Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

07-08-2024 బుధవారం దినఫలాలు - దాయం పెరిగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి...

Advertiesment
tula rashi

రామన్

, బుధవారం, 7 ఆగస్టు 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| శ్రావణ శు|| తదియ రా.7.54 పుబ్బ రా. 7.38 తె.వ. 3.36ల 5.22. 3.5.11.40 12.31.
 
మేషం :- ఏదైనా స్థిరాస్తి అమ్మకానికై చేయుయత్నాలు వాయిదా పడటం మంచిది. స్త్రీలకు పుట్టింటిపై ధ్యాస పెరుగుతుంది. పత్రిక, ప్రైవేటు, విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం పెరుగుతుంది. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. విద్యార్థులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత కుదురుతుంది. 
 
వృషభం :- స్త్రీలకు చేతిపనులు, సంగీత, సాహిత్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్ధినులకు వాహనం నడుపుతున్నపుడు మెళుకువ అవసరం. దైవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. ఉన్నత విద్యల నిమిత్తం చేసే విదేశీయాన యత్నం ఫలిస్తుంది. 
 
మిథునం :- వీలైనంత వరకు బయటి ఆహారాన్ని భుజించకండి. నిరుద్యోగులకు చేతిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. అనవసర ప్రసంగం వలన అధికారులతో అవగాహన కుదరకపోవచ్చు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. 
 
కర్కాటకం :- వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించాలి. నిరుద్యోగులు ప్రకటనల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. దైవదర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత తప్పదు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉద్యోగస్తులు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. 
 
సింహం :- ఆదాయం పెరిగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పెద్దమొత్తం ధనసహాయం క్షేమం కాదు. ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. సామూహిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం.
 
కన్య :- ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల భంగపాటుకు గురవుతారు. వ్యపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. భార్య, భర్తల ఆలోచనలు, అభిప్రాయబేధాలు భిన్నంగా ఉంటాయి. కాంట్రక్టర్లకు నూతన టెండర్లు అనుకూలిస్తాయి.
 
తుల :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. దీర్ఘకాలిక సమస్యలకు మంచి పరిష్కారమార్గం గోచరిస్తుంది. చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వాహన చోదకులకు దూకుడు తగదు. మీ అభిప్రాయాలకు తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి.
 
వృశ్చికం :- ఆర్థిక విషయాలలో మీ లెక్కలు తారుమారు కాగలవు. ఉద్యోగస్తులు సహోద్యగులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. బంధువుల రాక పోకలు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. పనులకు ఆటంకాలు కల్పించాలనుకున్న వారు సైతం అనుకూలంగా మారతారు.
 
ధనస్సు :- ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామి విషయంలో దాపరికం మంచిది కాదు. స్త్రీలు ఉద్యోగ ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలు ఎదుర్కుంటారు. వృత్తుల వారు ఆదాయం కంటె వచ్చిన అవకాశాలను చేజిక్కించుకోవటం శ్రేయస్కరం.
 
మకరం :- హోట, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. ఉపాధ్యాయుల శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు వేధింపులు అధికమవుతాయి. వ్యవసాయ రంగాల వారికి ఎరువుల కొనుగోలులో చికాకులు తప్పవు. కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. 
 
కుంభం :- తాపి పని వారికి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ఎదుటివారితో మితంగా సంభాషించటం అన్ని విధాలా శ్రేయస్కరం. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంబగా మెలగవలసి ఉంటుంది. భాగస్వామిక వ్యాపారాలు, జాయింటు వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. క్రయ విక్రయాలు సామాన్యం.
 
మీనం :- ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల్గుతారు. ఉద్యోగస్తులు అవిశ్రాంతంగా కృషి చేస్తేనే పెండింగ్ పనులు పూర్తి కాగలవు. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమఫలితం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుట్టలో పాలు పోయడం మంచిదేనా?