Webdunia - Bharat's app for daily news and videos

Install App

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

రామన్
శుక్రవారం, 13 జూన్ 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లక్ష్యసాధనకు కృషి ప్రధానం. అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. లావాదేవీలతో తీరిక ఉండదు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు ముందుకు సాగవు. కీలక పత్రాలు అందుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
నిర్దేశిత ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. వాహనం కొనుగోలు చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పత్రాల రెన్యుల్లో జాప్యం తగదు. ఆరోగ్యం జాగ్రత్త. బంధువులతో సంభాషిస్తారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. పొదుపు ధనం అందుతుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. అందరితో కలుపుగోలుగా మెలగండి. అర్ధాంతంగా ముగించిన పనులు పూర్తిచేస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. సమర్ధతను చాటుకుంటారు. కీలక అంశాల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. వాహనం జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలు అధికం. ఆలోచనలు నిలకడగా ఉండవు. అన్యమస్కంగా గడుపుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. పనులు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. వాయిదాల చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంప్రదింపులతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనిభారం, ఆకాలభోజనం. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ నిర్ణయాన్ని వాయిదా వేయండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యం సిద్ధిస్తుంది. లక్ష్యానికి చేరువవుతారు. అన్ని విధాలా ప్రోత్సాహకరం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యం కాదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం, ప్రయోజనకరం. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మీదైన రంగంలో రాణిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఖర్చులు అధికం. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. నిలిపివేసిన పనులు పూర్తి చేయగల్గుతారు. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ సమర్థతపై నమ్మకం కలుగుతుంది. ధృఢసంకల్పంతో అడుగు ముందుకేస్తారు. సాయం ఆశించవద్దు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. ఒంటెద్దుపోకడ తగదు. ఎదుటివారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోండి. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అనుకూల ఫలితాలున్నాయి. మీ కష్టం ఫలిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

08-06-25 ఆదివారం మీ దినఫలాలు - పోయిన పత్రాలు లభ్యమవుతాయి..

08-06-2025 నుంచి 14-06-2025 వరకు ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మొద్దు

07-06-2025 శనివారం దినఫలితాలు - మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచొద్దు...

Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?

నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?

తర్వాతి కథనం
Show comments