03-09-2025 బుధవారం దినఫలాలు - స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన...

రామన్
బుధవారం, 3 సెప్టెంబరు 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అనుకూలతలు అంతంత మాత్రమే. లౌక్యంగా వ్యవహారించాలి. అనుభవజ్ఞులను సంప్రదించండి. ఖర్చులు అధికం. పరిచయం లేని వారితో జాగ్రత్త. దంపతుల మధ్య అవగాహన లోపం. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజాన్నిస్తుంది. కొత్త పనులు చేపడతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రతిభను చాటుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఆదాయం బాగుంటుంది. ప్రణాళిలు వేసుకుంటారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. పత్రాలు అందుకుంటారు. బెట్టింగులకు పాల్పడవద్దు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంకల్పం నెరవేరుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. పనులు సానుకూలమవుతాయి. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. సంతానం విదేశీ చదువులపై దృష్టి పెడతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పరిస్థితులు అనుకూలిస్తాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఖర్చులు సామాన్యం. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలను సన్నిహితులు ప్రోత్సహిస్తారు. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలకు ధనం అందుతుంది. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ రోజు అనుకూలదాయకం. అనుకున్నది సాధిస్తారు. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు జాగ్రత్త. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తంజేయండి. కొంత మంది మీ వ్యాఖ్యలను వక్రీకరిస్తారు. రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకోండి. ఖర్చులు విపరీతం. పెట్టుబడులు కలిసిరావు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వాగ్ధాటితో నెట్టుకొస్తారు. పొదుపు ధనం అందుతుంది. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. బంధుత్వాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రయాణం తలపెడతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంప్రదింపులు ఫలిస్తాయి. అవకాశాలను దక్కించుకుంటారు. ఆత్మీయుల రాక ఉల్లాసం కలిగిస్తుంది. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు విపరీతం. బాధ్యతలు అప్పగించవద్దు. పత్రాలు జాగ్రత్త. సోదరుల వైఖరిలో మార్పు వస్తుంది. వివాదాలు సద్దుమణుగుతాయి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. పెద్దల సలహా పాటించండి. పట్టుదలతో శ్రమించిన గాని పనులు పూర్తి కావు. అనవసర విషయాల్లో జోక్యం తగదు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సమర్ధతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఓర్పుతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పూర్తవుతాయి. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

13-11-2025 గురువారం ఫలితాలు - చేతిలో ధనం నిలవదు

12-11-2025: నవంబర్ 12, 2025 మీ దిన రాశి ఫలితాలు..సంకల్పం సిద్ధిస్తుంది

దాంపత్య జీవితం సుఖమయం కావాలంటే ఇలాంటి స్నానం చేయాలట

నవంబర్ 12, 2025: కాలభైరవ జయంతి.. కాలభైరవ అష్టకాన్ని ఎనిమిది సార్లు పఠిస్తే?

Black Cat in Dreams: కలలో నల్లపిల్లి కనిపిస్తే మంచిదా లేకుంటే?

తర్వాతి కథనం
Show comments