Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురువారం (13-05-2021) రాశిఫలితాలు - కుబేరుడిని ఆరాధించినా...

Webdunia
గురువారం, 13 మే 2021 (04:00 IST)
మేషం : రాజకీయాల్లో వారికి ఒత్తిడి, ఆందోళన తప్పదు. నిరుద్యోగులకు, ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి. ప్రైవేటు సంస్థల్లో వారికి ఆత్మనిగ్రహం చాలా అవసరం. స్త్రీలు విలువైన వస్తువులు జారవిడుచుకుంటారు. గతంలో నిలిపివేసిన వ్యాపారాలు, పనులు పునఃప్రారంభించటానికి చేయు యత్నాలు కలిసివస్తాయి. 
 
వృషభం : ఉద్యోగస్తుల శ్రమకు, అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. రుణం తీర్చడానికే చేయు యత్నాలు వాయిదాపడతాయి. స్థిర చరాస్థుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు, పనులు మార్చుకోవలసి వస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసివచ్చేకాలం. 
 
మిథునం : కంప్యూటర్, ఇన్వర్టర్, ఎలక్ట్రానిక్ రంగాల వారికి కలిసిచ్చేకాలం. స్త్రీలు మోకాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన సమస్యలు అధికమవుతాయి. రాజకీయాల్లో వారికి విరోధులు చేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. రిప్రజెంటేటివ్‌లలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒత్తిడి పెరుగుతుంది. 
 
కర్కాటకం : ఉపాధ్యాయులకు ఒత్తిడి, ఆందోళన వంటి చికాకులు అధికమవుతాయి. దుబారా నివారించలేకపోవడం వల్ల ఆందోళన తప్పదు. హామీలు ఇచ్చే విషయంలోనూ, మధ్యవర్తిత్వ వ్యవహారాలలో మెళకువ వహించండి. మీ వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. దూర ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. 
 
సింహం : అందరితో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ పథకాలు, ఆలోచనలు నిదానంగా కార్యరూపం దాల్చగలవు. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మిమ్మలను చిన్నచూపు చూసినవారే మీ ఉన్నతిని కొనియాడుతారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆత్మస్థయిర్యంతో అడుగు ముందుకువేయండి. 
 
కన్య : వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో చికాకు తప్పదు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల ఇబ్బందులకు గురికాక తప్పదు. విద్యార్థులు పై చదువులకై చేయు ప్రయత్నాలలో సఫలీకృతులవుతారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిది. 
 
తుల : విద్యార్థినులకు టెక్నికల్, సైన్స్ కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. ముఖ్యుల ఆరోగ్యం మిమ్మలను నిరాశపరుస్తుంది. పాతమిత్రుల కలయికతో మీలో కొత్త ఉత్సాహం, పలు ఆలోచనలు స్ఫురిస్తాయి. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. ఆరోగ్యం విషయంలో సంతృప్తికానరాదు. 
 
వృశ్చికం : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకువేస్తారు. కార్యసాధనలో అధిక శ్రమ, ప్రయాసలు ఎదుర్కొన్నా జయం లభిస్తుంది. పాత వ్యవహారాలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. విద్యార్థులు క్రీడా, సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి కనపరుస్తారు. పీచు, ఫోమ్, లెదర్, చిన్న తరహా పరిశ్రమల వారికి పురోభివృద్ధి. 
 
ధనస్సు : నిరుద్యోగుల రాత, మౌఖిక పరీక్షలలో సఫలీకృతులవుతారు. అధికారులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి నాంది పలుకుతారు. చిన్నతరహా పరిశ్రమలలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. 
 
మకరం : ఉద్యోగస్తులు తొందరపడి సంభాషించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. గత కొంత కాలంగా మీరు అనుభవిస్తున్న ఒత్తిళ్లు, చికాకులు క్రమంగా తొలగిపోగలవు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి అచ్చు తప్పులు పడటం వల్ల మాటపడక తప్పదు. కొంతమంది మిమ్మల్ని ఆర్థిక సహాయం అర్థించవచ్చు. 
 
కుంభం : రిప్రజెంటేటివ్‌లకు, ప్రైవేటు సంస్థల వారి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాగలదు. నిరుద్యోగులకు నిరంతరం కృషి అవసరమని గమనించండి. మీ ఆలోచను మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. దుబారా నివారించలేకపోవడం వల్ల ఆందోళన తప్పదు. మీ ఆసయ సాధనకు ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం లభిస్తుంది. 
 
మీనం : కోళ్ళ, మత్స్యు, గొర్రెల వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితం. నూతన అగ్రిమెంట్లు వాయిదా వేయడం మంచిది. వస్త్ర, కళంకారి వ్యాపారస్తులకు లాభదాయకం. ఆపరేషన్ల సమయంలో వైద్యులకు ఏకాగ్రత, ఓర్పు అవసరం. వైద్యుల తొందరపాటు నిర్ణయాల వల్ల చింతించక తప్పదు. విద్యార్థులకు నూతన పరిచయాలు సంతృప్తినిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీకమాసం: మాస శివరాత్రి.. సాయంత్రం కొబ్బరినూనెతో దీపం.. ఎందుకు?

కార్తీక శివరాత్రి.. రాళ్ల ఉప్పు శివలింగంపై వుంచితే?

29-11-2024 శుక్రవారం ఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

అదృష్టం ఈ రాశుల వారికే.. 2025 శుక్ర గ్రహ అనుకూలంతో..?

మేష రాశిఫలం 2025 - ప్రేమ జీవితం ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments