Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30-03-2021 మంగళవారం దినఫలాలు - రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన...

Advertiesment
30-03-2021 మంగళవారం దినఫలాలు - రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన...
, మంగళవారం, 30 మార్చి 2021 (04:00 IST)
మేషం : ఆర్థిక వనరులను పెంపొందించుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. ఇతరులకు పెద్ద మొత్తంలో రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన, మెళకువ అవసరం. స్త్రీల కారణంగా చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. వాతావరణంలో మార్పు మీ పనులకు ఆటంకమవుతుంది. 
 
వృషభం : సజ్జన సాంగత్యం, సభలు, సమావేశాల్లో గౌరవం పొందుతారు. దైవ, సేవా కార్యాలపట్ల ఆకర్షితులవుతారు. పత్రికా సంస్థలలోని వారికి చిన్న చిన్న పొరపాట్లుదొర్లే ఆస్కారం ఉంది. చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. ఎండుమిర్చి, కంది, పసుపు, ఉల్లి, బెల్లం, వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. 
 
మిథునం : ఉద్యోగస్తులకు హోదా పెరిగే సూచనలున్నాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల వైఖరి సమీక్షించుకుంటారు. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచాయలేర్పడతాయి. వృత్తుల వారికి ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. బంధువుల నిష్టూరాలు, పట్టింపులు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
కర్కాటకం : వస్త్ర, బంగారం, వెండి రంగాల వారికి ఆసక్తి పెరుగుతుంది. శాంతియుతంగా వ్యవహరిస్తే మీ సమస్యలు సానుకూలవుతాయి. సోదరుల గురించి ఆందోళన చెందుతారు. భాగస్వామిక ఒప్పందాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. 
 
సింహం : వ్యతిరేకులను సైతం మీ వైపునకు తిప్పుకుంటారు. మీ సంతానం కదలికలను గమనిస్తూవుండాలి. ప్రైవేట్ ఫైనాన్సులో మదుపు క్షేమంకాదు. ప్రతి వ్యవహారం మీకు అనుకూలంగానే ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోభివృద్ధి సంభవం. కోర్టు వాయిదాలు విసుగు కలిగిస్తాయి. బంధువులను కలుసుకుంటారు. 
 
కన్య : బ్యాంకు పనుల్లో ఏకాగ్రత అవసరం. విలువైన వస్తువులు మరమ్మతులకు గురవుతాయి. ఆశలొదిలేసుకున్న బకాయిల వసూలులో కళ, క్రీడ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. ఉద్యోగస్తులకు అధికారులతో చికాకులు ఎదురవుతాయి. మీ అభిప్రాయాలను సూచన ప్రాయంగా తెలియజేయండి. 
 
తుల : స్త్రీల మూలకంగా వివాదాలు ఎదుర్కొంటారు. బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారులు కొనుగోలుదార్లతో చికాకులు, సమస్యలు ఎదుర్కొంటారు. అధికారుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ప్రింటింగ్ రంగాల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. విజ్ఞతతో మీ అత్మాభిమానం కాపాడుకుంటారు. 
 
వృశ్చికం : ఉపాధ్యాయులు ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. కొన్నిసార్లు తక్కువ వారి నుంచి సహాయం పొందవలసి వస్తుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు, శ్రమ అధికం. ప్రేమికుల వ్యవహారం వివాదాస్పదమవుతుంది. 
 
ధనస్సు : దంపతుల మధ్య దాపరికంకూడదు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనలతో మోసపోయే వీలుంది. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. విలువైన వస్తువులను పోగొట్టుకున్న వారికి అందించి మీ నిజాయితీని చాటుకుంటారు. సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు సదావకాశాలు లభించగలవు. 
 
మకరం : పెద్దమొత్తం నగదుతో ప్రయాణాలు క్షేమంకాదు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. విదేశీ వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. చిన్నారుల, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయంలో ఖర్చులు అంచనాలను మించుతాయి. స్త్రీలకు దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. 
 
కుంభం : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. మితమీరిన శారీరక శ్రమ వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. వాహనం ఏకాగ్రతతో నడపడం క్షేమదాయకం. వృత్తులవారు ఆదాయం కంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి చికాకులు తప్పదు. 
 
మీనం : ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదు అని గమనించండి. సందర్భం లేకుండా నవ్వడం వల్ల కలహాలు ఎదుర్కోవలసి వస్తుంది. లిటిగేషన్, కోర్టు వ్యవహారాలు వాయిదావేయడం మంచిది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏప్రిల్ 14 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలు : తితిదే