Webdunia - Bharat's app for daily news and videos

Install App

08-07- 2025 మంగళవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు

రామన్
మంగళవారం, 8 జులై 2025 (05:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
నిర్విరామంగా శ్రమిస్తారు. కొత్త సమస్యలెదురవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తగవు. స్థిమితంగా ఆలోచిస్తే పరిష్కారమార్గం గోచరిస్తుంది. పెద్దల సలహా పాటించండి. పనులు పురమాయించవద్దు. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. రుణ సమస్య నుంచి బయటపడతారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. 
 
మిధునం :మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు అధికం. శ్రమించినా ఫలితం ఉండదు. కొంతమంది మీ యత్నాలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. మనోధైర్యంతో వ్యవహరించండి. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. ముఖ్యుల కలయిక సాధ్యపడదు. చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం ఉంది. లౌక్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. అపరిచితులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ అవసరం. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. 
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఖర్చులు విపరీతం. సాయం ఆశించి భంగపడతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. పట్టుదలతో శ్రమించిన గాని చేపట్టిన పనులు పూర్తి కావు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
చిత్తశుద్ధిని చాటుకుంటారు. ప్రతికూలతలు తొలుగుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అధికం, నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పనుల్లో అవాంతరాలెదురవుతాయి. నోటీసులు అందుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. పొదుపు ధనం అందుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య అకారణ కలహం. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతికూలతలకు దీటుగా స్పందిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. పనులు వేగవంతమవుతాయి. ఇంటి విషయాలపై దృష్టి సారిస్తారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. అనవసర జోక్యం తగదు. ఆప్తులతో ఉల్లాంగా గడుపుతారు.
 
 
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. రుణ ఒత్తిళ్లు అధికమవుతాయి. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పెద్దల సలహా పాటిస్తారు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆశావహ దృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. చేబదుళ్లు స్వీకరిస్తారు. పనులు మొండిగా పూర్తి చేస్తారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
దుబారా ఖర్చులు విపరీతం. ధనసహాయం తగదు. పనుల్లో అవాంతరాలెదురవుతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. గృహమరమ్మతులు చేపడతారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ కష్టం ఫలిస్తుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. దైవకార్య సమావేశంలో పాల్గొంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Man: సోదరుడిని కత్తితో పొడిచి చంపేసిన వ్యక్తికి జీవిత ఖైదు

అమెరికా: బోస్టన్ స్విమ్మింగ్ పూల్‌‌లో మునిగి వ్యక్తి మృతి

అయ్యో నా బిడ్డ పడిపోతున్నాడు, పిల్లవాడిని కాపాడేందుకు 13వ అంతస్తు నుంచి దూకేసిన తల్లి

Universal Health Policy: సార్వత్రిక ఆరోగ్య విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదముద్ర

Nara Lokesh: డీఎస్సీ 2025 నియామకాలు విజయవంతం.. నారా లోకేష్‌కు ప్రశంసలు

అన్నీ చూడండి

లేటెస్ట్

మరింత మెరుగైన శ్రీవారి సేవల కోసం ట్రైనీ వాలంటీర్లు : తితిదే నిర్ణయం

04-09-2025 గురువారం ఫలితాలు - మీ శ్రీమతితో సౌమ్యంగా మెలగండి...

Lunar Eclipse: చంద్రగ్రహణం- ఈ రాశుల వారు జాగ్రత్తగా వుండాలి

03-09-2025 బుధవారం దినఫలాలు - స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన...

Parivartini Ekadashi: పరివర్తన ఏకాదశి రోజున వెండి, బియ్యం, పెరుగు దానం చేస్తే?

తర్వాతి కథనం
Show comments