Webdunia - Bharat's app for daily news and videos

Install App

02-05-2024 గురువారం దినఫలాలు - ఫ్లీడర్లకు, గుమస్తాలకు మిశ్రమ ఫలితం...

రామన్
గురువారం, 2 మే 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| చైత్ర ఐ|| నవమి రా.10.47 ధనిష్ట రా.11.07 ఉ.శే.వ.5.46కు ఉ.దు. 9.50 ల 10.40 ప. దు. 2. 53 ల 3.43.
 
మేషం :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. పండ్ల, పూల, కూరగాయ వ్యాపారులకు లాభదాయకం. ఫ్లీడర్లకు, గుమస్తాలకు మిశ్రమ ఫలితం. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల జాగ్రత్త అవసరం. రావలసిన ధనం చేతికందుతుంది.
 
వృషభం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. కొన్నిసమస్యలు చిన్నవే అయిన మనశ్శాంతి దూరంచేస్తారు. 
 
మిథునం :- వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేస్తారు. స్త్రీలకు పనిభారం అధికం అవడం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. భవిష్యత్ గురించి పథకాలు వేసి జయం పొందుతారు.
 
కర్కాటకం :- రవాణా రంగాల వారికి మెళకువ అవసరం. ఏసీ, కూలర్లు, ఇన్వెర్టర్ రంగాలలో వారికి శుభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి అమ్మకానికై చేయుయత్నాలు కలిసిరావు. వృధా ఖర్చులు అధికంగా ఉంటాయి. గృహంలో స్వల్ప మార్పులు చేపడతారు.
 
సింహం :- దైవసేవ, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి, ఇతరుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఏ పని మొదలు పెట్టినా మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయండి. మానసిక ఒత్తిడి వల్ల అస్వస్థతకు గురవుతారు. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటలు ఎదుర్కుంటారు.
 
కన్య :- కొబ్బరి, పండ్ల, కూరగాయల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. స్త్రీలు షాపింగ్లకు ధనం బాగా ఖర్చు చేస్తారు. బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తారు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. మీరు చేసే ప్రతి పనిలోను అప్రమత్తంగా ఉండండి.
 
తుల :- బంధువుల నిష్టూరాలు, పట్టింపులు ఎదుర్కోవలసి వస్తుంది. పత్రికా సిబ్బందికివార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాలు వాయిదా వేయటం మంచిది. మీ కళత్రవైఖరి మీకు చికాకు కలిగించగలదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
వృశ్చికం :- ఉమ్మడి వ్యాపారాలలో ఆశించినంత పురోగతి ఉండదు. నూతన ప్రదేశ సందర్శనల వల్ల నూతన ఉత్సాహం కానరాగలదు. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ శాఖాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలు ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ఆలయ సందర్శనాల కోసం ధనం అధికంగా ఖర్చుచేస్తారు.
 
ధనస్సు :- మార్కెటింగ్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగ రీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి, ఇతరుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఇంటికి అవసరమైన వస్తుసామగ్రి సమకూర్చుకుంటారు.
 
మకరం :- సంతాన విషయంలో సంజాయిషీలు ఇచ్చుకొనవలసి వస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రైవేటు కంపెనీలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. దంపతుల ఆలోచనలు విరుద్ధంగా ఉంటాయి. ఏ విషయంలోను ఒంటెత్తుపోకడ మంచిది కాదు.
 
కుంభం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతంకూడదు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, కలహాలు చోటుచేసుకుంటాయి. బంధువుల ఆకస్మిక రాకతో ఒకింత ఇబ్బందులను ఎదుర్కొంటారు. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి.
 
మీనం :- వృత్తుల వారికి గుర్తింపుతో పాటు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగం చేయువారు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. గృహిణీలకు పనివాలతో సమస్యలు తలెత్తుతాయి. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. రుణ విముక్తులవుతారు. నూతన పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎంఎస్ కోసం చికాగో వెళ్లాడు.. పెట్రోల్ బంకులో పార్ట్‌టైమ్ చేశాడు.. కానీ..?

'ఫెంగాల్' : దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమల్లో భారీ వర్షాలు

హైడ్రాకు త్వరలో ప్రత్యేక పోలీస్ స్టేషన్.. రంగనాథ్ ప్రకటన

ములుగు జిల్లాలో కాల్పులు.. ఏడుగురు మావోయిస్టులు మృతి

ఆర్ఆర్ఆర్ కస్టడీ నిజాలు.. గుండెల మీద కూర్చుని హార్ట్ ఎటాక్ వచ్చేలా? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీకమాసం: మాస శివరాత్రి.. సాయంత్రం కొబ్బరినూనెతో దీపం.. ఎందుకు?

కార్తీక శివరాత్రి.. రాళ్ల ఉప్పు శివలింగంపై వుంచితే?

29-11-2024 శుక్రవారం ఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

అదృష్టం ఈ రాశుల వారికే.. 2025 శుక్ర గ్రహ అనుకూలంతో..?

మేష రాశిఫలం 2025 - ప్రేమ జీవితం ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments