Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

04-03-2021- గురువారం మీ రాశి ఫలితాలు.. సాయిబాబాను ఆరాధించడం వల్ల..?

Advertiesment
04-03-2021- గురువారం మీ రాశి ఫలితాలు.. సాయిబాబాను ఆరాధించడం వల్ల..?
, గురువారం, 4 మార్చి 2021 (05:00 IST)
సాయిబాబాను ఆరాధించడం వల్ల శుభం, జయం చేకూరుతుంది. 
 
మేషం: కొంత ఆలస్యంగానైనా అనుకున్న పనులు సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. మిత్రుల సలహా పాటించి లబ్ధి పొందుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. పత్రికా, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కివస్తాయి. 
 
వృషభం: ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత అవసరం. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. స్త్రీల అభిప్రాయాలకు ఆశించినంత స్పందన ఉండదు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. 
 
మిథునం: వృత్తి వ్యాపారులు సజావుగా సాగుతాయి. పెద్దల ఆరోగ్య, ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి. బద్ధకాన్ని వదిలి చురుగ్గా వుండండి. మొండిబాకీల వసూలు యత్నాలు సఫలీకృతం అవుతాయి. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరం. సహనంతో వ్యవహరిస్తే అన్ని విషయాల్లో జయం మీదే. 
 
కర్కాటకం: ఉద్యోగస్తులకు తోటివారి వల్ల అధికారులతో మాటపడవలసి వస్తుంది. పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఏకాగ్రత ముఖ్యం. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. కొన్ని సందర్భాల్లో మాత్రం చేయాల్సి పనులు ఆకస్మాత్తుగా వాయిదా పడుతాయి. క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. 
 
సింహం: చిన్న తప్పిదమైనా పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థులు మానసికంగా కుదుటపడతారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. రిప్రజెంటేటివ్‌లు, పోస్టల్, ఎల్ఐసి, ఏజెంట్లు అతికష్టం మీద టార్గెట్‌ను పూర్తి చేస్తారు. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. 
 
కన్య: అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. కంప్యూటర్ రంగాల వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఏ పని తలపెట్టినా తిరిగి మొదటికే వస్తుంది. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. 
 
తుల: మిమ్మల్ని పొగిడే వారిని ఓ కంట కనిపెట్టడం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించండి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలం. అధికారులు ధన ప్రలోభాలకు దూరంగా వుండటం క్షేమదాయకం. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది.
 
వృశ్చికం: ఇంటా బయటా స్త్రీల ఆధిపత్యం కొనసాగుతుంది. చివరి క్షణంలో చేతిలో ధనం అందక ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. షేర్లు, క్రయ విక్రయాలు సామాన్యం. విద్యార్థినులు భయాందోళనలు వీడి శ్రమించినట్లైతే సత్ఫలితాలు లభిస్తాయి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందులకు గురవుతారు.
 
ధనస్సు: దంపతుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. వ్యాపారాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తారు. స్వయం కృషితో రాబడికి మించి ఖర్చులుంటాయి. ఏమాత్రం పొదుపు సాధ్యం కాదు. ఆస్తి పంపకాల విషయంలో పెద్దల జోక్యం అనివార్యమవుతుంది. వృత్తిపరంగా ఎదురైన సమస్యలను అధికమిస్తారు.
 
మకరం: వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. విద్యార్థులపై తోటివారి ప్రభావం అధికంగా వుంటుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. మీ బాధ్యతలను ఇతరులకు అప్పగించడం మంచిది కాదు. హోదాలో వున్న అధికారులకు ఆకస్మిక స్థానచలనం కలదు. ఏ పని తలపెట్టినా తిరిగి మొదటికే వస్తాయి.
 
కుంభం: ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తే ఆస్కారం వుంది. ఏమాత్రం పొదుపు సాధ్యం కాదు. ఉద్యోగస్తులు అందరితో సఖ్యతగా మెలుగుతూ తమ పనులు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. 
 
మీనం: ఎల్ఐసి పోస్టల్ ఏజెంట్లకు శ్రమ తప్పదు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. గతంలో మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత అవసరం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గృహంలో వాస్తు దోషాలుంటే.. శ్రీకాళహస్తికి వెళ్ళాలట!