Webdunia - Bharat's app for daily news and videos

Install App

13-08-2023 ఆదివారం రాశిఫలాలు - సూర్య స్తుతి ఆరాధించిన శుభం...

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2023 (04:00 IST)
మేషం:– స్ధిరాస్తి అమ్మకం లేదా కొనుగోలు వాయిదా వేయడం మంచిది. పట్టువిడుపు ధోరణితో కొన్ని సమస్యలు పరిష్కారం కాగలవు. రవాణా రంగాలలో వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. ఆలయ సందర్శనాలలో స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. బంధువుల కారణంగా మీ పనులు వాయిదా వేసుకుంటారు.
 
వృషభం :- కొబ్బరి,పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు అనుకూలమైన కాలం. బంధువుల ఆకస్మిక రాకతో సందడి కానవస్తుంది. స్త్రీలకు శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఊహించని ఖర్చులు వల్ల స్వల్ప ఇబ్బందులుతప్పవు. 
 
మిధునం:- నూనె, ఎండుమిర్చి, పసుపు, ప్రత్తి, పొగాకు కంది వ్యాపారస్తులకు కలిసి వచ్చేకాలం.రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తుల వారికి లభించిన అవకాశాలు ఏమాత్రం సంతృప్తినీయవు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల వల్ల అప్రమత్తత అవసరం.
 
కర్కాటకం:– దంపతుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ఫ్యాన్సీ, రసాయనిక, సుగంధద్రవ్య, మందులు వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం. పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. స్త్రీలకు తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి.
 
సింహం:- వృత్తి ఉపాధి పథకాల్లో స్ధిరపడతారు. మీ అతిధి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. రుణం కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు. సోదరీ సోదరుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.
 
కన్య:- బంధువుల రాకతో పనులు ఆలస్యంగా అయినా అనుకున్న విధంగా పూర్తి కాగలవు. తప్పనిసరి చెల్లింపులు, ఆకస్మిక ఖర్చుల వల్ల స్వల్ప ఆటుపోట్లు ఎదుర్కుంటారు. మీపై శకునాలు, చెప్పుడు మాటల ప్రభావం అధికం. అనుభవజ్ఞుల సలహా తీసుకోవటంఉత్తమం. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం క్షేమంకాదు.
 
తుల:- వ్యాపార రీత్యా ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయవలసివస్తుంది. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. ఆందోళన కలిగించిన సమస్య పరిష్కార మవుతుంది. ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. బంధు మిత్రుల రాకతో గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. విద్యార్థులకు విదేశీ చదువుల అవకాశం లభిస్తుంది.
 
వృశ్చికం:- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యవసాయ రంగాల వారికి నూతన ఆలోచలు స్ఫురిస్తాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మార్కెటింగ్, ఆడిటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది.
 
ధనస్సు:- దైవ, పుణ్య కార్యాల పట్ల శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. మీ ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. బహుమతులు అందజేస్తారు. ఏదైనా విలువైన స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. దూరప్రయాణాలలో తగు జాగ్రత్తలు అవసరం.
 
మకరం:- వాహనం ఇతరులకుఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. కుటుంబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. కోళ్ళ, మత్స్య, పాడి పరిశ్రమ రంగాల్లో వారికి చికాకులు అధికమవుతాయి.
 
కుంభం:- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. కొత్తగా చేపట్టిన వ్యాపారాలలో క్రమంగా నిలదొక్కుకుంటారు. ప్రతి స్వల్ప విషయానికి అసహనం ప్రదర్శిస్తారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
 
మీనం:- వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. మీరెదుర్కున్న సమస్య బంధువులకు ఎదురవడంతో మీ కష్టాన్ని, ఆందోళనని గుర్తిస్తారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. మీ ఉన్నతిని చాటుకోవాలనే ఉద్దేశ్యంతో ధనం విరివిగా వ్యయం చేస్తారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sudiksha Konanki: సుధీక్ష కొనంకీకి ఏమైంది..? మరణించిందా? ఆ లేఖ ఆమె ఫ్యామిలీ పంపిందా?

ఐఎస్ఎస్ నుంచి భూమికి తిరుగు పయనమైన సునీతా విలియమ్స్

Ranya Rao : నన్ను అరెస్ట్ చేయకండి.. పెళ్లైన నెలలోనే విడిపోయాం.. కోర్టులో నటి రన్యా రావు భర్త

ప్రొఫెసర్ కాదు.. కామాంధుడు... మహిళా విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన (Video)

సరదాగా వాటర్ ట్యాంక్ ఎక్కిన చిన్నారులు... కూలిపోవడంతో ఇద్దరు మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

16-03-2025 నుంచి 22-03-2025 వరకు మీ వార ఫలితాలు-ఆర్థికంగా ఆశించిన ఫలితాలుంటాయి.

Gangaur Vrat: గంగౌర్ గౌరీ పూజ పార్వతీ పరమేశ్వరులకు అంకితం.. ఇలా చేస్తే?

15-03-2025 శనివారం ఆస్ట్రాలజీ - పత్రాల రెన్యువల్లో జాగ్రత్త వహించండి...

Chanakya Niti: భార్యాభర్తలిద్దరూ కలిసి చేయకూడని ఆ 4 పనులు.. ఏంటవి?

Lakshmi Jayanti : హోలీ రోజునే శ్రీలక్ష్మి జయంతి- శుక్రవారం వచ్చింది.. ఇవన్నీ చేస్తే ఐశ్వర్యం మీ సొంతం..

తర్వాతి కథనం
Show comments