Webdunia - Bharat's app for daily news and videos

Install App

13-08-2024 మంగళవారం దినఫలాలు - ఆ రాశివారు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు...

రామన్
మంగళవారం, 13 ఆగస్టు 2024 (04:00 IST)
మేషం :- వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విదేశీయాన యత్నాల్లో సఫలీకృతులవుతారు. మీ సంతానంతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. మిమ్ములను పొగిడిన వారే విమర్శించటానికివెనుకాడరు.
 
వృషభం :- ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. తరుచూ దైవ సేవా పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, వాణిజ్య ఒప్పందాల్లో పెద్దల సలహా పాటించటం మంచిది. గృహంలో ఒక శుభకార్యం అనుకూలిస్తుంది.
 
మిథునం :- ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. విద్యార్థులు పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకోకుండా కొన్ని పనులు వాయిదాపడతాయి. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. దూరపు బంధువులను ఇంటికి ఆహ్వానిస్తారు.
 
కర్కాటకం :- జూదాల్లో ధననష్టం, చికాకులు ఎదుర్కుంటారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. మీ మాటే నెగ్గాలన్న పంతం విడనాడండి. నూతన వాహనం కొనుగోలుచేస్తారు. కుటుంబీకులతో కలిసి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువుల రాక మీకు ఎంతో ఆనందాన్నిఇస్తుంది.
 
సింహం :- దైవ, శుభకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. బంధు మిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. ఖర్చులు పెరిగినా ఇబ్బందులే మాత్రం ఉండవు.
 
కన్య :- స్త్రీలకు వస్త్ర, వస్తులాభం వంటి శుభపరిణామాలుంటాయి. విందులు, వినోదాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. రాబడికి మించిన ఖర్చులెదురైనా ఇబ్బందులేమాత్రం ఉండవు. స్పెక్యులేషన్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి.
 
తుల :- తరుచూ విందులు, దైవకార్యాల్లో పాల్గొంటారు. ఏ మాత్రం పొదుపు సాధ్యంకాదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో ఫలితాలు ఆశించిన విధంగా ఉండవు. సంతాన సౌఖ్యం, కుటుంబంలో సఖ్యత నెలకొంటాయి. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధికానవస్తుంది.
 
వృశ్చికం :- అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. స్త్రీలు శుభకార్యాల్లో పలువురిని ఆకట్టుకుంటారు. విందులలో పరిమితి పాటించండి. ప్రయాణాలలో వస్తువులపట్ల జాగ్రత్త అవసరం. ప్రేమికులు అతిగా వ్యవహరించటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.
 
ధనస్సు :- బంధు మిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ఖర్చులు పెరిగినా ప్రయోజనకరంగా ఉంటాయి. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురవుతారు. గతంలో నిలిపివేసిన పనులు పునః ప్రారంభిస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. విందులు, వినోదాల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
 
మకరం :- మీ బాధ్యతలను ఇతరులకు అప్పగించి ఇబ్బందు లెదుర్కుంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించదు. బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. కుటుంబ సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. తలపెట్టిన పనులు అనుకున్న విధంగాపూర్తి కాగలవు. గృహమార్పు కోసం యత్నాలు సాగిస్తారు. 
 
కుంభం :- వ్యవసాయ రంగాల వారికి ఎరువులు, క్రిమి సంహారక మందుల కొనుగోళ్లలో చికాకులు, ఇబ్బందులు తప్పవు. భాగస్వామిక ఒప్పందాల్లో మీ నిర్ణయాలను స్పష్టంగా వ్యక్తం చేయండి. స్త్రీలకు టీవీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం, పారితోషికం, బహుమతులు అందుతాయి. వాహనం వీలైనంత నిదానంగా నడపటం క్షేమదాయకం.
 
మీనం :- మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. బంధువుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. లౌక్యయంగా వ్యవహరించి మీ పనులు చక్క బెట్టవలసివుంటుంది. ప్రారంభించిన పనులు ఆపివేయవద్దు. 
====================================================
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

లేటెస్ట్

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

తర్వాతి కథనం
Show comments