాకులు తప్పవు. దానధర్మాలు చేయడంవల్ల మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ వాక్చాతుర్యానికి, మంచి తనానికి గుర్తింపు లభిస్తుంది.
 
తుల:- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. పొదుపు పథకాల దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. ఉద్యోగస్తుల హోదా పెరిగే సూచనలున్నాయి. మీ భవిష్యత్ ప్రణాళికలను ఎవరితోను చర్చించవద్దు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది.
 
వృశ్చికం:- పండ్ల, పూల, కూరగాయ రంగాలలో వారికి అనుకూలమైన కాలం. చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. గతంలో ఒకరికిచ్చిన హామీ వల్ల వర్తమానంలో ఇబ్బందులెదుర్కుంటారు.
 
ధనస్సు:- గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. రుణ విముక్తులు కావడంతో పాటు రుణాలు అనుకూలిస్తాయి. బంధువులను కలుసుకుంటారు. రాజకీయాలో వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. కళాశాలలో ప్రవేశాలకు, కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు అనుకూల సమయం.
 
మకరం:- ఆర్ధిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. హోటలు తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. పరస్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. ప్రత్తి, పొగాకు రంగాలలో వారికి అనుకూలమైన కాలం. మీపై అధికారుల ధోరణిలో మార్పు కనిపిస్తుంది.
 
కుంభం:- వృత్తి విద్యా కోర్సులలో రాణిస్తారు. చిన్నారుల, విద్య, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయాలో ఖర్చులు అంచనాలు మించుతాయి. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇతరులు మిమ్మల్ని చూసి అపోహపడే ఆస్కారం ఉంది. ఒంటరిగానే లక్ష్యాలను సాధిస్తారు. పెన్షన్, భీమా సమస్యలు పరిష్కారం అవుతాయి.
 
మీనం:- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. ఉద్యోగంలో శ్రమకుమంచి గుర్తింపు లభిస్తుంది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ అవసరం. మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు వచ్చినప్పడికి వాటిని సద్వినియోగం చేసుకొలేకపొతారు. రావలసిన బాకీలు వసూలవుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆగస్టు 1 నుంచి 31 వరకు పుష్క‌రిణి మూసివేత