11-11-2025 మంగళవారం ఫలితాలు - ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి

రామన్
మంగళవారం, 11 నవంబరు 2025 (05:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్ధికలావాదేవీలు కొలిక్కివస్తాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆహ్వానం అందుకుంటారు. గృహమరమ్మతులు చేపడతారు. సోదరులతో సమస్యలెదురవుతాయి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. బాధ్యతగా మెలగాలి. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థికంగా ఆశించిన ఫలితం ఉంటుంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. ఖర్చులు సామాన్యం. కొన్ని పనులు పూర్తవుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త, పిల్లల మొండితనం అసహనం కలిగిస్తుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. ఇతరుల నుంచి సాయం అందదు. ఖర్చులు విపరీతం. అవసరాలు అతికష్టంమ్మీద తీరుతాయి. నిలిపివేసిన మసులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఉల్లసాన్నిస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆలోచనలతో సతమతమవుతారు. పనులు ఒక పట్టాన సాగవు. ఏ విషయాన్ని తీవ్రంగా భావించవద్దు. ఆత్మీయులు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. స్థల వివాదాలు మరింత బలమవుతాయి. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
రోజువారీ ఖర్చులే ఉంటాయి. అనుకున్నది సాధిస్తారు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వం స్వీకరిస్తారు. అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాతవ్యక్తులు తప్పుదారి పట్టిస్తారు. బెట్టింగ్లకు పాల్పడవద్దు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కొత్త యత్నానికి శ్రీకారం చుడతారు. మీ కలుపుగోయితనం ఆకట్టుకుంటుంది. ఆపన్నులకు సాయం అందిస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లక్ష్యాన్ని సాధిస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. రావలసిన ధనం అందుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. వీసా మంజూరవుతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కొత్త పరిచయాలేర్పడతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. ఆర్భాటాలకు స్యయం చేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. పత్రాల రెన్యువల్ జాస్యం తగదు. ఆరోగ్యం మందగిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అన్ని విధాలా అనుకూలం. రుణసమస్యలు పరిష్కారమవుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు సామాన్యం. కష్టమనుకున్న పనులు సానుకూలమవుతాయి. సంతోషంగా గడుపుతారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. శుభకార్యానికి హాజరవుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు విపరీతం. పొదుపునకు అవకాశం లేదు. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
శుభవార్త వింటారు. సంప్రదింపులు ఫలిస్తాయి. తగిన నిర్ణయం తీసుకుంటారు. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. నగదు స్వీకరణలో జాగ్రత్త. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదాపడతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డాబా మీద తల్లి.. ఇద్దరు పిల్లలు.. గోడమీద నుంచి తొంగి చూసిన చిరుత.. ఆ తర్వాత? (video)

దృశ్యం సినిమా చూసి భార్య హత్యకు ప్లాన్ చేసిన భర్త... ఏమీ తెలియనట్టుగా పోలీసులకు ఫిర్యాదు...

Red Fort blast: ఢిల్లీలో కారు పేలుడు.. ఎలాంటి పుకార్లను పట్టించుకోవద్దు.. అలెర్ట్

అద్దెకొచ్చిన మహిళతో అక్రమ సంబంధం... పెళ్లికి ఒత్తిడి చేయడంతో చంపేసిన యజమాని...

దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ 2025: 30 రోజుల పాటు కదలడానికి, కనెక్ట్ అవ్వడానికి ప్రపంచవ్యాప్త ఆహ్వానం

అన్నీ చూడండి

లేటెస్ట్

సంకష్టహర చతుర్థి రోజున సంకష్ట నాశన గణేశ స్తోత్రాన్ని పఠిస్తే..?

Sankatahara Chaturthi: శనివారం సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే శనిదోషాలు పరార్

07-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య పరిష్కారం అవుతుంది..

06-11-2025 బుధవారం ఫలితాలు - ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి

కార్తీక పౌర్ణమి నాడు కాశీ విశ్వనాథుని సన్నిధిలో గంగా నదిలో వెలుగుల దీపాలు

తర్వాతి కథనం
Show comments