Webdunia - Bharat's app for daily news and videos

Install App

02-01-2021 శనివారం రాశిఫలు - ఆంజనేయ స్వామిని ఆరాధించినా...

Webdunia
శనివారం, 2 జనవరి 2021 (05:00 IST)
మేషం : దైవకార్యక్రమాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ప్రింటింగ్ రంగాల వారికి మందకొడిగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. బ్యాంకు పనుల్లో అలసత్వం వల్ల కించిత్ ఇబ్బందులెదుర్కొంటారు. మీరంటే కిట్టని వారు సైతం మీ సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. 
 
వృషభం : ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో చికాకులు తప్పవు. ప్రముఖ కంపెనీల షేర్లు విలువలు పుంజుకుంటాయి. విద్యార్థులకు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో చికాకులు వంటివి అధికమవుతాయి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
మిథునం : ఆర్థిక లావాదేవీలు, భాగస్వామిక చర్చల్లో ఖచ్చితంగా వ్యవహరించండి. ఏజెంట్లు, బ్రోకర్లకు సామాన్యం. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఖర్చులు అధికమవుతాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కోర్టు వాదోపవాదాల్లో ఫ్లీడర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
కర్కాటకం : పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం ధోరణి నిరుత్సాహం కలిగిస్తుంది. ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. విద్యార్థుల అత్యుత్సాహం అనర్థాలకు దారితీసే ఆస్కారం ఉంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. 
 
సింహం : యాధృచ్ఛికంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో నిరుత్సాహం  తప్పదు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి ఒత్తిడి పనిభారం అధికం. విద్యార్థులు, క్రీడా పోటీలు, కళా, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణిస్తారు. 
 
కన్య : కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. బంధు మిత్రుల రాకతో ఖర్చులు పెరిగినా భారమనిపించవు. భాగస్వామిక చర్చలు ప్రశాంతంగా ముగుస్తాయి. ఎంతో కొంత పొదుపు చేయాలనే మీ ఆలోచన ఫలించదు. అపుడపుడు మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. 
 
తుల : ఇతరుల వ్యవహారాలు, ఆంతరంగిక విషయాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, కొత్త విషయాల పట్ల అవగాహన నెలకొంటాయి. ప్రముఖులను కలుసుకుంటారు. దైవ, సేవా కార్యక్రమాలు, వేడుకల్లో చురుకుగా పాల్గొంటారు. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. 
 
వృశ్చికం : కాంట్రాక్టర్లకు పనివారలతో చికాకులు తప్పవు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలనిస్తాయి. మీ బలహీనతలను ఆసరా చేసుకుని కొంతమంది లబ్ధి పొందాలని చూస్తారు. విదేశాలు వెళ్లడానికి చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారులు, తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి. 
 
ధనస్సు : వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ, ఆల్కహాలు, మందుల వ్యాపారాలు ఊపందుకుంటాయి. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత కొత్త విషయాల పట్ల అవగాహన నెలకొంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసివస్తాయి. రాజకీయ నాయకులు సభా సమావేశాలలో పాల్గొంటారు. 
 
మకరం : కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు లాభదాకయంగా ఉంటుంది. ప్రముఖులు, ఉన్నతస్థాయి అధికారులు ధనప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. హామీలు, మధ్యవర్తిత్వాల విషయంలో మొహమ్మాటాలు కూడదు. ఆలయాల్లో దైవ దర్శనాలు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి.
 
కుంభం : ఆర్థిక విషయాల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ అవసరాలకు కావలసిన ధనం ముందుగానే సర్దుబాటు చేసుకుంటారు. స్వయంకృషితోనే మీ యత్నాలు సానుకూలమవుతాయి. ఒక సమస్య పరిష్కారం కావడంతో కుటుంబ విషయాలు పట్ల దృష్టిసారిస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. 
 
మీనం : చేపట్టిన  పనులు అయిష్టంగానే పూర్తిచేస్తారు. విదేశాల్లోని ఆత్మీయుల పలకరింపులతో స్థిమితపడుతారు. మీ కుటుంబీకులతో ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం. ఉద్యోగస్తులు అధికారులకు శుభాకాంక్షలు, విలువైన బహుమతులు అందించి వారిని ప్రసన్నం చేసుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

ప్రభాస్‌తో అక్రమ సంబంధం అంటగట్టింది మీరు కాదా జగన్ రెడ్డీ? వైస్ షర్మిల (Video)

ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మిస్.. ఏమయ్యాయో చెప్పండి.. పవన్ కల్యాణ్

ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం... అదానీకో న్యాయమా? : కె.కవిత

గౌతమ్ అదానీ వ్యవహారం భారత ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

అన్నీ చూడండి

లేటెస్ట్

21-11-2024 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

భైరవ అష్టమి మహోత్సవం, 2024 రకాల మిఠాయిల భోగం, 84,000 చదరపు అడుగుల రంగోలీ ప్రపంచ రికార్డు

20-11-2024 బుధవారం ఫలితాలు - గృహం ప్రశాంతంగా ఉంటుంది...

19-11-2024 మంగళవారం ఫలితాలు - పిల్లల దూకుడు కట్టుడి చేయండి....

సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే?

తర్వాతి కథనం
Show comments