Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 8 April 2025
webdunia

31-10-2022 సోమవారం దినఫలాలు - శంకరుడిని పూజించినా మీ సంకల్పం..

Advertiesment
Astrology
, సోమవారం, 31 అక్టోబరు 2022 (04:00 IST)
మేషం :- ధైర్యంతో మందడుగు వేస్తే తప్ప అది ఆనందదాయకం కాదు. ఒక కార్యం నిమిత్తం ధనం విరివిగా వెచ్చిస్తారు. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. బ్యాంకు వ్యవహారాలు చురుకుగా సాగుతాయి. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు.
 
వృషభం :- ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శక్తివంచన లేకుండా మీ యత్నాల సాగించండి. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధికం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. దాపరికం వల్ల అశాంతి, చికాకులు తప్పరు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలకు మంచి స్పందనలభిస్తుంది.
 
మిథునం :- వ్యాపారాల్లో పోటీ, షాపు పనివారల నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తాయి. మీ సంతానం ఇష్టాలకు అడ్డు చెప్పటం మంచిది కాదు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. ఉద్యోగస్తులకు సెలవలు మంజూరు కావడం కష్టమే. కుటుంబీకుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు.
 
కర్కాటకం :- మీ వాహనం పార్కింగ్ చేసే విషయంలో ఇబ్బందులెదుర్కుంటారు. సంగీత, నృత్య కళాకారులకు ప్రోత్సాహకరం. మీ సంతానం విద్యా, ప్రయాణంపై శ్రద్ధ వహిస్తారు. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధికం. చెల్లింపులు, కరెన్సీ నోట్లు తీసుకొనే విషయంలో మెళుకువ వహించండి.
 
సింహం :- పాత మిత్రులు, చిన్ననాటి వ్యక్తులు ఆకస్మికంగా తారసపడతారు. హామీలు, వాణిజ్య ఒప్పందాల్లో మెలకువ వహించండి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. బెట్టింగులు, జూదాల వల్ల ఇరకాటంలో పడే ఆస్కారం ఉంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు.
 
కన్య :- వస్తువుల కొనుగోళ్ళు వంటి శుభఫలితాలున్నాయి. రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. నేడు పూర్తి కాని పనులు రేపటికి పూర్తికాగలవు. పత్రికా ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. స్త్రీల మాటకు ఇంటా బయటా మంచి స్పందన లభిస్తుంది. చిన్ననాటి మిత్రులు అనుకోకుండా తారసపడతారు.
 
తుల :- ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహన కుదరదు. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సామాన్యంగా ఉంటాయి. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి. ప్రింటింగ్ రంగాల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.
 
వృశ్చికం :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. చేపట్టిన ఉపాధి పథకాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. అతిథి మర్యాదలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు అధికారులు, సహోద్యోగులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
ధనస్సు :- కీలకమైన వ్యవహారాలు మీ జీవిత భాగస్వామికి తెలియజేయటం అన్ని విధాలా శ్రేయస్కరం. సోదరీ, సోదరుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు బోనస్, పండుగ అడ్వాన్సులు చేతికందుతాయి. మీ ప్రతిభ వెలుగులోనికి వచ్చి మంచి విజయం సాధిస్తారు.
 
మకరం :- జీవనోపాధికి సొంతంగా ఏదైనా చేయాలి అనే ఆలోచన స్ఫురిస్తుంది. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త వ్యక్తులను దూరంగా ఉంచటం క్షేమదాయకం. స్త్రీలకు టి.వి. ఛానెళ్ళ కార్య క్రమాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. ఏదన్నా అమ్మకానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
కుంభం :- స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. ప్రింటింగ్ రంగాల వారికి అవకాశాలు లభిస్తాయి. ఐరన్, స్టీల్, ఉడ్, సింమెట్ వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. ఎవరికైన ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. జాగ్రత్త వహించండి. పరస్త్రీలతో సంభాషించునపుడు ఏకాగ్రత, మెళుకువ చాలా అవసరం.
 
మీనం :- ముఖ్యమైన విషయాలలో మిమ్మల్ని సంప్రదిస్తారు. ప్రయాణాల్లో తొందరపాటుతనం అంత మంచిది కాదు. దైవ కార్యాలకు పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వటం వల్ల మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బంధు మిత్రుల రాకపోకలు అధికంగా ఉంటాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

30-10-2022 ఆదివారం దినఫలాలు - శ్రీమన్నారాయణస్వామిని తులసీదళాలతో..