Webdunia - Bharat's app for daily news and videos

Install App

10-01-2020 శుక్రవారం మీ రాశిఫలాలు - పార్వతీదేవిని పూజించిన మనోవాంఛలు...

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (05:00 IST)
మేషం : బంధుమిత్రుల నుంచి నష్టూరాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదు. విదేశీయానం, రుణ యత్నాల్లో ఆటంకాలు, చికాకులు తప్పవు. షాపు, గుమస్తాలు, అకౌంటెంట్లకు ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. పుణ్యకార్యాలలో ప్రముఖంగా వ్యవహరించి ప్రశంసలు పొందుతారు. 
 
వృషభం : చేతిలో ధనం మితంగా ఉండటంతో ఆందోళన చెందుతారు. స్త్రీలు అపరిచితులతో మితంగా సంభాషించండి. కంప్యూటర్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం వంటి చికాకులు తప్పవు. ఉద్యోగస్తులు పెండింగ్ పనులపై దృష్టిసారిస్తారు. నూతన దంపతుల్లో ఉత్సాహం, అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. 
 
మిథునం : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించండి. ఐరన్, సిమెంట్, కలప వ్యాపారస్తులకు మందకొడిగా ఉండగలదు. మీపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యల ప్రభావం అధికం. చిన్ననాటి మిత్రులతో గత అనుభవాలు ముచ్చటిస్తారు. మీ గౌరవ, అభిమానాలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించండి. 
 
కర్కాటకం : గృహవాస్తు దోష నివారణకు వల్ల సత్ఫలితాలుంటాయి. బంధువుల నుంచి విమర్శలు తప్పవు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసివస్తాయి. దైవ, పుణ్య, సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. లాయరు నోటీసు ఆందోళన కలిగిస్తుంది. 
 
సింహం : సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. రుణం తీసుకోవడం, ఇవ్వడం క్షేమంకాదని గమనించండి. పత్రికా, మీడియా రంగాలవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. 
 
కన్య : ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నిరుత్సాహం, పనిభారం వంటి చికాకులు అధికం. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. దూరప్రయాణాలు అనుకూలించవు. ప్రయాణాలోనూ, బ్యాంకు వ్యవహారాలలోనూ ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడంతో పాటు స్వల్ప లాభాలు గడిస్తారు. 
 
తుల : హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. స్త్రీలకు టీవీ చానెళ్ళ నుంచి ఆహ్వానం, కానుకలు అందుతాయి. అధికారులకు కిందిస్థాయి సిబ్బంది పనితీరు సంతృప్తినిస్తుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఒక వ్యవహార నిమిత్తం తరచూ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. 
 
వృశ్చికం : సభలు, సాంస్కృతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మార్కెట్ రంగాలవారు తమ టార్గెట్లను పూర్తిచేస్తారు. మీ పురోభివృద్ధి మీ చేతుల్లోనే ఉందని గమనించండి. పాత బిల్లులు చెల్లిస్తారు. మీ మాటకు సర్వత్రా మంచి స్పందన లభిస్తుంది. ఫ్యాన్సీ, మందులు, రసాయనిక, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసిరాగలదు. 
 
ధనస్సు : మీ పొదుపరితనం కుటుంబ సభ్యులకు చికాకు కలిగిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయుల శ్రమకు మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. వాహనం ఏకాగ్రతతో నడపడం క్షేమదాయకం. ఏకాగ్రత, పట్టుదలతో శ్రమించిన అనుకున్న లక్ష్యాలను సాధించగలరు. 
 
మకరం : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. రుణాల కోసం అన్వేషిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో మెళకువ అవసరం. మీ సంతానం కోసం ప్రయాణాలు సాగిస్తారు. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం కూడదు. మీ శక్తిసామర్థ్యాలు, నిజాయితీపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. 
 
కుంభం : అనుకున్న వ్యక్తుల కలయిక అనుకూలించక పోవడంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. స్త్రీలకు నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. తరచుగా తెలియక చేసిన పొరపాట్లకు ప్రశ్చాతాపడుతారు. ముక్కుసూటిగా పోయే మీ స్వభాం వల్ల ఇబ్బందులెదుర్కొంటారు. 
 
మీనం : ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలు, తోటివారి ప్రశంసలు లభిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి. ధనం కంటె ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇస్తారు. ఒక స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. మంచివారితో పరిచయం మీ అభివృద్ధికి దోహదపడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

లేటెస్ట్

16-02-2025 నుంచి 22-02-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరి దేవస్థాన బోర్డు

16-02-2025 ఆదివారం రాశిఫలాలు - ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు...

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మెగాస్టార్‌కు ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments