Webdunia - Bharat's app for daily news and videos

Install App

31-03-2021 బుధవారం దినఫలాలు - గాయత్రి మాతను ఆరాధించినా...

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (04:00 IST)
మేషం : కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్సాంతిని దూరం చేస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. కాంట్రాక్టర్లకు, క్యాటరింగ్ పనివారలకు పనిభారం అధికమవుతుంది. ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. బంధు మిత్రులను నుంచి అపనిందలు, అవమానాలు వంటివి ఎదుర్కొంటారు.
 
వృషభం : బంధు మిత్రుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. అకాల భోజనం, మితిమీరిన శ్రమ వల్ల అస్వస్థతకు లోనవుతారు. కొబ్బరి, పండ్లు, పూల, వ్యాపారులకు లాభదాయకం. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. 
 
మిథునం : హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు పనిభారం అధికమవుతుంది. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. పాత మిత్రులను కలుపుకొని వారితో ఉల్లాసంగా గడుపుతారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. రుణాలు తీర్చుతారు. 
 
కర్కాటకం : నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ఉద్యోగస్తులు అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదపడతాయి. దైవకార్యాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మికంగా సన్నిహితులను కలుసుకుంటారు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. 
 
సింహం : ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు వాయిదాపడగలవు. విద్యార్థుల చదువుల పట్ల ఏకాగ్రత చాలా అవసరం. ఉపాధ్యాయులకు విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యంలో చికాకులను ఎదుర్కొంటారు. స్త్రీలు భేషజాలకు పోకుండా లౌక్యంగా వ్యవహరిస్తే మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
కన్య : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఉపాధ్యాయ రంగాలలో వారికి అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో వదిలివేయకుండా పూర్తి చేయండి. 
 
తుల : భాగస్వామికంగా కంటే సొంతంగానే అభివృద్ది చెందుతారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కోర్టు వ్యాజ్యాలను ఉపసంహరించుకుంటారు. ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తుల శక్తిసామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో విజ్ఞతాయుతంగా ఒక సమస్యను పరిష్కరిస్తారు. 
 
వృశ్చికం : స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. సన్నిహితులకు మీరిచ్చిన సలహాలు, సూచనలు బాగా ఉపకరిస్తాయి. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతాయి. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. 
 
ధనస్సు : విరామ కాలక్షేపాల ద్వారా ఊరట పొందుతారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. బ్యాంకు పనుల్లో జాప్యం, చికాకులు ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయుకు ఒత్తిడి అధికమవుతుంది. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. 
 
మకరం : ఇప్పటివరకు విరోధులుగా ఉన్నవారు మీ సహాయం అర్థిస్తారు. ధన సహాయం, హామీలకు సంబంధించిన విషయాల్లో పునరాలోచన అవసరం. మీ కళత్ర సహకారంతో ఒక సమస్య పరిష్కారం కాగలదు. రాజకీయ నాయకులు, వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. షాపు గుమస్తాలు, పనివారలను ఓ కంట కనిపెట్టండి. 
 
కుంభం : బంధు మిత్రుల కోసం ధనం వ్యయం చేస్తారు. చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. లాయర్లకు మిశ్రమ ఫలితం ఉండగలదు. మీ ఆంతరంగిక విషయాలు, వ్యాపారాల లావాదేవీలు గోప్యంగా ఉంచండి. మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియజేయండి. 
 
మీనం : వాహనం నిదానంగా నడపడం క్షేమదాయకం. కోర్టు వాదోపవాదాల్లో ఫ్లీడర్లకు గుర్తింపు లభిస్తుంది. బంధు మిత్రులతో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రియతములతో రాక సమాచారం మీకు ఎంతో ఆనందాన్నిస్తుంది. అంతగా పరిచయం లేని వారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Roja: భయం అనేది మా నాయకుడు జగన్ రక్తంలో లేదు.. ఆర్కే రోజా (video)

Chandrababu: అంబేద్కర్‌ను గుర్తించడంలో కీలక పాత్ర ఎవరిది..? చర్చ జరగాల్సిందే.. చంద్రబాబు

పట్టపగలే చైన్ స్నాచింగ్.. కాలింగ్ బెల్ కొట్టి మహిళ మెడలోని..? (video)

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

Weekly Horoscope : 15-12-2024 నుంచి 21-12-2024 వరకు మీ రాశిఫలాలు

Today Daily Astro 14-12-2024 శనివారం దినఫలితాలు

తర్వాతి కథనం
Show comments