Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

Advertiesment
rashiphal

రామన్

, గురువారం, 12 జూన్ 2025 (04:00 IST)
మేషం : : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. పట్టుదలే మీ విజయానికి నాంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. కొత్తవిషయం తెలుసుకుంటారు. సన్నిహితులతో సంభాషిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. ఆశించిన ఫలితం సాధిస్తారు. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. మాట నిలబెట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు సావకాశంగా చేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సమయస్ఫూర్తితో మెలగండి. బేషజాలకు పోవద్దు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రయాణంలో అవస్థలు ఎదుర్కుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఖర్చులు సామాన్యం. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. కొత్త యత్నాలు మెదలు పెడతారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంకల్పబలంలో యత్నాలు సాగించండి. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ముఖ్యమైన చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు ఒక పట్టాన సాగవు. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
స్నేహితుల వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ఖర్చులు అధికం. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. దంపతుల మధ్య అకారణ కలహం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. అపోహలకు తావివ్వవద్దు. ఆప్తులతో సంభాషిస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. ఖర్చులు విపరీతం. అప్రియమైన వార్త వింటారు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. పెద్దల సలహా పాటిస్తారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం ఫలిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు జాగ్రత్త.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
తలపెట్టిన కార్యం విజయవంతవుతుంది. నూతన పరిచయాలు అభివృద్ధికి సహకరిస్తాయి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు సామాన్యం. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. పనులు పురమాయించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. పెద్దల సలహా తీసుకుండి. ఖర్చులు తగ్గించుకోవటానికి యత్నించండి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యానుకూలత, ధనలాభం ఉన్నాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఖర్చులు విపరీతం. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. మీ నుంచి విషయసేకరణకు కొందరు యత్నిస్తారు. సమయస్ఫూర్తిగా మెలగండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. సహనంతో యత్నాలు సాగించండి. సంకల్పబలమే మీ విజయానికి దోహదపడుతుంది. చెల్లింపుల్లో అశ్రద్ధ తగదు. మొక్కుబడిగా పనులు పూర్తిచేస్తారు. కష్టసమయంలో ఆప్తులు ఆదుకుంటారు. కీలక పత్రాలు అందుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....