Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుధవారం (26-05-2021) రాశిఫలితాలు - ఇష్టదేవతను స్మరించినా...

Webdunia
బుధవారం, 26 మే 2021 (04:00 IST)
మేషం : వ్యాపారానికై చేయుయత్నాలు ఫలించవు. ప్రియతముల రాక ఉల్లాసం కలిగిస్తుంది. బహిరంగ సభలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తి కానవస్తుంది. మొండి బాకీలు వసూలు కాగలవు. గత కొంతకాలంగా అనుభవిస్తున్న చికాకులు తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది. 
 
వృషభం : మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. నిరుద్యోగులకు అవకాశాలు కొన్ని తృటిలో తప్పిపోతాయి. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్యల్యాలు పెంపొందుతాయి. విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి. ధనసహాయం, హామీలకు దూరంగా ఉండటం మంచిది. 
 
మిథునం : వృత్తి వ్యాపారాల్లో పోటీ ఎదుర్కొంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ప్రింటింగ్ రంగాల్లో వారికి పనిభారం బాగా పెరుగుతుంది. సజ్జన సాంగత్యం, సభలు, సమావేశాల్లో గౌరవం పొందుతారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. 
 
కర్కాటకం : పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి గురవుతారు. కళత్ర మొండివైఖరి వల్ల కుటుంబంలో కలహాలు, చికాకులు అధికమవుతాయి. కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటాయి. ఉద్యోగస్తులకు అధికారులతో అప్రమత్తత అవసరం. 
 
సింహం : కుటుంబీకులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. స్త్రీలకు టీవీ కార్యక్రమాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి లభిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించునపుడు మెళకువ అవసరం. 
 
కన్య : వృత్తిపరమైన ప్రయాణాలు, సరుకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఏసీ రంగాల్లో వారికి పురోభివృద్ధి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చక పోవచ్చు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. 
 
తుల : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. దైవ, సేవా పుణ్యకార్యాలలో నిమగ్నమవుతారు. ఊహించని విధంగా ధనలాభం పొందుతారు. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. నూనె, మిర్చి, పసుపు, ఉల్లి, ఎండుమిర్చి, ధాన్యం వ్యాపారస్తులకు అభివృద్ధి. 
 
వృశ్చికం : కొబ్బరి, పండ్లు, హోటల్, చల్లని పానీయ తినుబండారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు ఆరోగ్య సంతృప్తి, శారీరకపటుత్వం నెలకొంటాయి. మీ వాహనం ఇతరులకివ్వడం వల్ల ఇబ్బందులకు గురవుతారు. మీ హోదాకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి.  
 
ధనస్సు : ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రాధాన్యం. మంచి మాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవడానికి యత్నించండి. ప్రయాణాలు, ఒప్పందాల్లో మెళకువ వహించండి. ఇతరులపై ఆధారపడక ప్రతి విషయంలోనూ మీరే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. 
 
మకరం : దంపతుల మధ్య అకారణ కలహం, పట్టింపులు అధికమవుతాయి. ప్రియతముల రాక చిన్ననాటి వ్యక్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. పనివారలు, గుమస్తాలను ఓ కంట కనిపెట్టడం మంచిది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. 
 
కుంభం : నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత పుస్తక పఠనం చాలా అవసరం. ఉమ్మడి ఆర్థిక లావాదేవీల్లో పెద్దల సహకారం లభిస్తుంది. బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. కోళ్ళ, మత్స్యు రంగాల్లో వారికి చికాకులు తప్పవు. లౌక్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలి. 
 
మీనం : వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించుట వల్ల అస్వస్థతకు లోనవుతారు. మీ బలహీనతలను అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ఆలయాలను సందర్శిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

లేటెస్ట్

దీపావళి 2024: ఆవు నెయ్యి, నువ్వుల నూనెలతో దీపాలు వెలిగిస్తే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమిటి?

ఈ 3 లక్షణాలున్న భార్యతో వేగడం చాలా కష్టం అని చెప్పిన చాణక్యుడు

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఎనిమిది దేశాలు, 13 నగరాల్లో కళ్యాణోత్సవం

దీపావళి రోజున దీపాలను నదుల్లో వదిలేస్తే..?

గురువారం అక్టోబర్ 31న తిరుమల విఐపి దర్శనం రద్దు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments