Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

బుధవారం (12-05-2021) రాశిఫలితాలు - మహావిష్ణువును ఆరాధించినా...

Advertiesment
Daily Horoscope
, బుధవారం, 12 మే 2021 (04:00 IST)
మేషం : రవాణా రంగాల వారు ప్రయాణికులతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు టీవీ చానెళ్ల కార్యక్రమాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. బంధువుల కోసం ధనం విరివిగా వ్యయం చేయవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం అధికమవుతుంది. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు. 
 
వృషభం : తరచూ దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉమ్మడి, సొంత వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోభివృద్ధి ఉండదు. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత చాలా అవసరం. ధనం చేతిలో నిలబడటం కష్టమే. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. 
 
మిథునం : కీలకమైన వ్యవహారాలు మీ జీవిత భాగస్వామికి తెలియజేయడం అన్ని విధాలా శ్రేయస్కరం. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు ఆకస్మిక ధనప్రాప్తి, పుట్టింటి వారి ఆదరణ లభిస్తాయి. ఉపాధ్యాయ దంపతులు ఒకేచోటికి బదిలీ అయ్యే సూచనలున్నాయి. 
 
కర్కాటకం : గృహ నిర్మాణానికి కావలసిన ప్లాను ఆమోదం పొందుతుంది. ఖర్చులు పెరగడంతో రుణ యత్నాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినిస్తాయి. గత తప్పిదాలు పునరావృతమయ్యే ఆస్కారం ఉంది. స్త్రీల అవసరాలు, మనోవాంఛలు నెరవేరుతాయి. 
 
సింహం : ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు అనుకూలం. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత జాప్యం వంటి చికాకులు తప్పవు. మొండి బాకీలు వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. 
 
కన్య : ఉద్యోగ విరమణ చేసిన వారికి సాదర వీడ్కోలు లభిస్తాయి. గత అనుభవంతో ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. కుటుంబీకుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు కాకులు తప్పవు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. నిరుద్యోగులకు ఆలోచన ఉపాధిపథకాలు దిశగా ఉంటాయి. 
 
తుల : పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఎంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. కొంతమంది మీ తీరును అనుమానించే ఆస్కారం ఉంది. రిప్రజెంటేటివ్‌లు ఉపాధ్యాయుల ఒత్తిడి పెరుగుతుంది. సన్నిహితులు మీ యత్నాలకు సహాయ సహకారాలు అందిస్తారు. 
 
వృశ్చికం : విదేశాల్లో ఉంటున్న ఆత్మీయుల గురించి శుభవార్తలు వింటారు. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంటుంది. చిన్న తరహా పరిశ్రమల వారికి మిశ్రమ ఫలితం. ఖర్చులు విషయంలో మెళకువ వహించండి. నిరుద్యోగులకు ఉపాధి పథకాల గురించి ఒక అవగాహనకు వస్తారు. 
 
ధనస్సు : పన్నులు, వాయిదాల సకాలంలో చెల్లిస్తారు. ఉద్యోగస్తుల సమర్థత, అంకితభావాన్ని అధికారులు గుర్తిస్తారు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చికాకులు తప్పవు. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. 
 
మకరం : రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు ఆశించినంత సంతృప్తినీయవు. సంఘంలో గౌరవం పొందుతారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాలకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. మిమ్మలను వ్యతిరేకించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. 
 
కుంభం : ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. ప్రయాణాలు అనుకున్నంత ప్రశాంతంగా సాగవు. ప్రియతముల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. విద్యార్థుల భయాందోళనలు విడనాడి శ్రమించిన మంచి ఫలితాలు లభిస్తాయి. అవివాహితులకు ఆశాజనకం. 
 
మీనం : ఉద్యోగస్తులకు స్థానమార్పిడి అనుకూలిస్తుంది. రావలసిన పత్రాలు చేతికందుతాయి. పెద్దల ఆరోగ్యం కలవరపరుస్తుంది. వృత్తులు, చిరు వ్యాపారులకు సామాన్యం. ప్రముఖుల ప్రమేయంతో ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. దూరపు బంధువుల నుంచి అందిన ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉసిరి దీపాన్ని 48 రోజుల బ్రహ్మ ముహూర్తంలో వెలిగిస్తే..?