Webdunia - Bharat's app for daily news and videos

Install App

11-11-2018 ఆదివారం దినఫలాలు - బంధువుల రాకతో మీలో ఉల్లాసం, ఉత్సాహం...

Webdunia
ఆదివారం, 11 నవంబరు 2018 (09:39 IST)
మేషం: మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. గృహంలో ఏదైనా వస్తువు పోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. సాహస ప్రయత్నాలు విరమించండి. విదేశాలు వెళ్ళాలనే కోరిక అధికమవుతుంది. ఊహించని ఖర్చులు అధికమవుతాయి. 
 
వృషభం: ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ వ్యాపారులకు కలిసివస్తుంది. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. మీ ఆత్మీయులు మీ శ్రేయస్సు కోరుకుంటారు. సాంఘిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాహనం కొనాలనే ఆలోచన క్రియా రూపంలో పెట్టండి.  
 
మిధునం: బంధువుల రాకతో మీలో ఉల్లాసం, ఉత్సాహం అధికమవుతుంది. ధనం రాకడ, పోకడ సరిసమానంగా ఉంటాయి. అనుబంధాల్లో మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. వాతావరణంలో మార్పు మీకెంతో చికాకు కలిగించగలదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ కొత్త కొత్త ఆలోచనలు క్రియా రూపం దాల్చుతాయి.  
 
కర్కాటకం: ఆర్థికంగా ఒకడుగు ముందుకు వెళ్తారు. నిరుద్యోగులకు ఎటువంటి అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. నూతన పరిచయాల వలన మీ జీవితం ఊహించని మలుపు తిరుగబోతుంది. దుబారా ఖర్చులు అధికమవుతాయి. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమోబైల్ రంగాల్లో వారికి పనిభారం అధికమవుతుంది.     
 
సింహం: మీ జీవిత భాగస్వామి ప్రోద్బలంతో ఒక శుభకార్యానికి యత్నాలు మెుదలెడతారు. తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కాంట్రాక్టర్లకు అవకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేకపోవచ్చు. కొబ్బరి, పండ్లు, పానీయ, క్యాటరింగ్, హోటల్ తినుబండ వ్యాపారులకు శుభదాయకంగా ఉండగలదు. 
 
కన్య: స్త్రీలక అకాల భోజనం వలన ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి పనిభారం అధికమవుతుంది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిది కాదు. 
 
తుల: అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. స్త్రీలకు ఉదరం, నేత్ర సంబంధిత చికాకులు తలెత్తుతాయి. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ఏ యత్నం కలిసిరాకపోవడంతో నిరుద్యోగులు నిరుత్సాహం చెందుతారు.  
 
వృశ్చికం: ఉమ్మడి వ్యాపారాల వలన సమస్యలు తలెత్తవచ్చు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. హోటల్, క్యాటరింగ్ రంగాలలో వారికి కలగిరాగలదు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి దైవకార్యాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. 
 
ధనస్సు: కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారస్థులకు సంతృప్తికరంగా ఉంటుంది. మీ కళత్ర మెుండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ట్రాన్స్‌పోర్ట్ రంగాల్లో వారికి పనివారితో చికాకులు తప్పవు. వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు. ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగి జయం పొందండి. 
 
మకరం: ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటప్పుడు మెళకువ అవసరం. సంఘంలో మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. రాజకీయాలలో వారికి స్నేహ బృందాలు అధికమవుతాయి. గత స్మృతులు జ్ఞప్తికి వస్తాయి. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో లౌక్యం అవసరం.  
 
కుంభం: విద్యార్థులకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. విందులు, దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులు తప్పవు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనవ్యయం విషయంలో మెళకువ వహించండి. దంపతుల మధ్య దాపరికం మంచిది కాదని గమనించండి.  
 
మీనం: ఆర్థిక విషయాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులు విశ్రాంతి పొందుతారు. చేతి వృత్తులు, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. మెుండిబాకీలు వసూలవుతాయి. హోస్టళ్ళ సందర్శన, విహార యాత్రలు అనుకూలిస్తాయి. స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

లేటెస్ట్

Daily Astrology: 20-07-2025 ఆదివారం ఫలితాలు-కష్టపడినా ఫలితం ఉండదు.. ఓర్పుతో?

Weekly Horoscope: 21-07-2025 నుంచి 27-07-2025 వరకు వార ఫలితాలు

Pothuraju: హైదరాబాద్‌లో బోనాలు - పోతురాజు అలంకరణ ఎలా జరుగుతుంది.. నిష్ట నియమాలేంటి? (video)

19-07-2025 శనివారం దినఫలితాలు - ఏకాగ్రతతో యత్నం సాగిస్తారు...

Sravana Masam 2025: శ్రావణ మాసం: తులసి, బిల్వ మొక్కలను నాటితే ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments