Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారం (22-05-2021) రాశిఫలితాలు - పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు

Webdunia
శనివారం, 22 మే 2021 (04:00 IST)
మేషం : స్థిరాస్తి వ్యవహారాల్లో మెళకువ అవసరం. హోటల్, కేటరింగ్, తినుబండారాల వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగ యత్నాలలో మందకొడిగా సాగుతాయి. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. కుటుంబీకుల కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. ఫ్లీడర్లకు, గుమస్తాలకు మిశ్రమ ఫలితం.
 
వృషభం : మీ కళత్ర మొండివైఖరి వల్ల ఇబ్బందులకు గురవుతారు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో సమయస్ఫూర్తితో వ్యవహరించడం మంచిది. సోదరీ, సోదరుల మధ్య సఖ్యత లోపిస్తుంది. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది.
 
మిథునం : వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు సంతృప్తి. చిట్‌ఫండ్, ఫైనాన్స్ రంగాలలో వారికి ఖాతాదారుల నుంచి ఒత్తిడి, పెరుగుతుంది. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణాలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తులకు తోటివారితో లౌక్యం అవసరం.
 
కర్కాటకం : వృత్తి, ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపుతారు. స్థిరాస్తి అమ్మాకానికై చేయు యత్నాలు కలిసిరావు. కార్మికుల ఆందోళన అధికమవుతుంది. ప్రత్యర్థులు మీ ఉన్నతిని, సమర్థతను గుర్తిస్తారు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి.
 
సింహం : భాగస్వామిక చర్చలు, కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. ఖర్చులు అదుపు కాకపోగా, మరింత ధనవ్యయం అవుతుంది. ఉద్యోగస్తులకు మార్పులకై చేయు యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
 
కన్య : విద్య, వైజ్ఞానిక రంగాలలో వారికి జయం చేకూరుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. పొట్ట, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. దృఢ సంకల్పంతో ముందుకుసాగండి. దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. పెద్దల ఆరోగ్యం పట్ల మెళకువ అవసరం.
 
తుల : ఆపరేషన్ల సమయంలో వైద్యులుక ఏకాగ్రత, మెళకువ అవసరం. విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలించవు. చిన్నతరహా, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. ముఖ్యమైన వ్యవహారాలలో ఓర్పు, నేర్పుతో వ్యవహరించండి. దైవ, దర్శనాలు చేసుకోగలగుతారు. చేపట్టిన పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది.
 
వృశ్చికం : ఆర్థికంగా అభివృద్ధి కానవచ్చినా మానసిక ప్రశాంతత ఉండజాలదు. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. వ్యాపారాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తారు. ఆకస్మిక ఖర్చులు, తప్పనిసరి చెల్లింపులు ఇబ్బంది కలిగిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు ప్రముఖుల సహకారంతో సదావకాశాలు లభిస్తాయి.
 
ధనస్సు : ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలు, భేషజాలకు పోకుండా లౌక్యంగా వ్యవహరించవలసి ఉంటుంది. కాంట్రాక్టర్లు ప్రముఖుల సహకారంతో కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వాహనం నపుడునపుడు జాగ్రత్త అవసరం.
 
మకరం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. ఆపత్సమయంలో మిత్రులకు అండగా నిలుస్తారు. గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, చికాకులు ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు పనిభారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. ఖర్చులు అధికమవుతాయి.
 
కుంభం : కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాదాపవాదాలకు, హామీలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. దైవ, సేవా, పుణ్య కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులకు స్థానమార్పిడి, కొత్త బాధ్యతలు చేపట్టే అస్కారం ఉంది.
 
మీనం : నిరుద్యోగులు పోటీ పరీక్షలలో సఫలీకృతులవుతారు. స్త్రీలకు నరాలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించి చికాకులను ఎదుర్కొంటారు. ప్రముఖుల కలయిక సాధ్యంకాదు. విదేశాల్లోని అభిమానుల క్షేమసమాచారం ఆందోళన కలిగిస్తుంది. రుణాలు తీర్చుతారు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఆంక్షలు తప్పవు. 
 
  
 
వృశ్చికం : గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. స్త్రీల ప్రతిభకు తగిన అవకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు విచారణకు ముగుస్తాయి. దుబారా ఖర్చులు నివారించగలుగుతాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. జాయింట్ వెంచర్లు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం.
 
ధనస్సు : మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ఆకస్మిక ఖర్చులు, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవడం వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. 
 
మకరం : ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. మీరెదుర్కొన్న సమస్య బంధువులకు ఎదురు కావడంతో మీ కష్టాన్ని, ఆందోళనని గుర్తిస్తారు. 
 
కుంభం : రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. జాయింట్ వెంచర్లు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. 
 
మీనం : మీ అభిప్రాయాల వ్యక్తీకరణకు సందర్భం కలిసివస్తుంది. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ముఖ్యం. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. పెద్దమొత్తం ధనం చెల్లింపులో ఆలోచన, తోటివారి సలహా తీసుకోవడంతో ఉత్తమం. దూర ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హమాస్ కమాండ్ కంట్రోల్‌ ఆస్పత్రిలో దాడి.. 43 మంది మృతి

ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మృతి.. పవన్ కల్యాణ్ ఆదేశాలు

పీకలేకపోయిన పవన్ పార్టీలో చేరతానా? తమ్మినేని సీతారాం (Video)

ఏపీ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్

పెళ్లి విందు వడ్డించడంలో ఆలస్యం... వివాహాన్ని రద్దు చేసుకున్న వరుడు...

అన్నీ చూడండి

లేటెస్ట్

Tirumala Facts: బంగారు గోపురం.. వైకుంఠం నుంచి నేరుగా కొండమీదకి దిగారట!

28-12-2024 శనివారం దినఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

Tirumala: తిరుమలలో అద్భుతం.. మంచు కొండల్లా మారిన ఏడు కొండలు (video)

27-12-2024 శుక్రవారం దినఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

26-12-2024 గురువారం దినఫలితాలు : విలాసాలకు వ్యయం చేస్తారు...

తర్వాతి కథనం
Show comments