Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

05-03-2021 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని ఆరాధించినా...

Advertiesment
05-03-2021 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని ఆరాధించినా...
, శుక్రవారం, 5 మార్చి 2021 (04:00 IST)
మేషం : వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి పని ఒత్తిడి అధికం కాగలదు. సిమెంట్, కలప వ్యాపారస్థులకు అనుకూలత. ముఖ్యుల రాకతో మీ కార్యక్రమాలు వాయిదాపడతాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అకౌంట్స్, ఇంజనీరింగ్ రంగాల వారికి పనిభారం తప్పవు.
 
వృషభం : కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. మీ సంకల్పం నెరవేరడానికి ఓర్పు, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికం. స్త్రీలు తెలియని అశాంతికి లోనవుతారు. చిన్న చిన్న విషయాల్లో కుటుంబీకులతో ఏకీభావం కుదరదు. 
 
మిథునం : వైద్య, ఇంజనీరింగ్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి. అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. పెరిగిన ఖర్చులు, ఇతరాత్రా అవసరాలు మీ ఆర్థిక స్థితికి అవరోధంగా నిలుస్తాయి. 
 
కర్కాటకం : మీ సంతానం విపరీత ధోరణి వల్ల కించిత్ ఆందోళన చెందుతారు. రుణం తీర్చడానికి చేసే యత్నం వాయిదాపడుతుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారిలో నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తి సాగుతాయి. విద్యార్థులు తొందరపాటు తన వదిలి ఏకాగ్రతతో చదివిన సత్ఫలితాలను పొందగలరు. 
 
సింహం : పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో పెద్దల సలహా పాటించండి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. సందర్భం లేకుండా నవ్వడం వల్ల కలహాలు ఎదుర్కోవలసి వస్తుంది. దైవ, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బాంధవ్యాలు మానసికానందాన్ని కలిగిస్తాయి. 
 
కన్య : ఆర్థిక వ్యవహారాల్లో నిరుత్సాహం తప్పదు. వ్యాపారాలలో ఆశించినంత లాభాలను పొందుతారు. సన్నిహితులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి. విద్యార్థులకు వాహనం నపుడుపుతున్నపుడు తగు జాగ్రత్తలు అవసరం. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. 
 
తుల : ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదపడతాయి. నూతన దంపతులు కొత్త అనుభూతులకు లోనవుతారు. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. సంఘంలో మీ మాటకు ఖ్యాతి లభిస్తుంది. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి చూపుతారు. 
 
వృశ్చికం : ఆర్థిక సంతృప్తి కానవస్తుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో వారికి ఒత్తిడి అధికమవుతుంది. కిరాణా, ఫ్యాన్సీ రంగాల్లో వారికి కలిసిరాగలదు. మీమాటతీరు, పద్ధతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. రుణ విముక్తులు కావడంతో మనస్సు తేలికపడుతుంది. మీ మాటలు ఇతరులకు చేరవేసే వ్యక్తులున్నారన్న విషయం గమనించండి. 
 
ధనస్సు : వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఆశాజనకం. దూర ప్రయాణాల్లో సంతృప్తికానవస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ధ్యాస వహిస్తారు. ఎట్టిపరిస్థితుల్లో సహనాన్ని పరీక్షించవద్దు. ముఖ్యులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. 
 
మకరం : ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారికి కలిసిరాగలదు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అతి కష్టంమీద ఫలిస్తాయి. బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటాయి. విద్యార్థులకు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత అవసరం. వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
కుంభం : బంధువులను కలుసుకుంటారు. అధిక మొత్తంలో రుణం చేస్తారు. కిరాణా ఫ్యాన్సీ ముఖ్యుల ఆదరణ కోసం ప్రయత్నిస్తారు. నిరుద్యోగులు చిన్న సదావకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాల్లో చికాకులు ఎదుర్కోక తప్పదు. 
 
మీనం : ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలు. స్త్రీలకు నూతన వస్తువుల  పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారులకు సంతృప్తి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

04-03-2021- గురువారం మీ రాశి ఫలితాలు.. సాయిబాబాను ఆరాధించడం వల్ల..?