Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

07-01-2020 మంగళవారం మీ రాశిఫలాలు - కార్తికేయుడిని పూజించినా...

07-01-2020 మంగళవారం మీ రాశిఫలాలు - కార్తికేయుడిని పూజించినా...
, మంగళవారం, 7 జనవరి 2020 (05:00 IST)
మేషం : దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. పారిశ్రామిక రంగాలలోని వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. బేకరీ, తినుబండరాల వ్యాపారులకు లాభదాయకం. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా మీ తెలివితేటలతో పూర్తి చేయగలుగుతారు. 
 
వృషభం : ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పదు. నిరుద్యోగుల ఉపాధి పథకాలు  సంతృప్తికరంగా సాగుతాయి. ముఖ్యుల రాకపోకల వల్ల అనుకోని ఖర్చులు అధికమవుతాయి. విద్యార్థులకు ఏకాగ్రత చాలా అవసరమని గమనించండి. గృహంలో మార్పులు, చేర్పులకై చేయు యత్నాలు ఫలిస్తాయి. 
 
మిథునం : మీరు ఇరుల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు నిరంతర కృషి అవసరమని గమనించండి. అనవసరపు సంభాషణల వల్ల ముఖ్యులతో ఆకస్మిక అభిప్రాయభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిది. 
 
కర్కాటకం : విద్యార్థుల అత్యుత్సాహం అనర్థాలకు దారితీసే ఆస్కారం ఉంది. ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. యాధృచ్ఛికంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. పాతమిత్రుల కలయికతో మీలో కొత్త ఉత్సాహం, ఆలోచనలు స్ఫురిస్తాయి. ఇప్పటివరకు వాయిదాపడుతున్న పనులు పునఃప్రారంభమవుతాయి. 
 
సింహం : కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్వయం కృషితో అనుకున్నది సాధిస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. ఎంతో కొంత పొదుపు చేయాలనే మీ ఆలోచన ఫలించదు. 
 
కన్య : వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారులు పనివారలను కనిపెట్టడం మంచిది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. సోదరీ సోదరుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, పనిభారం తప్పవు.
 
తుల : దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలకు అధిక శ్రమ వల్ల నరాలు, కళ్లు, తలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. పెట్టుబడులు, స్పెక్యులేషన్‌లలో ఆచితూచి వ్యవహరించండి. పీచు, ఫోం లెదర్, వ్యాపారులకు కలిసిరాగలదు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
వృశ్చికం : ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. విద్యార్థుల ఆలోచనల పక్కదారి పట్టకుండా తగు జాగ్రతతో ఉండటం క్షేమదాయకం. తోటివారితో స్నేహభావంతో సంచరిస్తాయి. రుణం కొంత మొత్తం తీర్చడంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు. 
 
ధనస్సు : రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. పాత రుణాలు తీరుస్తారు. మానసిక ప్రశాంతత కోసం దేవాలయాలు సందర్శిస్తారు. తొందరపడి వాగ్ధానాలు చేయుట వల్ల మాటపడక తప్పదు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
మకరం : బ్యాంకింగ్ రంగాల్లో వారికి మెళకువ అవసరం. గత విషయాలు జ్ఞప్తికిరాగలవు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఉద్యోగస్తులు తోటి పనివారలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిర్మాణ పనులలో జాప్యం, పెరిగిన వ్యయం ఆందోళనకు గురిచేస్తారు. వైద్యులు ఆపరేషన్లు చేయునపుడు ఏకాగ్రత అవసరం. 
 
మీనం : లీజు, ఏజెన్సీ, వాణిజ్య ఒప్పందాలు వాయిదాపడటం మంచిది. విద్యార్థులకు అనుకోని చికాకులు ఎదురవుతాయి. రుణయత్నంలో ఆటంకాలు తొలగిపోతాయి. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు తప్పవు. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో ఏకీభావం కుదరదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకుంఠ ఏకాదశి: తిరుమలలో గోవింద నామ స్మరణ-Video