Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

02-11-2022 బుధవారం దినఫలాలు - మహావిష్ణువును ఆరాధించిన పురోభివృద్ధి..

Advertiesment
Weekly Astrology
, బుధవారం, 2 నవంబరు 2022 (04:00 IST)
మేషం :- బ్యాంకింగ్ రంగంలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. దైవ, శుభకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. పాత బిల్లులు చెల్లిస్తారు. ఐరన్, సిమెంటు, కలప రంగాలలో వారికి వారి రంగాలలో చురుకుదనం కానవస్తుంది. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటప్పుడు ఆత్మనిగ్రహం వహించండి.
 
వృషభం :- కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకం. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే ఆస్కారం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. తలపెట్టిన పనులు సవ్యంగా సాగకవిసుగు కలిగిస్తాయి. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవటం క్షేమదాకయం.
 
మిథునం :- బంధువుల రాకవల్ల ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. హోటల్, కేటరింగ్ రంగాలలో పనివారితో చికాకులు అధికమవుతాయి. ఏదైనా చేయ్యాలని నిర్ణయించుకుంటే, దానికి తగిన ధనం లేదని చింతిస్తూ కూర్చోవద్దు. నిరుద్యోగులకు ప్రకటనలపట్ల అవగాహన ముఖ్యం. ఆలయాలను సందర్శిస్తారు.
 
కర్కాటకం :- ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు భిన్నంగా ఉంటాయి. ప్రముఖుల కలయిక కోసం నిరీక్షణ తప్పదు. భాగస్వామిక ఒప్పందాల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారులతో పర్యటనలు అధికమవుతాయి. స్త్రీలకు ఆరోగ్యభంగం, వైద్య సేవలు అవసరమవుతాయి. రుణాలు, చేబదుళ్లు తప్పకపోవచ్చు.
 
సింహం :- విదేశాల్లోని ఆత్మీయుల పలకరింపు సంతోషం కలిగిస్తుంది. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారం కాగలవు. స్త్రీలు కుటుంబ, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మెలగాలి. రుణ బాధలనుంచి విముక్తి పొందటంతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. స్టాక్మర్కెట్, వ్యవసాయ రంగాల వారికి ఆశాజనం.
 
కన్య :- వృత్తి ఉద్యోగ పరంగా ప్రజా సంబంధాలు మెరుగుపడతాయి. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలం. ఆకస్మికంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. స్త్రీలకు టీ.వీ కార్యక్రమాల నుంచి ఆహ్వానం అందుతుంది. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులు ఎదుర్కుంటారు.
 
తుల :- సహోద్యోగులతో సమావేశాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ సంతానం నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు. వివాదాస్పద విషయాల్లో వాస్తవాలు బయటపడతాయి. మీ కొచ్చిన కష్టానికి సానుభూతి చూపే వారే కాని సహాయం చేసే వారుండరు. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవటం ఉత్తమం.
 
వృశ్చికం :- కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత, పనివారలతో మెళుకువ చాలా అవసరం. స్త్రీలు తమ మాటే నెగ్గాలన్న పంతం విడనాడటం క్షేమదాయకం. గృహ నిర్మాణ ప్లాను ఆమోదం పొందటంతో పాటు లోన్ మంజూరు కాగలదు. విద్యార్థినులు బజారు చిరుతిళ్లకు దూరంగా ఉండట క్షేమదాయకం.
 
ధనస్సు :- స్త్రీలకు ఆకస్మిక ధనలాభంతో పాటు మనోవాంఛలు నెరవేరగలవు. కష్టమైన పనులను సైతం పట్టుదలతో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణాల్లో బిల్డర్లు, కాంట్రాక్టర్లు జాగ్రత్తగా మెలగాలి. ప్రైవేట్, పత్రికా సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. కొత్త బాధ్యతలు, ఆర్థిక లావాదేవీలతో సతమతమవుతారు.
 
మకరం :- హోల్ సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం క్షేమదాయకం. కలెక్షన్ ఏజెంట్లు, మార్కెట్ రంగాల వారికి ఓర్పు ముఖ్యం. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. స్త్రీలకు నరాలు, దంతాలు, కళ్లకు సంబంధించిన చికాకులుతప్పవు.
 
కుంభం :- ప్రింటింగ్ రంగాల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం వేరొక వ్యవహారానికి వెచ్చించాల్సి వస్తుంది. విదేశాల్లోని మీ సంతానం యోగక్షేమాలు సంతృప్తినిస్తాయి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఇతరులు మీ గురించి చేసిన వ్యాఖ్యలు బాధిస్తాయి.
 
మీనం :- పండ్ల, పూల, కూరగాయ, నిత్యావసర వస్తువ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. విద్యార్థులు క్రీడలు పట్ల ఆసక్తి కనబరుస్తారు. స్త్రీల మాట తీరు ఇబ్బందులకు దారితీస్తాయి. చెక్కులు చెల్లక వ్యాపారులు, పారిశ్రామికవ్రేతలు ఇబ్బందులెదుర్కుంటారు. ఎదుటివారి విషయాలకు దూరంగా ఉండటం మంచిది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

01-11-2022 మంగళవారం దినఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధించడంవల్ల శుభం...