11-01-2020 శనివారం మీ రాశి ఫలితాలు-సత్యనారాయణ స్వామిని పూజిస్తే?

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (05:00 IST)
రమాసమేత సత్యనారాయణ స్వామిని పూజించి దర్శించినట్లైతే శుభం కలుగుతుంది. 
 
మేషం: బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఒక స్థిరాస్తిని అమర్చుకుంటారు. స్త్రీలతో మితంగా సంభాషించండి. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలకై ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. విద్యార్థులకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. 
 
వృషభం: ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. ఖర్చులు తగ్గించుకోవాలనే మీ ప్రయత్నం అనుకూలించదు. ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చూసుకోవడం ఉత్తమం. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో సఫలీకృతులవుతారు. ఆభరణాలు, వస్త్రాలు, గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. క్రయ విక్రయాలు లాభసాటిగా వుంటాయి. 
 
మిథునం: మీ గౌరవానికి భంగం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. వృత్తుల, క్యాటరింగ్ పనివారలకు అన్నివిధాలా కలిసి రాగలదు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. మీ కళత్ర సహకారంతో ఒక సమస్య పరిష్కారం కాగలదు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. ప్రేమికులకు సన్నిహితులు అండగా నిలుస్తారు. 
 
కర్కాటకం: ఆత్మీయులు, కుటుంబీకుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. మీ అత్యుత్సాహం అనర్ధాలకు దారితీస్తుంది. కానుకలు, నగదు బహుమతులతో షాపు పనివారలను సంతృప్తి పరుస్తారు. ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమ ఫలితం. మీ వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
 
సింహం: కొత్త ఆలోచనలతో భవిష్యత్ నిర్ణయాలు తీసుకుంటారు. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా కొనసాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రుణాలు తీరుస్తారు. 
 
కన్య: విద్యార్థులు క్రీడ, క్యాంపస్ ఎంపికల్లో రాణిస్తారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యం. హోటల్, తినుబండారాల వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ముఖ్యులతో సంభాషించేటప్పుడు మెళకువ వహించండి. కొన్ని సమస్యల పరిష్కారానికి గత అనుభవాలు తోడ్పడుతాయి. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలేర్పడతాయి.
 
తుల: సేల్స్ సిబ్బంది, కొనుగోలుదార్లను ఓ కంట కనిపెట్టండి. దూరపు బంధువుల కలయిక చక్కని అనుభూతినిస్తుంది. ఇతరులపై ఆధారపడకుండా స్వయంకృషినే నమ్ముకోవడం శ్రేయస్కరం. లీజు, ఏజెన్సీ, టెండర్ల వ్యవహారాల్లో పునరాలోచన చాలా అవసరం. మీ తోటివారికి బహుమతులు ఇచ్చి ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. 
 
వృశ్చికం: క్రీడ, కళా, రచన, పత్రికా రంగాల్లో వారికి గుర్తింపు లభిస్తుంది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. నమ్మినవారే మోసం చేయడం వల్ల ఆందోళన చెందుతారు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. రావలసిన ధనం సకాలంలో అందుకుంటారు. ప్రయాణాల్లో చికాకులు తప్పవు.
 
ధనస్సు: ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. బంధువుల రాకతో ఆకస్మికంగా ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు లాభదాయకం. విద్యార్థినులకు వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. 
 
మకరం: కిరాణా వ్యాపారులకు సామాన్యంగా ఉండగలదు. నిరుద్యోగులకు మధ్యవర్తుల పట్ల అప్రమత్తతత అవసరం. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. ఒక వ్యవహారం నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మీరు చేసే పనులకు బంధువుల నుంచి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. 
 
కుంభం: ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగాల్సి వస్తుంది. ఉపాధ్యాయులకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయి. ఏదైనా అమ్మకానికై చేయు ఆలోచన వాయిదా పడటం మంచిది. స్త్రీలకు ఇతరులతో పోటీపడాలనే ధోరణి మంచిది కాదు. 
 
మీనం: మీ మాటకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్లీడర్లకు తమ క్లయింట్‌ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. ఉద్యోగస్తులకు పై అధఇకారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. మిత్రులతో కలహాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి చెందుతారు. ప్రయాణ రీత్యా ధన వ్యయం మానసిక ప్రశాంతత కరువవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

కోనసీమపై దిష్టి కామెంట్లు.. డిప్యూటీ సీఎంగా అనర్హుడు... ఆయన్ని తొలగించాలి.. నారాయణ

Stray Dogs: వీధికుక్కలతో తంటాలు.. వరంగల్‌లో వ్యక్తిని వెంబడించాయి.. డ్రైనేజీలో పడి మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

Tirupati Central Zone: తిరుపతిని సెంట్రల్ జోన్‌గా వుంచి.. ఆధ్యాత్మికత అభివృద్ధి చేస్తాం.. అనగాని

Bhauma Pradosh Vrat 2025: భౌమ ప్రదోషం.. శివపూజ చేస్తే అప్పులు మటాష్.. ఉపవాసం వుంటే?

02-12-2025 మంగళవారం ఫలితాలు - ఖర్చులు అధికం, ప్రయోజనకరం...

చాగంటి వల్లే అరుణాచలం ఆలయం తెలుగు భక్తుల రద్దీ పెరిగింది : నటుడు శివాజీరాజా

Karthigai Deepam: అరుణాచలేశ్వరం.. కార్తీక దీపం ఉత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం..

తర్వాతి కథనం
Show comments