Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

29-10-2022 శనివారం దినఫలాలు - సుబ్రమణ్యస్వామిని పాలతో అభిషేకించిన...

Advertiesment
subramanya swami
, శనివారం, 29 అక్టోబరు 2022 (04:00 IST)
మేషం :- విద్యార్థులు బయటి తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఐరన్, సిమెంట్, కలప వ్యాపారస్తులకు శుభదాయకం. మీ ఉన్నతిని చాటుకోవటానికి ధనం విరివిగా వ్యయం చేయవలసి ఉంటుంది. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి.
 
వృషభం :- ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. రాజకీయాలలో వారు ప్రత్యర్థులు పెరుగుతున్నారు అని గమనించండి. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. ఉపాధ్యాయులకు ప్రోత్సాహం లభిస్తుంది. మీ శ్రీమతిని సలహా అడగటం శ్రేయస్కరం.
 
మిథునం :- కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. వాస్తు మార్పుల వల్ల వ్యాపారంలో ఆశించిన ఫలితాలుంటాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది.
 
కర్కాటకం :- మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసివస్తుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, అదనపు బాధ్యతలు, పనిభారం వంటి చికాకులు తీప్పవు.
 
సింహం :- ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. మీ అంచనాలు, పథకాలు బెడిసికొట్టే ఆస్కారం ఉంది. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. బంధు మిత్రులు మీ వైఖరిని తప్పుపడతారు. స్త్రీలకు పని భారం అధికమవుతుంది. వృత్తులు, మార్కెట్ రంగాల వారికి శ్రమ అధికం, ఆదాయం స్వల్పం.
 
కన్య :- బంధు మిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. అనుకోని విధంగా మీరు ప్రయాణం చేయవలసి వస్తుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
తుల :- చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ప్లీడర్లు, ప్లీడర్లకు ఒత్తిడి, ఆందోళనలు అధికమవుతాయి. బంధు మిత్రులతో కలిసి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి.
 
వృశ్చికం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కుటుంబంలో ఒకరి ధోరణి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఆకస్మికంగా ఒక అవకాశం కలిసివస్తుంది. ఒకానొక నిజాన్ని ధైర్యంగా ఒప్పుకోవటంతో ఇతరులకు మీరంటే గౌరవం ఏర్పడుతుంది. ఆలయాలను సందర్శిస్తారు.
 
ధనస్సు :- పత్రికా సంస్థలలోనివారికి పనిభారం, తోటివారి వల్ల మాటపడకతప్పదు. స్త్రీలకు అవగాహన లేని విషయాల్లో సమస్యలు తలెత్తుతాయి. బకాయిలు, ఇంటి అద్దెల వసూలులో సౌమ్యంగా మెలగాలి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయ వంతంగా పూర్తిచేస్తారు. విద్యార్థులు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం.
 
మకరం :- ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరా లెదుర్కోవలసి వస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులే అనుకూలిస్తాయి. మీ జీవితభాగస్వామి విషయంలో దాపరికం మంచిది కాదు. మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు.
 
కుంభం :- మీ సంతానం మొండి వైఖరి చికాకులను కలిగిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు కలిసివస్తుంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. సాహస ప్రయత్నాలు విరమించండి. రాజకీయ నాయకులకు పదవీ సమస్యలు అధికమవుతాయి. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో అంత సఖ్యత ఉండదు.
 
మీనం :- బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. కానివేళలో ఇతరుల రాకఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులెదుర్కోవలసి వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించుటకు అనువైన సమయం. పాత రుణాలు చెల్లించటంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆదివారం కార్తీక పంచమి.. వారాహికి ఈ నైవేద్యాలను?