Webdunia - Bharat's app for daily news and videos

Install App

07-03-2021- ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఆదిత్య హృదయం చదివినా..?

Webdunia
ఆదివారం, 7 మార్చి 2021 (05:00 IST)
Adithya hrudayam
ఆదిత్య హృదయం చదివినా లేక విన్నా సర్వదా శుభం కలుగుతుంది. 
 
మేషం: ఆర్థిక సంతృప్తి ఆశించినంతగా వుండదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్త్రీలు వస్త్రాలు, గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. రావలసిన పాత బాకీల వసూలులో శ్రమాధిక్యత ప్రయాసలు తప్పవు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
వృషభం: ఆర్థిక వ్యవహారాలు, నూతన పెట్టుబడులకు సంబంధించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. ఉపాధ్యాయులకు విశ్రాంతి పొందుతారు. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి. 
 
మిథునం: కాంట్రాక్టర్లకు పనివారితో సమస్యలు తప్పవు. ఆలయాలను సందర్శిస్తారు. ఆత్మీయుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. సాహస ప్రయత్నాలు విరమించండి. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు లేక అభివృద్ధి చేయాలనే దిశగా మీ ఆలోచనలుంటాయి. కిరణా, ఫ్యాన్సీ, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తి కానరాదు. 
 
కర్కాటకం: మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు కలిసిరాగలదు. క్రీడా, కళా రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. మీ యత్నాలకు ప్రముఖుల నుంచి సహాయ సహకారాలు అందిస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. స్నేహ బృందాలు అధికమవుతాయి. 
 
సింహం: స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల భంగపాటుకు గురవుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల రాకతో గృహంలో ఖర్చులు అధికమవుతాయి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం త్వరలోనే కార్యరూపం దాల్చుతుంది. 
 
కన్య: విద్యార్థులకు అతి ఉత్సాహం వల్ల సమస్యలు తలెత్తుతాయి. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి వల్ల ఆందోళనలకు గురవుతారు. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. దైవ, సేవా కార్యక్రమాల్లో ఏకాగ్రత వహిస్తారు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం.
 
తుల: కొబ్బరి, పండు, పూలు, పానీయ, చిరు వ్యాపారులకు లాభం. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. మీ లక్ష్య సాధనలో ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. కమ్యూనికేషన్, కంప్యూటర్, వైజ్ఞానిక రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి.
 
వృశ్చికం: ఆర్థిక పరిస్థితిల్లో ఆశాజనకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. స్త్రీల పట్టుదల, మొండి వైఖరి వల్ల గృహంలో ప్రశాంతత లోపిస్తుంది. సన్నిహితుల సూచనలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమించాల్సి వుంటుంది. 
 
ధనస్సు: నిరుద్యోగులకు వచ్చిన అవకాశం చేజారిపోయే ఆస్కారం వుంది. ఖర్చులు పెరిగినా అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా వుండటం క్షేమదాయకం. ప్రేమికులకు మిత్రుల ద్వారా సహాయ సహకారాలు అందగలవు. రుణయత్నాలు, చేబదుళ్ళు తప్పవు.
 
మకరం: విదేశీయాన ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. మిత్రులను కలుసుకుంటారు. స్త్రీలలో ఉత్సాహం, పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. శాంతియుతంగా వ్యవహరిస్తే మీ సమస్యలు సానుకూలమవుతాయి. ఆస్తి వ్యవహారాల్లో సోదరుల తీరు మనస్తాపం కలిగిస్తుంది. ఖర్చులు పెరిగినా మీ ఆర్థిక పరిస్థితికి లోటుండదు.
 
కుంభం: ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. మిమ్మల్ని చూసి ఈర్ష్యపడేవారు అధికమవుతున్నారని గమనించండి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు అధికం. చిన్ననాటి మిత్రులను కలుసుకుటారు. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. 
 
మీనం: దంపతుల మధ్య అరమరికలు లేకుండా మెలగవలసి వుంటుంది. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో మెళకువ అవసరం. మిత్ర బృందాల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం వుంది మెళకువ వహించండి. ప్రయాణాలు, వ్యూహాల అమలులో జాగ్రత్త అవసరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

బ్లాక్ బ్యూటీ మిస్ వరల్డ్ శాన్ రేచల్ ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

Shani Dev: శనిదేవుడిని శాంతింపజేయాలంటే ఈ మంత్రాలు పఠించాలి.. నలుపు రంగు దుస్తులు?

12-07-2025 శనివారం దినఫలితాలు - పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి...

11-07-2025 శుక్రవారం దినఫలితాలు - ఖర్చులు అంచనాలను మించుతాయి...

09-07-2025 గురువారం దినఫలితాలు - పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి...

Guru Purnima 2025: గురు పౌర్ణమి- ఇంద్రయోగం.. మిథునం- కన్యాతో పాటు ఆ రాశులకు శుభం

తర్వాతి కథనం
Show comments