Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

24-03-2021 బుధవారం దినఫలాలు - నరసింహస్వామిని ఆరాధించినా...

Advertiesment
24-03-2021 బుధవారం దినఫలాలు - నరసింహస్వామిని ఆరాధించినా...
, బుధవారం, 24 మార్చి 2021 (04:00 IST)
మేషం : పొట్ట, నరాలకు సంబంధించి చికాకులు ఎదుర్కొంటారు. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో ఏకీభావం లోపిస్తుంది. అధిక ఉష్టం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుతుంది. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి గురవుతారు. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. 
 
వృషభం : నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో సమయస్ఫూర్తితో వ్యవహరించడం మంచిది. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగి రాజాలదు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. షేర్ల, క్రయ విక్రయాల్లో పునరాలోచన చాలా అవసరం. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణాలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. 
 
మిథునం : పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరం. మీ కళత్ర మొండివైఖరి వల్ల ఇబ్బందులకు గురవుతారు. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారుండరన్న వాస్తవం గ్రహించండి. పన్నులు, బీమా బిల్లులు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులు ఆశిస్తున్న ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. 
 
కర్కాటకం : దంపతుల మధ్య నూతనోత్సాహ చోటుచేసుకుంటుంది. విద్య, వైజ్ఞానిక రంగాలలోనివారికి జయం చేకూరుతుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారికి పనివారలతో చికాకులు తప్పవు. దూర ప్రయాణాలలో అసౌకర్యానికి గురవుతారు. రిప్రజెంటేటివ్‌లకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఆశాజనకం. 
 
సింహం : స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి వల్ల ఆందోళనలకు గురవుతారు అర్థాంతరరంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభమవుతాయి. స్త్రీలు వాదోపవాదాలకు దిగడం వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. మీ అతిథి మర్యాదలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. విద్యుత్, ఎలక్ట్రానికల్, ఇన్వెర్టర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. 
 
కన్య : వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. బ్యాంకుల్లో మీ పనున్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత, మెళకువ అవసరం. 
 
తుల : జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు మీ చేతులమీదుగానే సాగుతాయి. రావలసిన ధనం వాయిదాపడుతుంది. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత నెలకొంటుంది. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. 
 
వృశ్చికం : ఒక పుణ్యక్షేత్రం సందర్శించాలనే కోరిక స్ఫురిస్తుంది. వైద్యులు అరుదైన ఆపరషన్లను విజయవంతంగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య విభేదాలు తొలగిపోయి ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తులు పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. 
 
ధనస్సు : మందులు, రసాయనాలు, ఆల్కహాలు, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. దైవ, సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా వెచ్చిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. మీ అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలికంగా వాయిదాపడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. 
 
మకరం : ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. ఎప్పటి నుంచో ఆగివున్న పనులు పునఃప్రారంభమవుతాయి. రాజకీయ నాయకులు, విరోధులు వేసే వథకాలు తెలివితో తిప్పిగొట్టగలుగుతారు. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. 
 
కుంభం : కొబ్బరి, పండ్లు, పూల, కూరలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పాత బాకీలు వసూలు విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. స్త్రీలకు తల కాళ్లు, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. ఉద్యోగరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
మీనం : వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో రాణిస్తారు. సోదరీ, సోదరుల మధ్య ఆస్తి పంపకాల ప్రస్తావన వస్తుంది. మీ చిన్నరుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పట అధికమవుతాయి. అంతగా పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళవారం పూట సాంబ్రాణితో ధూపం వేస్తే..? (video)