Webdunia - Bharat's app for daily news and videos

Install App

05-11-2022 శనివారం దినఫలాలు - ఈశ్వరునికి తెలాభిషేకం చేయించిన సర్వదా శుభం..

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (04:00 IST)
మేషం :- ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు పోకుండా ఏకాగ్రతతో వ్యవహరించ వలసి ఉంటుంది. వైద్యులకు శస్త్రచికిత్సల సమయంలో ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులకు ఆశాజనకం. బంధువుల మధ్య సయోధ్య నెలకొంటుంది. మీ ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. కోర్టు వ్యవహరాలలో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది.
 
వృషభం :- ఉద్యోగస్తులు విధినిర్వహణలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి అధికారుల ప్రశంసలు పొందుతారు. స్త్రీలకు చేతిపనులు, సంగీత, సాహిత్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మొక్కుబడులు తీర్చుకుంటారు. ఫ్యాన్సీ, బేకరి వ్యాపారులకు పురోభివృద్ధి. పత్రికా సంస్థలలోని వారికి పనిభారం, ఒత్తిడి అధికమవుతాయి.
 
మిథునం :- రాజకీయనాయకులు సభలు, సమావేఃశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. బంధువులరాకతో కొంత అసౌకర్యానికి గురవుతారు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరుగుతాయి. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది.
 
కర్కాటకం :- చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. పారిశ్రామిక రంగంలోని వారికి ప్రోత్సాహకరం. కొంతమంది మీ ఆలోచనలు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ఎంతో ముఖ్యం. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనులలో చికాకులు తప్పవు.
 
సింహం :- మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ముఖ్యం. వాహనచోదకులకు మెలకువ అవసరం. ఏజెంట్లకు, బ్రోకర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. దంపతుల మధ్య పట్టింపులు, కలహాలు చోటు చేసుకుంటాయి.
 
కన్య :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు పెరిగినా సంతృప్తికరంగా ఉంటాయి. మీ యత్నాలకు సన్నిహితులు అన్ని విధాలా సహకరిస్తారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యం ప్రదర్శించండి. ఇతరుల మాటలు లెక్కచేయక అడుగు ముందుకేసి శ్రమించండి అనుకున్నది సాధిస్తారు.
 
తుల :- భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. గతంలో దొర్లిన పొరపాట్లు పునరావృతం కాకుండా తగు జాగ్రత్త అవసరం.
 
వృశ్చికం :- ప్రింటింగ్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. కోర్టు వ్యవహరాలు వాయిదా పడతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఏకాగ్రత అవసరం. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
ధనస్సు :- మీ సంతానం ఆరోగ్యం, వివాహ విషయాల పట్ల దృష్టి సారిస్తారు. చేతివృత్తుల వారికి శ్రమాధిక్యతేగాని ఆశించిన ప్రతిఫలం పొందలేరు. నిరుద్యోగులకు ఉద్యోగ యత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. బంధువులు మీ గురించి చేసిన వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. రుణం, వాయిదా చెల్లింపులు అనుకూలిస్తాయి.
 
మకరం :- లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టులు, పరిశ్రమలకు అవసరమైన లైసెన్సులు అనుకూలిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు లాభదాయకం. శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం. ఉద్యోగస్తులు ఆశించిన ప్రమోషన్లు, బదిలీలు అనుకూలించటానికి మరి కొంత కాలం పడుతుంది.
 
కుంభం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి నిరుత్సాహం తప్పదు. గృహనిర్మాణాలు, మరమ్మతులలో పెరిగిన వ్యయం ఆందోళన కలిగిస్తుంది. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తిని ఇస్తాయి. వాహనం నడుపుతున్నపుడుమెలకువ వహించండి. విద్యార్థినుల ఆలోచనలు తప్పుదారి పట్టే ఆస్కారం ఉంది.
 
మీనం :- కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. స్టాకు మార్కెట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. స్థిరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. కోర్టు వ్యవహరాలు, ఆస్తి తగవులు పరిష్కారమవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

Elephant: తిరుమల శ్రీవారి మెట్టు సమీపంలో ఏనుగుల గుంపు.. యాత్రికులు షాక్

Andhra Pradesh: దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు.. ఏఐ సాయంతో డ్రోన్స్.. ఏర్పాట్లు ముమ్మరం

కారును గోడౌన్‌లో ఉంచినందుకు రోజుకు రూ.2400 అపరాధం చెల్లించిన బిల్ గేట్స్

అన్నీ చూడండి

లేటెస్ట్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

Sravana Mangalavaram: శ్రావణ మాసం.. మంగళగౌరీ వ్రతం చేస్తే ఏంటి ఫలితం?

Garuda Panchami 2025: గరుడ పంచమి రోజున గరుత్మండుని పూజిస్తే.. సర్పదోషాలు మటాష్

Nag Panchami 2025: నాగపంచమి రోజున నాగుల పూజ ఎందుకు.. కుండలినీ శక్తిని?

తర్వాతి కథనం
Show comments