ఉసిరి దీపాన్ని వెలిగించడం ద్వారా కలిగే శుభ ఫలితాలు... ఉసిరి దీపాన్ని ఎప్పుడు వెలిగించాలనే అనుమానాలకు తొలగించుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. ఉసిరి దీపం సాధారణంగా శ్రీ మహా విష్ణువును, శ్రీలక్ష్మికి ప్రీతికరం. ఈ దీపాన్ని శుక్రవారం పూట వెలిగించడం మంచి ఫలితాలను ఇస్తుంది. శుక్రవారం పూట ఉసిరి దీపం వెలిగించడం ద్వారా శ్రీ లక్ష్మి అనుగ్రహం పొందవచ్చు.
అలాగే బ్రహ్మ ముహూర్తంలో రెండు ఉసిరి దీపాలను వెలిగించడం ద్వారా మీ అభీష్టాలు నెరవేరుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ఉసిరి దీపాన్ని 48 రోజుల పాటు వెలిగించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. బ్రహ్మ ముహూర్తంలో కాకపోయినా ఆరు గంటలకు ముందుగా ఉసిరి దీపాన్ని వెలిగించడం ద్వారా సర్వమంగళం చేకూరుతుంది.
ఉదయం నిద్రలేచిన తర్వాత ఉసిరి దీపాన్ని పూజ గదిలో వెలిగిస్తే సర్వశుభాలు చేకూరుతాయి. ఉసిరికాయను దీపంలా సిద్ధం చేసుకుని నేతిని ఉపయోగించి, ప్రత్తి వత్తులతో దీపం వెలిగించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి.
ఈ దీపం ఐదు నుంచి పది నిమిషాల పాటు వెలుగుతుంది. అదే చాలు. ఆ ఐదు లేదా పది నిమిషాల పాటు పూజ గదిలో ప్రార్థన చేయడం ద్వారా శ్రీలక్ష్మీ, శ్రీపతి అనుగ్రహాన్ని పొందవచ్చు. తద్వారా ఈతిబాధలు వుండవు. లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.