నేడే చంద్రగ్రహణం... ఆ సమయంలో తోడేళ్లు ఏం చేస్తాయంటే?-Video

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (14:26 IST)
ఈ రోజు రాత్రి రాత్రి 10 గంటల 37 నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. ఐతే ఈ చంద్రగ్రహణాన్ని అమెరికాలో 'ఉల్ఫ్ మూన్ ఎక్లిప్స్'(తోడేలు చంద్రగ్రహణం) అని పిలుస్తారు. ఇలా ఎందుకు పిలుస్తారంటే.. జనవరి నెలలో అమెరికాలో దట్టమైన మంచు అలముకుని వుంటుంది. కనుక అక్కడ తినేందుకు ఆహారం దొరకని తోడేళ్లు జనావాసాల్లోకి వస్తాయట. అలా వచ్చినవి ఊళ పెడుతూ అరుస్తాయట. అందువలన దీన్ని ఊల్ఫ్ మూన్ ఎక్లిప్స్ అని పిలుస్తారు.
 
ఇక మన దేశం విషయానికి వస్తే... గ్రహణ సమయంలో ''ఓం క్షీర పుత్రాయ విద్మహే, అమృత తత్వాయ ధీమహి తన్నో చంద్ర ప్రచోదయాత్'' అనే చంద్ర గాయత్రి మంత్రంతో జపము చేసుకోవచ్చు. గ్రహణం అనంతరం నదీ స్నానం చేసి.. నదీ తీరంలో అనుష్టానం చేసుకోవడం పుణ్యప్రదమని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
 
చంద్రగ్రహణం సమయంలో పాటించవలసిన నియమాలు ఏమిటో చూద్దాం. గ్రహణ కాలానికి 9 గంటల ముందే భుజించాలనేది నియమం. శుభ ఫలము ఉన్న రాశివారు తమ శక్తికొలది దానాలు చేసుకోవచ్చు. ఇందుకు సరైన సమయమేమిటో పండితులను అడిగి తెలుసుకోవాలి. మధ్యమ ఫలము ఉన్నవారితోపాటు అధమ ఫలము ఉన్నవారు కూడా వస్త్ర, ధాన్య, శాకాది, దానాలను శక్తికొద్దీ చేసుకోవాల్సి ఉంటుంది.
 
గ్రహణ కాలం వరకూ దేవతామూర్తుల పైన, అలాగే నిల్వ ఉండే ఊరగాయ, ధాన్యము, నీరు మొదలైన వాటిలో దర్భ వేసి గ్రహణ అనంతరం తీసి వేయాలి. గ్రహణం ముగిసిన మరుసటి రోజు దేవతా మందిరాన్ని, దేవతామూర్తులను శుద్ధి పరచుకోవాలి. గ్రహణ సమయంలో దేవతా పూజలు అభిషేకాలు చేయరాదు. ఉపదేశిత మంత్రము లేదా ఏదైనా దేవతా నామాన్ని జపిస్తే గణనీయ ఫలము సిద్ధిస్తుంది.
 
ఈరోజు రాత్రి ఏర్పడుతున్న చంద్రగ్రహణం 10.37 నిమిషాలకు ప్రారంభమై అర్థరాత్రి 2 గంటల 42 నిమిషాల వరకూ సాగుతుంది. ఈ గ్రహణం మిధున రాశిలో ఏర్పడుతుంది కనుక ఆ రాశి వారు గ్రహణాన్ని చూడకుండా వుంటే మంచిది. ఈ రాశి వారిపైన గ్రహణం ప్రభావం తీవ్రంగా వుంటుంది జ్యోతిష నిపుణులు చెపుతున్నారు. మొత్తం 4 గంటల పాటు సాగే ఈ చంద్రగ్రహణం మన దేశంతో పాటు ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆఫ్రికాల‌లో దర్శనమివ్వనుంది. 
 
ఇకపోతే మిగిలిన 11 రాశుల వారి విషయంలో చంద్రగ్రహణ ప్రభావం ఎలా వుంటుందో చూద్దాం. కర్కాటకం, సింహ, తుల, మకర రాశులపైన కూడా ప్రభావం వుంటుంది. మేషం, కన్య, వృశ్చిక, మీన రాశుల వారికి శుభం. తుల, వృషభ, ధనుస్సు, కుంభ రాశులవారికి మధ్యమ ఫలితం వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లాగార్డియా విమానాశ్రయం.. ఎయిర్ కెనడా పోర్ట్ వాహనాన్ని ఢీకొట్టింది.. ఏమైందంటే?

స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌‌ను తెరవాలి.. లేకుంటే దాడులే.. అమెరికా వార్నింగ్

అనంతపురం బత్తాయి మార్కెట్‌లో భారీగా పడిపోయిన ధరలు

హైదరాబాదులో తేలికపాటి వర్షం.. వేసవి తాపం నుంచి ఉపశమనం

ఇరాన్‌తో ప్రపంచానికి ముప్పు : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

అన్నీ చూడండి

లేటెస్ట్

20-03-2016 శుక్రవారం ఫలితాలు - ధన సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి..

ఇరాన్‌పై దాడి: తిరుమలలో మూతపడిన హోటల్స్.. టీ కూడా దొరక్కట్లేదు.. భక్తుల కష్టాలు

తిరుమల లడ్డూలలో కల్తీకి ఇక చెక్ : FSSAI ల్యాబ్ త్వరలో ప్రారంభం

భద్రాచలంలోని శ్రీరామనవమి- కల్యాణోత్సవానికి రేవంత్ రెడ్డికి పిలుపు

ఉగాది విశిష్టత.. 60 సంవత్సరాలు నారద మహర్షి సంతానమే.. పరాభవంతో భయం లేదు

తర్వాతి కథనం
Show comments