Webdunia - Bharat's app for daily news and videos

Install App

13-06-2022 సోమవారం రాశిఫలాలు ... ఈశ్వరుడిని పూజించి అర్చించినా మీకు శుభం...

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (04:00 IST)
మేషం :- రావలసిన ధనం చేతికందుతుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. దూరప్రయాణాలు, తీర్థయాత్రలలో అసౌకర్యానికి గురవుతారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృషభం :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలనిస్తాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. వాతావరణంలో మార్పు వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. స్త్రీలకు షాపింగ్ లోను, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. దూర ప్రయాణాల ఏర్పాట్లలో నిమగ్నులై ఉంటారు.
 
మిథునం :- పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. స్త్రీలకు తల, నరాలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది.
 
కర్కాటకం :- చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల నుంచి సమస్యలెదురవుతాయి. పెద్ద మొత్తం రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన, మెళుకువ అవసరం. దైవదర్శనాలు, అర్చనలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారు అక్షర దోషాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.
 
సింహం :- ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. కలప, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. మార్కెట్ రంగాల వారు టార్గెట్లను సునాయాసంగా పూర్తి చేస్తారు. మీ అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి.
 
కన్య :- ఆర్థిక, కుటుంబ సమస్యలకు చక్కని పరిష్కార మార్గం గోచరిస్తుంది. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. స్త్రీలకు బంధువులు, చుట్టుపక్కల వారితో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగస్తుల శక్తిసామర్థ్యాలను అధికారులు గుర్తిస్తారు. దుబారా ఖర్చులు నివారించాలన్నమీ యత్నం ఫలించదు.
 
తుల :- అకాల భోజనం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. రావలసిన ధనం సమయానికి అందకపోవటంతో ఒకింత ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. కొబ్బరి, పండ్ల, పూల, దైవసామగ్రి, పానీయ వ్యాపారులకు లాభదాయకం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాకపోవటంతో నిరుత్సాహానికి గురవుతారు.
 
వృశ్చికం :- వ్యాపారాల్లో ఒడిదుడుకులను సమర్థంగా ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులకు, పత్రికా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. మీ ఏమరుపాటుతనం వల్ల ధననష్టం, విలువైన వస్తువులు చేజారిపోవటం వంటి చికాకులు ఎదుర్కుంటారు. పాతమిత్రుల కలయిక మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. 
 
ధనస్సు :- రాజకీయాలలో వారికి సంఘంలో స్థాయి పెరుగగలదు. మీరెంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది. డాక్యుమెంట్లపై సంతకాలు పెట్టేముందు జాగ్రత్త అవసరం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. బేకరి, పండ్ల, పూల, ఆల్కహాలు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి.
 
మకరం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి అవమానాలను పొందినా మంచి గుర్తింపు లభిస్తుంది. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. భార్య, భర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. చిన్ననాటి మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు.
 
కుంభం :- అరుదైన శస్త్రచికిత్సలను డాక్టర్లు విజయవంతంగా పూర్తిచేస్తారు. శత్రువులను మీ వైపునకు ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులు ఊహించని అవరోధాలు తలెత్తిన తెలివితో పరిష్కరించగలుగుతారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి, ధనం కోసం వెతుకులాడుకునే ఇబ్బంది ఉండదు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి.
 
మీనం :- సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగును. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. కొన్ని విషయాల్లో ఓర్పును కోల్పోతారు. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. చిన్నపాటి అనారోగ్యానికి గురై చికిత్స తీసుకోవల్సివస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో జాయింట్ సమస్యలు రావచ్చును. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

లేటెస్ట్

Today Daily Astro 14-12-2024 శనివారం దినఫలితాలు

Pisces : మీనరాశికి 2025 కలిసొస్తుందా? యోగ బలం.. శివారాధన, హనుమాన్ చాలీసాతో..?

Aquarius : కుంభం.. 2025 రాశి ఫలితాలు.. శ్రీమన్నారాయణ స్తోత్రపారాయణం చేస్తే?

మకర రాశి 2025 ఫలితాలు.. సుబ్రహ్మణ్యేశ్వరునికి అర్చన చేస్తే?

Sagittarius 2025: ధనుస్సు రాశికి 2025 ఎలా వుంటుంది? విష్ణుసహస్రనామ పారాయణ చేస్తే?

తర్వాతి కథనం
Show comments