Webdunia - Bharat's app for daily news and videos

Install App

11-12-2023 సోమవారం రాశిఫలాలు - ఈశ్వరునికి తైలాభిషేకం చేయించి తీర్థం తీసుకున్నా శుభం..

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| కార్తీక ఐ|| చతుర్ధశి తె.5.31 విశాఖ ఉ.11.38 ప.వ.3.42 ల 5.19. ప.దు. 12.11 ల 12.55 పు.దు. 2.23ల3.07.
ఈశ్వరునికి తైలాభిషేకం చేయించి తీర్థం తీసుకున్నా శుభం కలుగుతుంది.
 
మేషం :- వస్త్ర, బంగారం, వెండి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఎవరినీ సంప్రదించకుండా సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. సోదరీ, సోదరుల మధ్య సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ఉద్యోగస్తులు అవిశ్రాంతంగా శ్రమంచి పెండింగ్ పనులు పూర్తి చేస్తారు.
 
వృషభం :- ఆలయాలను సందర్శిస్తారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆలోచనలు క్రియా రూపంలో పెట్టి జయం పొందండి.
 
మిథునం :- ప్రైవేటు సంస్థలలోని వారు ఎంత శ్రమించినా యాజమాన్యం గుర్తింపు ఉండదు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. విదేశీయాన యత్నాలలో ఆటంకాలు తొలగిపోగలవు. ఉద్యోగస్తులు కొత్తగా వచ్చిన అధికారులను ఆకట్టుకుంటారు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి.
 
కర్కాటకం :- ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించకోవటం ఉత్తమం. ఆత్మీయుల ఆకస్మిక రాకసంతోషం కలిగిస్తుంది. విద్యార్థుల అత్యుత్సాహం అనర్ధాలకు దారితీస్తుంది. రాజకీయనాయకులు సభా, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. రవాణా, ఎక్స్‌పోర్ట్ రంగాల్లో వారు పనివారి వల్ల ఇబ్బందులకు గురవుతారు.
 
సింహం :- స్త్రీలకు అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు వంటివి తలెత్తుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం.
 
కన్య :- ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అసవరం. ఉద్యోగస్తులకు హోదా పెరగటంతో పాటు బరువు బాధ్యతలు అధికమవుతాయి. మీ కళత్ర మొండి వైఖరి మీకెంతో చికాకు, ఆందోళన కలిగిస్తుంది.
 
తుల :- స్త్రీలకు కళా రంగాలపట్ల, వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. లిటిగేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. మీ వాగ్ధాటి, చాకచక్యంతో ఎదుటివారిని మెప్పిస్తారు. బంధు మిత్రుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయత్న పూర్వకంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి.
 
వృశ్చికం :- దైవ, సామాజిక కార్యక్రమాలపట్ల ఆసక్తి నెలకొంటుంది. ఇతరులకు పెద్ద మొత్తాలలో ధన సహాయం చేసే విషయంలో లౌకికం ఎంతో అవసరం. స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులు తప్పవు. ప్రింటింగ్ రంగాల్లో వారికి పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు.
 
ధనస్సు :- ఇంటా, బయటా మీ మాటకు ఆదరణ లభిస్తుంది. గతవిషయాల గురించి ఆలోచిస్తూకాలం వ్యర్థం చేయకండి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. పూర్వపు పరిచయ వ్యక్తుల కలయిక మీకెంతో ఉపకరిస్తుంది. చేపట్టిన పనులు బంధువుల కారణంగా అర్ధాంతరంగా ముగించాల్సి వస్తుంది.
 
మకరం :- హోటల్, బేకరీ, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి. మీ జీవితభాగస్వామితో ఉల్లాసంగా గడుపుతారు. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు వాయిదా పడుటమంచిది. ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. బంధు మిత్రులతో వన సమారాధనలు, వేడుకలకు ప్రణాళికలు రూపొందిస్తారు.
 
కుంభం :- రాజకీయ నాయకులు సభా సమావేశాలలో పాల్గొంటారు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. రుణాల కోసం అన్వేషిస్తారు. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. స్థిరచరాస్తుల విషయంలో పునరాలోచన మంచిది.
 
మీనం :- వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రముఖులతో తరచూ సభలు, సమావేశాలలో పాల్గొంటారు. కుటుంబీకులకు, బంధువుల నుంచి వ్యతిరేకతలు ఎదురవుతాయి. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. మహిళా ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, పనిభారం వంటి చికాకులు తప్పవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

Kodali Nani : అసోంలో కొడాలి నాని కీలక సహచరుడు కాళి అరెస్ట్

Chandrababu: పింఛన్ లబ్ధిదారుడి ఇంట కాఫీ తాగిన చంద్రబాబు (video)

ఏడుకొండలు ఇంటిలో కాఫీ తయారు చేసిన సీఎం చంద్రబాబు (Video)

తెలుగుతల్లికి జలహారతి.. రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగితే.. చంద్రబాబు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

29-12-2024 ఆదివారం దినఫలితాలు -రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి...

శనివారం ప్రదోషం: సాయంత్రం పాలు, పెరుగు అభిషేకానికి సమర్పిస్తే?

Tirumala Facts: బంగారు గోపురం.. వైకుంఠం నుంచి నేరుగా కొండమీదకి దిగారట!

28-12-2024 శనివారం దినఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

Tirumala: తిరుమలలో అద్భుతం.. మంచు కొండల్లా మారిన ఏడు కొండలు (video)

తర్వాతి కథనం
Show comments