Webdunia - Bharat's app for daily news and videos

Install App

24-05-2020 ఆదివారం మీ రాశి ఫలితాలు-ఆదిత్య హృదయం చదివినా..?

Webdunia
ఆదివారం, 24 మే 2020 (05:00 IST)
ఆదిత్య హృదయం చదివినా లేక విన్నా సర్వదా శుభం కలుగుతుంది. 
 
మేషం: మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మితిమీరిన శరీర శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. అయిన వారితో మీ సమస్యలు చెప్పుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
వృషభం: కొబ్బరి పండ్లు, చల్లని పానీయ వ్యాపారస్తులకు కలిసివచ్చేకాలం. ఆత్మీయులతో కలిసి విహార యాత్రలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనుల్లో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. రాజకీయనాయకులు సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. 
 
మిథునం: అనుకోకుండా ఒక చిన్నారితో విడదీయరాని బంధం ఏర్పడుతుంది. వ్యాపారులు కొనుగోలుదార్లతో చికాకులు సమస్యలు ఎదుర్కొంటారు. అధికారుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు.
 
కర్కాటకం: వృత్తి, ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. ఆదాయం పెంచుకునే దిశగా ఆలోచనలుంటాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో మెలకువ వహించండి. మీ అభిప్రాయాలను సూచనప్రాయంగా తెలియజేయండి. అందివచ్చిన అవకాశం చేజారినా ఒకందుకు మంచిదేనని అనిపిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. 
 
సింహం: పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రేమికుల ఆలోచనలు పెడదాది పట్టే ఆస్కారం వుంది. ఖర్చులు అదుపు కాకపోగా మరింత ధన వ్యయం అవుతుంది. ఉపాధ్యాయులకు రిప్రజెంటేటివ్‌లకు సదవకాశాలు లభిస్తాయి. రాజకీయనాయకులకు ప్రయాణాల్లో మెళకువ చాలా అవసరం.
 
కన్య: రవాణా రంగాల వారికి మెళకువ అవసరం. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. పాత రుణాలు తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు. ఇతరుల స్థితిగతులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు.
 
తుల: మీ సంతానం రాక కోసం ఎదురుచూస్తారు. ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి కనిపిస్తుంది. ప్రయాణాలు చివరిలో వాయిదా పడతాయి. ఏసీ, కూలర్లు, ఇన్వెర్టర్ రంగాల్లో వారికి శుభదాయకంగా ఉంటుంది. బంధువర్గాల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి.
 
వృశ్చికం: వ్యాపారాలు కొనుగోలుదార్లతో చికాకులు, సమస్యలు ఎదుర్కొంటారు. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. స్త్రీలకు దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలేర్పడతాయి.
 
ధనస్సు: తలపెట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుట వలన మాట పడవలసి వస్తుంది. బంధుమిత్రులతో మనస్పర్ధలు తలెత్తుతాయి. సన్నిహితులతో మాటపట్టింపులు తప్పవు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మకరం: ఆర్థికంగా అభివృద్ధి కానవచ్చినా మానసిక ప్రశాంతత ఉండజాలదు. ప్రముఖుల కలయికతో ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన అభివృద్ధిని పొందుతారు. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
కుంభం: ఆర్థిక వ్యవహారాల్లో ఒక అడుగు ముందుకేస్తారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. బంధువుల రాకతో ధనం అధికంగా వెచ్చిస్తారు. ఎవరినీ అతిగా విశ్వసించడం మంచిది కాదు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.
 
మీనం: పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. నిరుద్యోగులు ఇంటర్వ్యూ సమాచారం అందుకుంటారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి వుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

అన్నీ చూడండి

లేటెస్ట్

Ekakshi coconut: ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవట్లేదా..? అప్పుకు ఏకాక్షి నారికేళంతో చెక్?

Rang Panchami 2025: రంగులు సమర్పిస్తే.. దైవానుగ్రహం..

19-03-2025 బుధవారం దినఫలితాలు : రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు

భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : తితిదే

TTD : జూన్ మాసపు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల.. వివరాలివే

తర్వాతి కథనం
Show comments