Webdunia - Bharat's app for daily news and videos

Install App

12-12-2020 శనివారం దినఫలాలు - శనికి తైలాభిషేకం చేయించినా శుభం...

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (05:00 IST)
మేషం : ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. స్త్రీలు ఆరోగ్య విషయమై వైద్యులను సంప్రదిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఏదైనా అమ్మకం చేయాలనే మీ ఆలోచన వాయిదా వేయడం శ్రేయస్కరం. ఒక వ్యవహారం నిమిత్తం ఫ్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. 
 
వృషభం : వైద్యులు ఆపరేషన్లు చేయునపుడు జాగ్రత్త, ఏకాగ్రత అవసరం. మీ కళత్ర మొండివైఖరి, కుటుంబీకుల పట్టుదల మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఉద్యోగస్తుల అతి ఉత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. 
 
మిథునం : ధన లాభంతోపాటు మీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగే ఆస్కారం ఉంది. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. దైవ, పుణ్య కార్యాలకు ధనం ఇతోధికంగా ఖర్చు చేస్తారు. ఇంటికి చిన్న చిన్న మరమ్మతులు చేయించే అవకాశం ఉంది. స్త్రీలు సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. 
 
కర్కాటకం : బంధు, మిత్రులను కలుసుకోగలుగుతారు. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి సహకరిస్తాయి. అదనపు ఆదాయం కోసం చేసే యత్నాలు ఫలించవు. చెక్కుల జారీ సంతకాల విషయంలో అప్రమత్తత అవసరం. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి ఖర్చులు విషయంలో ఏమాత్రం రాజీకి రారు. 
 
సింహం :  పెద్దలు పరోపకారానికి పోవడం వల్ల మాటపడవలసి వస్తుంది. బ్యాంకు వ్యవహారాల్లో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. దైవ, పుణ్య కార్యాలకు ధనం విరివిగా వ్యయమవుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాతపరీక్షలలో మెళకువ అవసరం. 
 
కన్య : స్త్రీలకు కళ్లు, తల, నరాలకు సంబంధించిన చికాకులు తప్పవు. రాజకీయాల్లోని వారు సభలలో పాల్గొంటారు. ప్రతి విషయం ధనంతో ముడిపడి వుంటుంది. వ్యాపారరీత్యా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. దంపతుల మధ్య అనురాగ్య వాత్సల్యాలు బలపడతాయి. మీ సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. 
 
తుల : ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాలి. గృహం ఏర్పరచుకోవాలి అనే కోరిక బలపడుతుంది. కోర్టు వాదోపవాదాల్లో ఫ్లీడర్లకు గుర్తింపు లభిస్తుంది. మీ సంతానం అతి ఉత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
వృశ్చికం : కొబ్బరి, పండ్లు, పూల రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విద్యార్థినుల ప్రతిభా పాఠవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. లాయర్లకు క్లయింట్లతో చికాకులు వంటివి ఎదుర్కొంటారు. 
 
ధనస్సు : తనకు మించిన బాధ్యతలతో తలమునకలౌతుంటే కాస్త ఓపికగా వ్యవహరించండి. విద్యార్థినులకు పరీక్షల్లో ఏకాగ్రత, సమయపాలన చాలా అవసరం. బంధు మిత్రుల నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాల లక్ష్యం అనుకూలిస్తుంది. దాంపత్య సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. 
 
మకరం : ఇతరులపై ఆధారపడక మనస్థైర్యంతో ముందుకుసాగండి. పుణ్యక్షేత్రాలు, నూతన ప్రదేశ సందర్శనలకు ప్రణాళికలు రూపొందిస్తారు. బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్త్రీలు విందు, వినోదాలు, విలువైన వస్తువులు కొనుగోలుకై ఆసక్తి చూపుతారు. ఉపాధ్యాయులు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 
 
కుంభం : ఉద్యోగులకు అధికారుల నుంచి చికాకులు తప్పవు. బంధు మిత్రుల నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ధనం మంచి నీళ్ల ప్రాయంగా ఖర్చవుతుంది. సాంకేతిక, వైద్య రంగాల్లో వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో కొంత అసౌకర్యం తప్పక పోవచ్చు. హామీలు, వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. 
 
మీనం : ప్రముఖులను కలుసుకుంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రావలసిన ధనం కొంత ఆలస్యంగా అందుకుంటారు. దంపతుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. బెట్టింగులు, వ్యసనాల వల్ల చిక్కుల్లోపడే ఆస్కారం ఉంది. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

Chaganti Koteshwara Rao : ఏపీ విద్యార్థుల కోసం నీతి పుస్తకాలు పంపిణీ

పుష్ప 2 చూసి యువకులు చెడిపోతున్నారు, రేవతి భర్తకు 25 లక్షల చెక్కు: మంత్రి కోమటిరెడ్డి

Pawan Kalyan: ఓట్ల కోసం పనిచేయట్లేదు- ప్రజా సంక్షేమమే లక్ష్యం.. పవన్ కల్యాణ్

BRS : స్విస్ బ్యాంకుకే బీఆర్ఎస్ రుణాలు ఇవ్వగలదు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

తర్వాతి కథనం
Show comments